మండల కేంద్రాల్లో రైతు దీక్షలు: వైఎస్సార్ సీపీ పిలుపు | YSRCP called for Raithu Deekshalu in Mandal Zones | Sakshi
Sakshi News home page

మండల కేంద్రాల్లో రైతు దీక్షలు: వైఎస్సార్ సీపీ పిలుపు

Published Thu, Oct 10 2013 3:39 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

YSRCP called for Raithu Deekshalu in Mandal Zones

సాక్షి, గుంటూరు: వైఎస్సార్ సీపీ పిలుపుమేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో గురువారం రైతు దీక్షలు జరగనున్నాయని, పార్టీ శ్రేణులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆయన బుధవారం సాక్షితో మాట్లాడారు. 
 
 రాష్ట్ర విభజనతో రైతాంగానికి తీరని నష్టం జరగనుందని, రైతులు మొత్తం మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలకు వ్యవసాయ కార్మికులుగా వలస వెళ్లే దారుణ పరిస్థితి రానుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయాధారితమైన గుంటూరు జిల్లా మొత్తం బీడుభూములుగా మారే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో డెల్టా, సాగర్ ఆయకట్టు పూర్తిగా కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని, విభజనతో పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. 
 
 సమైక్యాంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే కేసీఆర్ పులిచింతల, పోలవరాన్ని అడ్డుకున్నారని, ఇక విభజిస్తే పరిస్థితి వేరే చెప్పనక్క ర్లేదని రాజశేఖర్ పేర్కొన్నారు. రైతాంగ శ్రేయస్సు కోసం పాటుపడుతోంది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని, రైతుల గురించి ఆలోచించి ఆమరణ దీక్షకు దిగింది జగన్‌మోహన్ రెడ్డి ఒక్కరేనన్నారు. విభజనతో రైతులకు జరిగే తీవ్ర నష్టాన్ని వివరించేలా వైఎస్సార్ సీపీ శ్రేణులు మండలాల్లో రైతు దీక్షలతో కదం తొక్కాలని పిలుపునిచ్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement