సింగానివారిపల్లి(గాండ్లపెంట), న్యూస్‌లైన్ : చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా.. ఆర్థిక ఇబ్బం దుల వల్ల అర్ధాంతరంగా చదువు ఆగి పోవ డంతో మండలంలోని సింగానివారిపల్లికి చెం దిన కృష్ణమూర్తి కుమార్తె జే.నరసమ్మ(18) ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్‌హెచ్‌ఓ నరసింహులు కథనం మేరకు.. నరసమ్మ కదిరిలో ఇంటర్ చదువుతూ మొదటి ఏడాది పూర్తి చేసింది.
రెండో ఏడాది కొనసాగించడానికి ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారడంతో తాను చదివిం చలేనని తండ్రి నచ్చజెప్పాడు. ఇదివరకే పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. మూడో వాడైన కొడుకు ఏడో తరగతి చదువుతున్నాడు. తల్లి బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తన తండ్రి గొర్రెలు మేపడానికి వెళ్లగా, ఒంటరిగా ఉన్న ఆమె ఇంట్లోని విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి నరసమ్మ మృతి చెందింది.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Published Sun, Jan 5 2014 3:03 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement