ఇంటర్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.
హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.
బాలికలు 42.85 శాతం, బాలురు 41.96 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. తెలంగాణలో చదువుతున్న సీమాంధ్ర విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐఐటీలో ఫస్టియర్, సెకండియర్ వెయిటేజీకి కేంద్రం ఒప్పుకుందని గంటా చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు 11 జాతీయ విశ్వవిద్యాలయాలు అమలయ్యాయని, వాటికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.