=రూ.15 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
=సీపీ శివధర్ రెడ్డి వెల్లడి
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : చిత్తూరు జిల్లాకు చెందిన ఒక దోపిడీ దొంగ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ స్టీల్‌ప్లాంట్ పోలీసులకు చిక్కాడు. ఇతనిపై గతంలో ఏడు కేసులు, తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి. స్టీల్‌ప్లాంట్, దువ్వా డ పోలీసులు పక్కా ప్రణాళికతో అతడిని పట్టుకుని 300 గ్రాముల బంగారంతో పాటు 2 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15 లక్షలుంటుందని అంచనా. పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ బి. శివధర్‌రెడ్డి నిందితుడి వివరాలు తెలిపారు.
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని గాజుల మాన్యం గ్రామానికి చెందిన నాతమూడి మహేంద్ర పాత నేరస్తుడు. కొన్నాళ్లగా గాజువాకలోని డ్రైవర్స్ కాలనీలో ఉంటున్నాడు. చిల్లర నేరాల నుంచి ఇళ్ల చోరీలు, దోపిడీలకు పాల్పడినందుకు ఏడు కేసులపై గతంలో ఏడాది పాటు జైల్లో ఉన్నాడు. రెండేళ్ల క్రితం నాటు తుపాకీతో జనాన్ని బెదిరిస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో అనకాపల్లి రూరల్ పోలీసులు కూడా అరెస్టు చేశారు.
గాజువాక, ఆనందపురం, పద్మనాభం, శ్రీకాకుళం, చంద్రగిరి, కశింకోట, అనకాపల్లి సహా వివిధ ప్రాం తాల్లో నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పేరొందిన అనంత పద్మనాభస్వామి ఆలయంలో పూజారిని గాయపరచి బంగారం, వెండివస్తువులు చోరీ చేసినట్టు అప్పట్లో మరో కేసు నమోదు చేశారు. జైలు నుంచి విడుదలైన వెంటనే శివాలయం వీధిలో చోరీలకు పాల్పడ్డాడు. సెక్టర్-6లో కూడా ఇనుపచువ్వతో తాళం పగలగొట్టి వెండి సామాన్లు దొంగిలించాడు.
చోరీ సామగ్రిని విక్రయించేందుకు వెళ్తుండగా సీఐ ఎన్. కాళిదాసు, ఎస్‌ఐ ఎన్.గణేష్‌తో పాటు కానిస్టేబుళ్లు డి. శ్రీనివాసరాజు, వి.వెంకటరావు, జి.అప్పలరాజు, ఎన్.మురళీ, కె.సతీష్‌లు మహేం ద్రను పట్టుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో నెక్లెస్‌లు, గొలుసులు, గాజులు, ఉంగరాలు, చెవి దుద్దులు తదితర వస్తువులున్నాయి. విలేకరుల సమావేశంలో ఏడీసీపీలు వరదరాజులు, మహ్మద్‌ఖాన్, గాజువాక ఏసీపీ కె.వి.రమణ, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తదితరులున్నారు.
అంతర్ జిల్లా దోపిడీ దొంగ అరెస్టు
Published Tue, Dec 10 2013 1:56 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement