అసువులు బాసిన ఉద్యమ నేత | Inmates in the pile collapsed with a heart attack YSR CP leader Divakar | Sakshi
Sakshi News home page

అసువులు బాసిన ఉద్యమ నేత

Published Sat, Oct 5 2013 4:28 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Inmates in the pile collapsed with a heart attack YSR CP leader Divakar

ముమ్మిడివరం, న్యూస్‌లైన్ : ఉద్యమమే ఊపిరిగా సమైక్యాంధ్ర రక్షణ కోసం శ్రమించిన వైఎస్సార్ సీపీ నేత గిడ్డి దివాకర్ (55) ఉద్యమంలోనే తుదిశ్వాస విడిచారు. అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ముమ్మిడివరం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం చేసిన రిలే దీక్షల్లో పాల్గొన్న దివాకర్ గుండెపోటుకు గురై వేదికపైనే కుప్పకూలారు. ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందా రు. ఆయనకు భార్య సావిత్రి, కుమారులు గోపీచంద్, సూర్యచంద్ ఉన్నారు. 
 
 దివాకర్ నడవపల్లి పంచాయతీ శివారు గిడ్డివారిపేట వాసి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమాని. వైఎస్సార్ కాంగ్రెస్ కాట్రేనికోన మండ ల సేవాదళ్ కన్వీనర్‌గా సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో దివాకర్ భౌతికకాయాన్ని మాజీమంత్రి పినిపే విశ్వరూప్ సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయం వరకు ఊరేగించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గుత్తుల సాయి, ఇంకా నలమాటి లంకరా జు, జగతా బాబ్జీ శ్రద్ధాంజలి ఘటించారు.
 
 ఉద్యమయోధుడు ‘దివాకర్’ 
 కాట్రేనికోన : దీక్షలో అసువులు బాసిన దివాకర్ ఉద్యమ చరిత్రలో యోధునిగా నిలిచిపోతారని వైఎస్సార్ కాంగ్రె స్ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కొనియాడా రు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గొల్ల బాబూరావు తదితరులు కాట్రేనికోన వచ్చి దివాకర్ భౌతికకాయం వద్ద నివాళులర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. బోస్ మాట్లాడుతూ పార్టీకి దివాకర్ సేవలు ఎనలేనివన్నారు.
 
 పార్టీ తరఫున ఆయన కుటుంబానికి రూ. లక్ష సహాయం అందజేస్తామని కుడుపూడి చిట్టబ్బా యి ప్రకటించారు. గొల్ల బాబూరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఎందరి గుండెలు ఆగిపోతున్నా కేంద్రప్రభుత్వ గుండె కరగడం లేదన్నారు. పార్టీ నేతలు గుత్తుల సా యి, మిండగుదిటి మోహన్, పి.కె.రావు, కర్రి పాపారాయుడు, భూపతిరాజు సుదర్శనబాబు, చెల్లుబోయిన శ్రీ ను, విత్తనాల వెంకటరమణ, కాలే రాజబాబు, పాలెపు  ధర్మారావు, దంతులూరి రవివర్మ శ్రద్ధాంజలి ఘటించారు.
 
 ద్వారంపూడి సంతాపం
 కాకినాడ సిటీ తాజామాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సిటీ పార్టీ కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్ కూడా దివాకర్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement