కన్న ప్రేమ..
Published Thu, Mar 13 2014 12:17 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరంలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో శారీరక వైకల్యంతో బాధ పడుతున్న విద్యార్థులు కుటుంబసభ్యుల సహకారంతో పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. వీరిలో పుట్టుకతో కాళ్లు చచ్చుబడిపోయిన సదాశివ ప్రసాద్ బ్రాడీపేటలోని మాగ్నజీల్ కామర్స్ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి వీల్‌చైర్‌పై వచ్చి పరీక్ష రాశాడు. బృందావన్‌గార్డెన్స్‌సెంటర్‌లోని వీఎన్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో సోము తేజస్వి సాయిరామ్ చేతులు తన ఆధీనంలో లేక వణుకుతున్న స్థితిలోనే పరీక్ష రాశాడు. అతని పరిస్థితి తెలిసిన అధికారులు అదనంగా మరో అరగంట సమయం కేటాయించారు.
Advertisement
Advertisement