శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలోని ఆదర్శ పాఠశాలకు మౌలిక వసతులు కప్పించాలని, పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ పాఠశాలలో కేశరావుపేట, ఫరీద్‌పేట, ముద్దాడ, ఎచ్చెర్ల, కుశాల పురం, తమ్మినాయుడుపేటకు చెందిన సుమారు 150 మంది చదువుతున్నారని, బస్సు సౌకర్యం లేకపోవడంతో వారంతా ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందిని ఆయా గ్రామాలకు చెందిన సీతమ్మ, కుమారి, బి.చిన్నమ్మడు తదితరులు కొరారు.
ఎన్నికల ప్రభావంతో ఈ వారం కూడా గ్రీవెన్స్ సెల్ వెలవెలబోయింది. కలెక్టర్ సౌరభ్‌గౌర్, జాయింట్ కలెక్టర్ వీరపాండియన్, డావమా పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, డీఆర్‌డీఏ ఏపీడీ సావిత్రి, తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అందిన వినతుల్లో ముఖ్యమైనవి ఇవీ...
గార మండలం శ్రీకూర్మాంలోని ఏపీజీవీబీ కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు, స్వయంశక్తి సంఘాల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. రుణాలు ఇచ్చేలా చూడాలని కోరారు.
కోళ్ల ఫారం వల్ల జల, వాయు కాలుష్యం పెరుగుతోందని, గ్రామస్తులు అనార్యగ్యం పాలవుతున్నారని, వెంటనే దాన్ని ఎత్తివేయించాలని బూర్జ మండలం ఆద్దూరిపేట సవర సింహాచలం, తోటయయ్య, పెంటయ్య తదితరులు కోరారు.
ఈ విషయమై పలుమార్లు గిరిజన సంక్షేమ శాఖ డీఓకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అన్నారు.పాతపట్నం నియోజకవర్గంలోని 5 మండలాల్లో వీఎస్‌ఎస్‌ల పేరిట వాటర్‌షెడ్‌ల నిర్మాణానికి ఒక్కొక్క మండలానికి *12 కోట్లు మంజూరుచేశారని, వీటితో పనులు చేపట్టి బాగున్న వాటినీ పాడుచేస్తున్నారని కొత్తూరు మండలం నేరడికి చెందిన కంబాల కృష్ణారావు ఫిర్యాదు చేశారు. పాడైన వాటిని బాగు చేయించాలని, నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.
వంశధార నిర్వాసిత గ్రామాలైన మోదుగువలస, కొల్లివలసల్లో ఉపాధి హమీ పనులు కల్పించాలని, ఆ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పోస్టులను బర్తీచేయాలని, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల బిల్లులు మంజూరు చేయాలని, విద్యుత్ సదుపాయం పూర్తి స్థాయిలో కల్పించాలని బి.మల్లేసు, వై.చంద్రరావు, జి.శ్రీనివాసరావు, తదితరులు విజ్ఞప్తి చేశారు.
మౌలిక వసతులు కల్పించరూ...
Published Tue, Mar 25 2014 2:00 AM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
Advertisement