నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 12నుంచి నిర్వహిస్తారు. నాలుగు విడతలుగా ఐదురోజుల చొప్పున ఇవి జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా 29,202మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో 21,133 మంది ఎంపీసీ, 8069 మంది బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. 154 జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా జంబ్లింగ్ విధానం లేకుండా ప్రయోగ పరీక్షలు జరుగుతాయి. ఉదయం,మధ్యాహ్నం చొప్పున రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఎగ్జామినర్ల నియామకం
ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్ల జాబి తాను సిద్ధం చేసి ఇంటర్మీడియట్ బోర్డుకు అధికారులు నివేదించారు. అక్కడి నుంచి నియామక ఉత్తర్వులు రావాల్సి ఉంది. పరీక్షల నిర్వహణ అనంతరం ఏ పూట ప్రశ్నపత్రాలను ఆ పూటే వ్యాల్యుయేషన్ చేసి సీల్‌తో సంబంధిత కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు అప్పగిస్తారు.
జిల్లా పరీక్షల కమిటీ
ప్రాక్టికల్ పరీక్షలను సక్రమంగా నిర్వహిం చేం దుకు జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) బాధ్యతలు చూస్తుంది. ఇందులో ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాళ్లు, ఒక సీనియర్ జేఎల్ ఉంటారు. నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తాయి.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం
- ్ర పకాశ్‌బాబు, ఆర్‌ఐఓ, నల్లగొండ
‘ప్రాక్టికల్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తాం. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలున్న కాలేజీల్లోనే ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎగ్జామినర్ల జాబితా బోర్డునుంచి అందాల్సి ఉంది. ’
ఫిబ్రవరి 12నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
Published Thu, Jan 2 2014 3:45 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement