జన సభ...ఘన ప్రభ | Intedute difficulties. Brush with perennial problems | Sakshi
Sakshi News home page

జన సభ...ఘన ప్రభ

Published Thu, Dec 19 2013 3:50 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Intedute difficulties. Brush with perennial problems

ఇంటెదుటే ఇబ్బందులు. నిత్యం సమస్యలతో సావాసం. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఈ బాధ్యతను ‘సాక్షి’ భుజానకెత్తుకుంది. అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా నిలచి బాధితుల గొంతు వినిపించేందుకు వేదికగా మారింది. ఇంకేం జనం గళం విప్పుతున్నారు. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్నింటికి ప్రజా సమక్షంలోనే అధికారులు పరిష్కరిస్తున్నారు. మిగిలినవాటికి స్పష్టమైన హామీ ఇచ్చి అమలు దిశగా కృషిచేస్తున్నారు. ఇదీ ‘జన సభల’ విజయం. ఉద్యమంలా కొనసాగుతున్న ప్రభంజనం.
 
 మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధిః ప్రజా సమస్యల పరిష్కారానికి నడుం కట్టిన ‘సాక్షి’ దినపత్రిక సారథ్యం లో సాగుతున్న ‘జన సభలు’ పరిష్కార వేదికలుగా మారుతున్నాయి.  తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్న వారికి ఇవి అద్భుత వేదికలుగా మారుతున్నాయి. దీంతో జ నం పెద్ద ఎత్తున హాజరై తమ గొంతు విని పిస్తున్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదులందించి పరిష్కారాలు కోరుతున్నారు.
 
 వీటి పట్ల  జిల్లా అధికార యంత్రాంగం కూడా శ్రద్ధచూపి ప్రజా నివేదనలను వినడానికి ముందుకు రావడంతో బాధితులకు ఉత్సాహాన్నిస్తున్నాయి. తొలుత ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ హాజరై జనసభలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చేపట్టిన జన సభలకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ శర్మన్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ రాజారాం, డీఆర్‌ఓ రాంకిషన్, ఆర్డీఓ హనుమంతరావు, తహసీల్దార్ యాదగిరి రెడ్డితో పాటు మున్సిపల్ ఇంజనీర్ కృష్ణ తదితరులు హాజరయ్యారు. మహబూబ్‌నగర్‌తో పాటు గద్వాల, షాద్‌నగర్, అచ్చంపేట, జడ్చర్ల, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, అయిజ, కొడంగల్ మున్సిపాలిటీలు, పలు మండల కేంద్రాల్లో జన సభలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి వాటిని పరిష్కరించే దిశగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను ‘సాక్షి’ తీసుకుంది.
 
 ప్రజలు చెప్పిన సమస్యలు ఇవీ...
 పాలకొండ జనసభ: శ్మశానవాటికకు స్థలం కేటాయించాలి. గ్రామం నుంచి ప్రధాన రహదారి వరకు రెండుకిలోమీటర్ల మేర రోడ్డును ఏర్పాటు చేయాలి. గ్రామానికి ఆర్టీసీ బస్సును తిప్పాలి. వాటర్ ట్యాంక్‌లు నిర్మించాలి.  ఇందిరమ్మ ఇళ్లకు బిల్లు రాలేదు. కొంతమంది పింఛన్లు రాడంలేదు.  వీధిలైట్లు వెలగడంలేదు.  
 
 క్రిష్టియన్‌పల్లి:
 సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి. రామన్‌పాడుకు తాగు నీరు అందించాలి. వీధిలైట్లు వెలిగేలా చూడాలి. రోడ్డు విస్తరణలో చర్చిని కాపాడాలి.
 
 భగీరథకాలనీ:
 దొంగలబెడద అధికంగా ఉంది. రామన్‌పాడుకు తాగు నీరు అందించాలి. కమ్యూనిటీహాలు నిర్మించాలని మహిళల విన్నపం.
 
 శ్రీనివాసకాలనీ:  చెరువులో ఏర్పాటు చేసిన బోరు నుంచి కలుషితనీరు వస్తోంది. ఇళ్ల మధ్యన మురుగుకుంటలతోపాటు, ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. ముదిరాజ్ ఫంక్షన్‌హాల్ ప్రాంతంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. చౌకధర దుకాణంలో రేషన్ సరుకుల్ని సక్రమంగా ఇప్పించాలి.  ప్రమాద భరితంగా ఉన్న  11,33 కెవి విద్యుత్‌లైన్లను తొలగించాలి.
 
 బోయపల్లి: వితంతు, వృద్ధాప్య పెన్షన్లు అందడం లేదు. ఇళ్ళస్థలాలు కోసం నిరీక్షిస్తున్నాం. రామన్‌పాడు నీరందించాలి. చెత్తకుండీలు ఏర్పాటు చేయాలి. డ్రైనేజీలు నిర్మించాలి. జడ్‌పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో బాత్‌రూంలు, ఉర్దూమీడియం పాఠశాలకు ప్రహరీ  నిర్మించాలి.  వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొన్నా బిల్లులు ఇవ్వలేదు.
 
 దొడ్డలోనిపల్లి: మోతీనగర్ నుంచి గ్రామానికి సీసీరోడ్డు నిర్మించాలి. తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉంటోంది. పారిశుద్ధ్య పనులు చేయడం లేదు. వీధిలైట్లు వెలగడంలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.
 
 తిమ్మసానిపల్లి: డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలి.  వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. సూర్యలక్ష్మికాటన్‌మిల్లులో స్థానికులకే అవకాశం కల్పించాలి. పింఛన్లు మంజూరు చేయాలి. ఎర్రవల్లి తండాకు రోడ్డు నిర్మించాలి. గ్రామానికి చెందిన ఇద్దరు పారిశుద్ధ్య సిబ్బందిని అకారణంగా తొలగించారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
 
 ఏనుగొండ: పారిశుద్ధ్యం లోపించింది. చైతన్య నగర్‌లోని మురికికుంటతో దోమలు, దుర్వాసన వస్తోంది. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వాటిలో ఇళ్ళస్థలాలు ఇవ్వాలి. మున్సిపల్ పన్నులను తగ్గించాలి. పింఛన్లు మంజూరు చేయాలి. డ్వాక్రా భవనానికి ప్రహరీ నిర్మించాలి. రామన్‌పాడునీటిని అందించాలి. మరుగుదొడ్లు నిర్మించాలి.
 
 
 పరిష్కారం ఇలా..
   గ్రామంలో పాచి పట్టిన వాటర్ ట్యాంక్‌లతోపాటు, డ్రైయినేజీలను  శుభ్రం చేశారు. వీధిలైట్ల ఏర్పాటుకు మున్సిపల్ డీఈ ఆనంద్‌సాగర్ తక్షణ చర్యలు తీసుకున్నారు. గ్రామం నుంచి ప్రధాన రహదారి వరకు రోడ్డు, ఆర్టీసీ బస్సుతోపాటు, శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ గిరిజా శంకర్ హామీ ఇచ్చారు.
 
   సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ సాధారణ నిధులు రూ.15లక్షలు మంజూరు చేస్తామని డీఈ ఆనంద్‌సాగర్ హామీ. చర్చికి నష్టం జరగనివ్వబోమని ఏజేసీ డా.రాజారాం తెలిపారు.
 
   కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన స్వంత స్థలంలో 500 గ జాలు ఉచితంగా ఇస్తానని మాజీ కౌన్సిలర్ బెక్కరి శ్రీనివాస్ రెడ్డి  ప్రకటన.  రామన్‌పాడు లైన్ నుంచి మంచినీరు సరఫరా. చోరీల నివారణకు సీఐ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు.
 
   చెరువులో బోర్ కాకుండా, ఆ పక్కనే మరొకటి ఏర్పాటు చేస్తామని మున్సిపల్ డీఈ ఆనంద్‌సాగర్ తెలిపారు.  వెంటనే డ్రైనేజీలు శుభ్రపరిచారు. ముళ్లపొదల్ని తొలగించారు. రేషన్ సరుకుల్ని సక్రమంగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని జేసీ ఎల్.శర్మణ్ హామీ ఇచ్చారు. ఇక్కడున్న 11, 33 కెవి విద్యుత్ తీగల సమస్యను పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తానన్నారు.
 
   పింఛన్లు రాలేదని చెప్పిన వారందరికీ రచ్చబండలో మంజూరైనవి మున్సిపల్ అధికారులు జనసభలోనే వివరించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి గ్రామంలో ఉన్న సర్వే 27లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇస్తామని, అర్హుల జాబితాను సమర్పించాలని డీఆర్వో రాంకిషన్ వెల్లడించారు. ఈసమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.  
 
   పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టారు. వాటర్ ట్యాంక్‌ల శుభ్రం చేశారు. వెలగని వీధిలైట్లకు  వెంటనే మరమ్మతులు పూర్తి చేశారు. ఇళ్ల స్థలాలతోపాటు, పింఛన్లను అర్హులైన వారందరికీ అందిస్తామని ఆర్డీఓ హన్మంతరావు హామీ ఇచ్చారు.
 
   డ్రెయినేజీలు శుభ్రపరిచారు. వీధిలైట్లను వెంటనే ఏర్పాటు చేశారు. సూర్యలక్ష్మీ కాటన్‌మిల్లులో గ్రామానికి చెందిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తహశీల్దార్ యాదగిరి రెడ్డి హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించేందుకు రూ. 9లక్షల నిధులను  మంజూరు చేశామని, త్వరలోనే ఆపనులు చేపట్టనున్నట్లు ఎంఈ కృష్ణ తెలిపారు.
 
   గ్రామానికి తక్షణమే వీధిలైట్లను పంపిస్తామని డీఈ వాజీద్ తెలిపారు. ఇక గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల్ని ఇస్తామని డీఆర్వో రాంకిషన్ హామీ ఇచ్చారు.  వెంటనే దరఖాస్తుల్ని సేకరించాలని వీఆవ్వో వెంకట్రాములును ఆదేశించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement