తెలుగుతేజం యాత్ర వాయిదా వేసుకున్న జేపీ | Jayaprakash Narayana postpned Telugu Tejam Yatra | Sakshi
Sakshi News home page

తెలుగుతేజం యాత్ర వాయిదా వేసుకున్న జేపీ

Published Sun, Sep 15 2013 1:45 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

తెలుగుతేజం యాత్ర వాయిదా వేసుకున్న జేపీ - Sakshi

తెలుగుతేజం యాత్ర వాయిదా వేసుకున్న జేపీ

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చేపట్టిన తెలుగుతేజం యాత్రకు అనంతపురంలో సమైక్యసెగ తగిలింది. నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరైన జేపీని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సమైక్యవాదులను చెదరగొట్టారు. రెచ్చిపోయిన సమైక్యవాదులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. చివరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేపీ సమావేశానికి హాజరయ్యారు. సమైక్యవాదులు మాత్రం అక్కడే భైఠాయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర అన్న తర్వాతే ఈ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో జయప్రకాష్ నారాయణ యాత్రను వాయిదా వేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement