శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. ఆఖరి, నాలుగో విడత పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. 46 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నాలుగో విడత ప్రాక్టికల్స్ జరగనున్న 46 కేంద్రాల్లో 13 ప్రేవేటు కాగా 24 ప్రభుత్వ, 7 సోషల్‌వెల్ఫేర్, మరో రెండు ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా కళాశాలల విద్యార్థుల హాల్‌టిక్కెట్లతోపాటు ప్రశ్నా, జవాబుపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, నామినల్‌రోల్స్‌ను కేంద్రాలకు చేరవేశారు.
ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, ఎక్స్‌ట్రనల్ ఎగ్జామినర్ల నియామక ప్రక్రియ సైతం ముగిసింది. ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాట్లపై ఆర్‌ఐఓ పాత్రుని పాపారావు హైపవర్ కమిటీ సభ్యుడు బి.మల్లేశ్వరరావు, డెక్ కమిటీ సభ్యులు ఎస్.ఈశ్వరరావు, ఐ.శంకరరావు, జి.వి.జగన్నాథరావులతో గురువారం సమీక్షించారు. కాగా గురువారం 13 కేంద్రాల్లో మూడో విడతగా జరిగిన ప్రాక్టికల్స్‌కు 407 మందికి 25 మంది విద్యార్థులు గైర్హాజరైట్టు అధికారులు పేర్కొన్నారు.
తుది దశకు ప్రాక్టికల్స్
Published Thu, Feb 18 2016 11:29 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement