నిజామాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రోడ్లపై, చెత్తకుప్పల్లో పడిఉన్న కాగితపు జాతీయ జెండాలను హిందూ జన జాగృతి సమితి జిల్లా శాఖ బాధ్యులు సేకరించి శుక్ర వారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్‌కు అందజేశారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో కాగితాలతో తయారు చేసి ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ పారవేసిన జాతీయ జెండాలను పోగు చేశారు. వీటిని రాష్ట్ర ప్రభు త్వానికి పంపాలని ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ను కోరారు. రోడ్లపై లభించిన జాతీయ జెండాలను సరైన ప్రదేశంలో నిమజ్జనం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం హిం దూ జన జాగృతి సమితి జిల్లా సమన్వకర్త నేళ్ల తుకారాం మాట్లాడుతూ.. స్వాత్రంత్యం వచ్చి 67 ఏళ్లు అయినాకూడా జాతీయ జెండాకు జరుగుతున్న అవమానంపై ప్రభుత్వానికి చెప్పాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరమన్నారు. జాతీయ జెండాను అవమానపరిస్తే చట్టపరమైన శిక్షలు ఉంటాయనే విషయంపై, జాతీయ జెండా గురించి ప్రజానీకానికి అధికారులు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు.
దేవునిపల్లి : కామారెడ్డి పట్ణణంలోని స్టేషన్‌రోడ్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను అవమానించారు. వేడుకల అనంతరం కూడా రోడ్డు పక్కన రెండు రోజుల పాటు అలాగే ఉంచారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే సాయత్రం 5 గంటల వరకు జెండాను అవనతం చేయాల్సి ఉండగా శుక్రవారం సాయత్రం 6 గంటల వరకు కూడా అ లాగే ఉంచారు. అక్కడే ఉంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఈ జెండాను ఆవిష్కరించారని అక్క డి స్థానికులు తెలిపారు. దీంతో సదరు ఉద్యోగి వచ్చి జెండాను నెమ్మదిగా దింపాడు. విషయం తెలుసుకున్న పో లీసులు ఆ వ్యక్తిని ప్రశ్నించగా అక్కడి ఆలయం తరపున అం దరం కలిసి ఆవిష్కరించామని చెప్పాడు.
జాతీయ జెండాకు అవమానం ఇన్‌చార్జి కలెక్టర్‌కు అందజేత
Published Sat, Aug 17 2013 3:26 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement