
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. స్థానిక అశోక్ బంగ్లాలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్
విజయనగరం మున్సిపాలిటీ: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. స్థానిక అశోక్ బంగ్లాలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాఫ్) 2017 డైరీని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాఫ్ డైరీలో ఎంతో విలువైన సమాచారం అందించారని, అందుకు జాఫ్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. జర్నలిస్టులు ప్రజోపయోగకరమైన అంశాలపై సూచనలు, సలహాలు చేయాలన్నారు. దేశంలో ప్రధానంగా కేంద్రం అందిస్తున్న సోలార్ రాయితీని ఉపయోగించుకుని సోలార్ విద్యుత్ వినియోగం పెంచేలా వార్తలతో ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ విప్ గద్దె బాబూరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, జాఫ్ ప్రతినిధులు ఆదినారాయణ. సత్యనారాయణ, జగన్నాథశర్మ తదితరులు పాల్గొన్నారు.