Union Minister ashok gajapathi raju
-
జిల్లా టీడీపీలో గంటారావం!
♦ గంటా నిర్ణయం మేరకే అధ్యక్ష ఎన్నిక ♦ జిల్లా పార్టీలో చేపట్టిన ఐవీఆర్ఎస్తో తేటతెల్లం ♦ కేంద్రమంత్రి అశోక్ ప్రతిపాదనకు నో... ♦ అభిప్రాయ సేకరణలో కానరాని జగదీష్పేరు ♦ జిల్లా కార్యదర్శిగా ఐవీపీ పేరొక్కటే జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా... దిశానిర్దేశనం చేసే వ్యక్తిగా... ఇంత వరకూ పేరున్న అశోక్ గజపతిరాజును అధిష్టానం పక్కన పెడుతున్నట్టు కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. గడచిన రెండు సమావేశాల్లో చెప్పినట్టు అభిప్రాయ సేకరణ ప్రారంభించిన అధిష్టానం... అశోక్ సూచించిన ద్వారపురెడ్డి జగదీష్ పేరును చేర్చకపోవడం జిల్లా క్యాడర్‌ను ప్రశ్నార్థకంలో పడేసింది. ఇక పార్టీలో ఏం జరగబోతోందన్న వ్యాఖ్యానాలు, చర్చలు టీడీపీ క్యాడర్లో జోరందుకున్నాయి. విజయనగరం కంటోన్మెంట్: జిల్లా తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజే పెద్ద దిక్కు. ఆయన చెప్పిన వారికే జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల పదవులు అప్పగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఆ సంప్రదాయానికి అధిష్టానం చెక్ చెప్పినట్టు కనిపిస్తోంది. అశోక్ సూచించిన ద్వారపురెడ్డి జగదీష్‌ను ఈసారి తప్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు స్పష్టమవుతోంది. పార్లమెంటు ఇన్చార్జిగా జిల్లాలో అడుగుపెట్టిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం మాయ చేశారో కానీ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కూడా ఆయనే జిల్లాకు వచ్చారు. అప్పటినుంచి అశోక్‌పై పై చేయి సాధించేలా కనిపిస్తున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయన సూచన మేరకే అధ్యక్ష ఎంపిక సాగుతోందన్నది స్పష్టమవుతోంది. అభిప్రాయ సేకరణ ముగ్గురిపైనే... టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికోసం అధిష్టానం నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణలో జిల్లాలోని ముగ్గురి పేర్లే వినపిస్తున్నాయి. గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, ఆయన సోదరుడు కొండబాబు, పూసపాటిరేగ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడి పేర్లు మాత్రమే వినపడుతున్నాయి. వీరిలో ఎవరైతే అధ్యక్ష పదవికి బాగుంటుందన్న దానిపై ఐవీఆర్ఎస్లో క్యాడర్ నుంచి సమాధానాలు కోరుతున్నారు. అంటే ఈ ముగ్గురిలో ఒకరికి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పటికే గజపతినగరంలో అన్నదమ్ముల పోరు సాగుతోం ది. ఎమ్మెల్యే కె.ఎ.నాయుడిపై ఆయన సోదరుడు కొండబాబు అధినేత చం ద్రబాబుకు ఫిర్యాదు చేయడం ఆ తరువాత స్వయంగా వెళ్లి కలవడమూ తెల్సిందే! ఆ సందర్భంలోనే తనకు టీడీపీ పదవిని ఇవ్వాలని కోరినపుడు అభిప్రాయ సేకరణ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడీ ఐవీఆర్ఎస్ లో ఆయనపేరు ఉంది. అలాగే కె.ఎ.నాయుడు సైతం చంద్రబాబును కలసి వచ్చిన తరువాత ఆయన పేరు పరిశీలనలోకి వచ్చినట్టుంది. పలుమార్లు పూసపాటిరేగ ఎంపీపీగా టీడీపీకి బలమయిన ద్వితీయ శ్రేణి నాయకుడిగా మహంతి ఉన్నారు. అందుకే ఆయన పేరు కూడా చేరింది. అశోక్ ప్రాబల్యానికి చెక్ అధ్యక్షుడి ఎంపిక విషయంలోనే గాకుండా ఇటీవల శత్రుచర్ల విజయరామరాజు, సుజయకృష్ణారంగారావు చేరిక విషయంలో.... సుజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడంలోనూ అధిష్టానం తీరు చూస్తుంటే ఇక అశోక్ ప్రాబల్యానికి బ్రేక్ వేసినట్టయింది. ఇన్చార్జి మంత్రి గంటా జిల్లాకు వచ్చిన తరువాత అది మరింత ఎక్కువైందనడంలో సందేహం లేదు. అశోక్ చెప్పిన వ్యక్తికే అధ్యక్షస్థానం ఖరారు చేస్తూ ఎప్పుడూ మహానాడుకు ముందే ఈ ఎన్నిక జరిగిపోయేది. కొత్త కార్యవర్గంతో ఆ వేడుకకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అశోక్ మాటకు విలువే లేకుండా పోయింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఐవీపీ! పార్టీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో డైలమాలో పడిన టీడీపీ క్యాడర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి విషయంలో ఏ మాత్రం సందిగ్ధత ప్రదర్శించలేదు. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఐ.వి.పి. రాజునే దాదాపు ఖరారు చేసినట్టు భోగట్టా. కాగా జగదీష్‌తోపాటు ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న ఏపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభ హైమావతి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తూముల భాస్కరరావు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత తదితరుల పేర్లు కూడా పరిశీలనలో లేకపోవడం విశేషం. మరి ఈసారి ఎవరికి పదవి వరిస్తుందో చూడాలి మరి. -
బంగ్లా టు కోట..!
⇔ టీడీపీలో మరో వపర్ సెంటర్ ⇔ బంగ్లా రాజకీయాలకు బ్రేక్ ⇔ బొబ్బిలి రాజులకు ప్రాధాన్యం ⇔ తగ్గుతున్న అశోక్ ప్రాబల్యం ⇔ శత్రుచర్ల రాకతో మొదలు ⇔ సుజయకృష్ణ మంత్రి పదవితో పతాక స్థాయికి చేరిన వైనం ⇔ కళా వెంకటరావు డైరెక్షన్లో వ్యూహాత్మక అడుగులు ⇔ అశోక్ అనుచరులల్లో కలవరం సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో మరో ‘పవర్’ సెంటర్ తయారైంది. వర్గ పోరు తారాస్థాయికి చేరింది. బంగ్లా రాజకీయా లకు బ్రేక్ పడింది. బొబ్బిలి రాజులకోట మరో రాజకీయ వేదిక కాబోతోంది. ఇన్నాళ్లు జిల్లాలో పార్టీ పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్ గజపతిరాజుకు ప్రాధాన్యం మసకబారుతోంది. అధిష్టానం వద్ద పట్టు సడలుతోంది. ఆయనకు తెలియకుండా పార్టీలో వ్యవహారాలు సాగిపోతుండడమే దీనికి నిదర్శనం. అశోక్‌ను సంప్రదించకుండా బొబ్బిలి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారనే వాదన బలం గా విన్పిస్తోంది. బంగ్లా ఆధిపత్య రాజకీయాలకు బ్రేక్ పడినట్టు ప్రచారం జోరందుకుంది. జిల్లాలో ని రాజకీయ పరిణామాలు అశోక్ అనుచరులను కలవరపెడుతున్నాయి. ఆలోచనలో పడేశాయి. తగ్గిన ప్రాధాన్యం.. పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లా టీడీపీలో తిరుగులేని నేత. కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ మొన్నటివరకు తనే టీడీపీ రాజకీయాలను శాసించారు. ఏ విషయంలోనైనా తనదే పైచేయి. పార్టీ, అధికారిక నిర్ణయాలన్నీ తన కనుసన్నల్లోనే నడిచాయి. రాష్ట్ర మంత్రిగా కిమిడి మృణాళిని ఉనప్పటికీ బంగ్లా వేదికగానే రాజకీయాలు కొనసాగాయి. మిగతా నేతల మాదిరిగానే అశోక్ గజపతిరాజుతో కలిసి మృణాళిని నడిచారు. ఇప్పుడా ఆధిపత్యానికి బ్రేక్ పడింది. తనకు తెలియకుండానే అధిష్టానం మరో పవర్సెంటర్ను తెరచింది. కళా వెంకటరావు డైరెక్షన్లో.. అశోక్ గజపతిరాజుపై నమ్మకం సడలిందో...ఈయనతో భవిష్యత్ రాజకీయాలు చేయలేమనో... అశోక్‌కు మరో ప్రత్యామ్నాయంగా మరో కోటరీ ఉండాలనో తెలియదు గాని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు చెప్పినట్టుగా అధిష్టానం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జిల్లాలో కళా వెంకటరావు ప్రాబల్యాన్ని దశలవారీగా పెంచి తద్వారా అశోక్ ఆధిపత్యానికి గండి కొడుతూ వస్తోంది. అశోక్‌కు నచ్చని నిర్ణయాలు తీసుకుని మానసికంగా బలహీనం చేస్తోంది. కాంగ్రెస్‌లో అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసిన శత్రుచర్ల విజయరామరాజును పార్టీలోకి తీసుకొచ్చి అశోక్ ప్రాబల్యాన్ని తగ్గించే భీజం వేసింది. విజయనగరం రాజులు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. అశోక్ ఆలోచనలకు భిన్నంగా కురుపాం ఇన్చార్జి బాధ్యతలను సైతం శత్రుచర్ల మేనల్లుడికి అప్పగించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన సుజయకృష్ణ రంగారావును పార్టీలోకి తీసుకు వచ్చారు. సుజయ రాకను అశోక్ తొలుత వ్యతిరేకిం చారని, చంద్రబాబు ఒప్పించడంతో వెనక్కి తగ్గారనే వాదనలు ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇటీవల తన అభిప్రాయానికి భిన్నంగా శత్రుచర్ల విజయరామరాజుకు ఏకంగా శ్రీకా కుళం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌కు ధీటుగా మరో వర్గానికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. అశోక్‌ను పట్టించుకోకుండా... సుజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడంలో అశోక్ గజపతిరాజు మాటను పట్టించుకోలేదన్నది సమాచారం. జిల్లాలో మారుతున్న సమీకరణాలను ముందుగానే పసిగట్టిన అశోక్ గజపతిరాజు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించారు. సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇస్తున్నారనే ప్రచారం జోరందుకోగానే తెరవెనుకుండి మంత్రాంగం నడిపించారు.ద్వారపురెడ్డి జగదీష్, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడు, గుమ్మడి సంధ్యారాణి తదితరులను తెరపైకి తెచ్చి, సుజయకు వ్యతిరేకంగా స్వరం విన్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు బోగట్టా. ఆయనిచ్చిన భరో సాతోనే సదరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా సీఎం వద్దకు వెళ్లి సుజయకృష్ణకు మంత్రి పదవి ఇవ్వొద్దని, బీసీలకు ఇవ్వాలని, తమలో ఏ ఒక్కరికిచ్చినా ఫర్వాలేద ని, ఓసీకిస్తే పార్టీకి నష్టం అన్న వాదన వినిపించారు. పక్కా వ్యూహంతోనే సుజయకృష్ణకు వ్యతిరేకంగా పావులు కదిపారు. అయితే, సీఎం చంద్రబాబు ఇవేవీ పట్టిం చుకోలేదు. పార్టీలో లోకేష్ డామినేషన్ పెరిగిందో... అశోక్‌ను నమ్ముకుంటే కష్టమని చంద్రబాబు భావించారో తెలియదు గాని అసమ్మతి నేతల వాదన వినిపించుకోలేదు. అశోక్ సైతం జోక్యం చేసుకుని మనసులో మాట చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదని తెలుస్తోంది. మరో రాజకీయ కేంద్రం.. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరో రాజకీయ అధికార కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇవ్వడం, ఇటీవల జరిగిన సమీక్షలో కళా వెంకటరావు డైరెక్షన్ ప్రకారం సమీక్షలు జరగడం, శత్రుచర్లపై అశోక్ ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేసినా శత్రుచర్లకే చంద్రబాబు పెద్ద పీట వేయడం, కాదన్నా సుజయకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం వంటివన్ని చూస్తుంటే జిల్లాలో మరో నాయకత్వాన్ని తయారు చేసేందుకు టీడీపీ అధిష్టానం అడుగులు వేసినట్టు స్పష్టమవుతోంది. ఇవన్నీ గమనిస్తున్న అశోక్ అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీలో ఏం జరుగుతుందోనని కలవరపడుతున్నారు. చెప్పాలంటే బంగ్లా నేతలకు భయం పట్టుకుంది. కొందరు ‘ప్రత్యామ్నా య’ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. -
జిల్లా టీడీపీలో ‘కళ’కలం
-
జిల్లా టీడీపీలో ‘కళ’కలం
►సమీక్షల నుంచి పదవుల పందేరం వెనుకా ఆయన ప్రభావమే ►సీనియర్లను పక్కన పెట్టేస్తున్న పరిస్థితి ► అశోక్‌కు పోటీగా వర్గం తయారు ► జిల్లా టీడీపీలో విస్తృత చర్చ జిల్లా టీడీపీలో మరోవర్గం బలపడుతోందా... పార్టీకి పెద్ద దిక్కుగా ఇన్నాళ్లు నిలిచిన అశోక్‌గజపతిరాజుకు ప్రాధాన్యం తగ్గుతోందా... ఆయనకు తెలియకుండానే పార్టీలో కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయా... రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన కళావెంకటరావు ప్రభావం జిల్లాలో పెరుగుతోందా... సమీక్షల నుంచి... పదవుల కేటాయింపు వరకూ ఆయన సూచనల మేరకే సాగుతోందా... జిల్లాలో ఇప్పుడు మరో పవర్‌సెంటర్ తయారవుతోందా... దీని వెనుక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చిన్నబాబు కోటరీని బలోపేతం చేస్తున్నారా... ఇప్పుడు జిల్లా పార్టీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇదే. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... అక్షరాలా అది నిజమేనేమోనని అనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా తెలుగుదేశం పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుపై నమ్మకం సడలిందో, ఈయనతో భవిష్యత్ రాజకీయాలు చేయలేమనో, లోకేష్ తనకంటూ కోటరీని తయారు చేసుకుంటున్నారో తెలియదు గాని జిల్లా పార్టీలో కళా వెంకటరావు ప్రభావం ఎక్కువవుతోంది. పార్టీ పదవుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్, కళా వెంకటరావుల మధ్య బంధం పెరగడంతో ఒకప్పుడు రాష్ట్ర పార్టీలోనే నంబర్ టూగా భావించే అశోక్ గజపతిరాజు ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్నట్టు స్పష్టమవుతోంది. కళౠ చెప్పినట్టే అదిష్టానం నడుచుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సుజయకృష్ణరంగారావును పార్టీలో చేర్చుకోవడం, ఆయనకు మంత్రి పదవి భరోసా లభించడం, శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇవ్వడం వంటివి అందులో భాగమని విశ్లేషించుకుంటున్నాయి. పవర్‌సెంటర్ మార్చడమే లక్ష్యంగా... ఎన్నికలకు ముందు శత్రుచర్ల విజయరామరాజును పార్టీలోకి తీసుకొచ్చిందే కళా వెంకటరావు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడే అశోక్ ప్రాబల్యాన్ని తగ్గించే బీజం పడ్డట్టు వాదనలు విన్పించాయి. ఇక, లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు నియమితులయ్యాక వ్యూహా లు ఊపందుకున్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగరావును చేర్చుకోవడం అశోక్‌కు ఇష్టం లేకపోయినా కళా వెంకటరావు పావులు కదపడంవల్లే మార్గం సుగుమం అయ్యిందనే వాదనలు ఉన్నాయి. అంతేనా... ఆయనకు మంత్రి పదవి ఇప్పించడానికి లోకేష్ నుంచి హామీ కూడా ఇప్పించినట్టు ప్రచారం నడిచింది. అశోక్ బంగ్లా నుంచి పవర్ సెంటర్‌ను మార్చడమే దీని వెనుకున్న లక్ష్యమని తెలిసింది. సమీక్షల వెనుకా... ఆయనే! మూడు రోజుల క్రితం ఉండవల్లిలో జరిగిన పార్టీ సమీక్ష కూడా కళా వెంకటరావు సూచన మేరకే జరిగినట్టు తెలుస్తోంది. ఆయనేదైతే బ్రీఫింగ్ ఇచ్చారో దాని ప్రకారం చర్చించినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కళా ఇచ్చిన స్క్రిప్టును చంద్రబాబు చదివి విన్పించారని కూడా తెలుస్తోంది. ఎవరెవరిని మందలించాలో, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో, ఎవరికి సుతిమెత్తని చురకలంటించాలో కళా వెంకటరావు చేసిన సలహాలు బాగా పనిచేశాయని పార్టీలో చర్చ నడుస్తోంది. చివరికి, ఎమ్మెల్సీ కేటాయింపుల్లో కూడా ఆయన మార్కే కన్పించిందంటున్నారు. జిల్లాలో శోభా హైమావతి, గద్దే బాబూరావు, ఐ.వి.పి.రాజు, త్రిమూర్తుల రాజు తదితరుల సీనియర్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవి విషయంలో వారినెవ్వరినీ పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన శత్రుచర్లతో సరిపెట్టేశారు. ఈ విషయంలో సీనియర్లకు మొండి చేయి ఎదురైందనే చెప్పుకోవాలి. శత్రుచర్లకు ఎమ్మెల్సీ పదవి వెనుక కళా... కళా పదును పెట్టిన వ్యూహంలో భాగంగానే శత్రుచర్ల విజయరామరాజుకు ఎమ్మెల్సీ సీటు కేటాయించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా, పార్టీలో సీనియారిటీ లేకపోయినా తనకంటూ వర్గాన్ని తయారు చేసుకోవాలన్న ఆలోచనలో భాగంగా సమీకరణలు పక్కన పెట్టి శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇప్పించినట్టు వాదనలు ఉన్నాయి. ఉండవల్లి సమీక్షలో శత్రుచర్లపై అధినేతకు అశోక్ చేసిన ఫిర్యాదు వెనుక ఈ అక్కసు ఉందనే గుసగుసలు విన్పించాయి. ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోకుండా శత్రుచర్లకు కురుపాం పగ్గాలు అప్పగించడం వెనక కళా డైరెక్షన్ కారణమనే వాదనలు కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇప్పించే విషయంలోనూ కళా పావులు కదుపుతున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
విజయనగరం మున్సిపాలిటీ: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. స్థానిక అశోక్ బంగ్లాలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాఫ్) 2017 డైరీని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాఫ్ డైరీలో ఎంతో విలువైన సమాచారం అందించారని, అందుకు జాఫ్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. జర్నలిస్టులు ప్రజోపయోగకరమైన అంశాలపై సూచనలు, సలహాలు చేయాలన్నారు. దేశంలో ప్రధానంగా కేంద్రం అందిస్తున్న సోలార్ రాయితీని ఉపయోగించుకుని సోలార్ విద్యుత్ వినియోగం పెంచేలా వార్తలతో ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ విప్ గద్దె బాబూరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, జాఫ్ ప్రతినిధులు ఆదినారాయణ. సత్యనారాయణ, జగన్నాథశర్మ తదితరులు పాల్గొన్నారు. -
సాహస హేల
సముద్ర తీరంలో నేవీ డే వేడుకలు జనాన్ని కదలివ్వకుండా కట్టిపడేసిన విన్యాసాలు ఆకాశంలో, ఉపరితంలో కళ్లకు కట్టిన యుద్ధ సన్నివేశాలు ప్రదర్శనలిచ్చిన యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాఫ్టర్లు గగుర్పాటుకు గురిచేసిన మార్కోస్ శక్తి సామర్థ్యాలు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అమర వీరులకు నివాళులర్పించిన ఈఎన్సీ చీఫ్ హెచ్‌సీఎస్ బిస్త్ ప్రశాంత తీరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. భీకర శబ్దంతో సముద్రంలో బాంబ్ పేలింది. దాని ధాటికి బంగాళాఖాతం అదిరిపడింది. అల వంద అడుగులకుపైగా ఎగసిపడింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఆకాశంలో రంగురంగుల పక్షుల్లా మెరైన్ కమాండోలు స్కై డైవింగ్ చేస్తూ నేలకు దిగారు..యుద్ధ నౌకలు, యుద్ధ హెలికాఫ్టర్లు, చేతక్ హెలికాఫ్టర్లు, క్లోజ్ రేంజ్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆకాశంలో దూసుకుపోయారుు. ఇలాంటి ఎన్నో..ఎన్నెన్నో అద్భుత విన్యాసాలకు విశాఖ తీరం వేదికై ంది. ఆర్కే బీచ్‌లో ఆదివారం జరిగిన నేవీ డే వేడుకల్లో ప్రతి ప్రదర్శన ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రతి విన్యాసం గురించి వ్యాఖ్యాతలు జ్యోతి, షైలీపంథ్, దేష్ముఖ్లు సవివరంగా ప్రజలకు తెలియజేశారు. సాక్షి, విశాఖపట్నం : సముద్ర రారాజు భారత నేవీ శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం నగర వాసులకు దక్కింది. ఏడాది పొడవునా ఈ రోజు కోసం ఎదురుచూసిన ప్రజల జన్మ ధన్యమైందనట్లుగా నేవీ డే వేడుక సాగింది. బంగాళాఖాతంలో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు, తీరంలో మాటువేసిన శత్రు సేనలపై విరుచుకుపడుతున్నట్టు, గగన తలంలో, భూ ఉపరితలంలో, సాగరంలో నేవీ చేసిన విన్యాసాల ప్రదర్శన నభూతో నభవిష్యత్ అనిపించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు సతీసమేతంగా ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తూర్పునావికాదళాధిపతి, వైస్ అడ్మిరల్ హెసీఎస్ బిస్త్ వారికి సాదర స్వాగతం పలికారు. ఆర్కె బీచ్‌లో ప్రత్యేకంగా నిర్మించిన వేదికపై అశోక్‌గజపతిరాజు, బిస్త్‌లు సతీసమేతంగా ఆశీనులై విన్యాసాలు వీక్షించారు. తీరం వెంబడి వేలాదిగా తరలివచ్చిన జనం నేవీ విన్యాసాలు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కత్తిమీద సామే అయింది. ఒకానొక సమయంలో వారిపై లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. సముద్రంలోని రాళ్లపై, తీరం వెంబడి భవంతులపై ఎక్కి మరీ ప్రజలు ఈ విన్యాసాలు తిలకించారు. దూరంగా ఉన్న వారికి కనిపించేలా బీచ్‌లో ప్రత్యేకంగా ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి విన్యాసాలు లైవ్ టెలికాస్ట్ చేశారు. తీరంలోని కురుసుర సబ్‌మెరైన్‌తో పాటు సముద్రంలోని నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాణసంచా భారీగా కాల్చి విన్యాసాలకు ముగింపు పలికారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దారులు మళ్లించి సిటీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. అయితే ట్రాఫిక్ నియంత్రణలోనూ నేవీ సిబ్బంది పాలు పంచుకోవడం విశేషం. బీచ్‌కు వెళ్లే దారుల్లో, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి నేవీ ఉద్యోగులు కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. -
టర్బో మేఘ టేకాఫ్‌కు లైన్‌క్లియర్
డీజీసీఏ నుంచి నిర్వహణ అనుమతి ♦ 10న వివరాలు ప్రకటించనున్న ప్రమోటర్ రాంచరణ్ ♦ 12 నుంచి ట్రూజెట్ పేరుతో విమాన సర్వీసులు! సాక్షి, న్యూఢిల్లీ : సినీ నటుడు రాంచరణ్ తేజ ప్రమోటర్‌గా ఉన్న టర్బో మేఘ ఎయిర్‌లైన్స్‌కు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఆపరేటర్ పర్మిట్‌ను జారీచేసింది. ఈ అనుమతి పత్రాలను ఈ ఎయిర్‌లైన్స్‌కు మరో ప్రమోటర్ అయిన వంకాయలపాటి ఉమేశ్‌కు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు మంగళవారం సాయంత్రం ఇక్కడి రాజీవ్‌భవన్‌లో అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘టర్బో మేఘ ఎయిర్‌లైన్స్‌కు నిర్వహణ అనుమతి ఇచ్చాం. గత ఏడాది కాలంలో ఇలా కొత్తగా సేవలు అందిస్తున్న నాలుగో ఎయిర్‌లైన్స్ ఇది. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణభారత ప్రాంతంలో ఈ ఎయిర్‌లైన్స్ సంస్థ ‘ట్రూజెట్’ బ్రాండ్‌తో సేవలు అందిస్తుంది. హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-ఔరంగాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగుళూరు వంటి ప్రాంతాలకు ఈ సంస్థ సర్వీసులు అం దుబాటులోకి వస్తాయి. గోదావరి మహా పుష్కరాల సందర్భంగా భక్తుల అవసరాల దృష్ట్యా రాజమండ్రికి సర్వీసులు నడపాలని కోరాం. అందుకు వారు అం గీకరించారు. రాజమండ్రి-హైదరాబాద్, రాజమండ్రి-చెన్నై, రాజమండ్రి-బెంగళూరు మార్గాల్లో పుష్కరాల సమయంలో వారు నడుపుతామన్నారు. 70 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగే రెండు ఎయిర్ క్రాఫ్టులు ఉన్నాయి’ అని ఆయన వివరించారు. డిసెంబర్ నాటికి ఐదు విమానాలు: ఉమేశ్ విలేకరుల సమావేశం అనంతరం ప్రమోటర్ ఉమేష్ మాట్లాడుతూ.. ‘అన్ని అనుమతులు త్వరగా రావడం సంతోషంగా ఉంది. ట్రూజెట్ పేరుతో నడిపే ఈ సర్వీసులు, మా సేవలను మా మరో ప్రమోటర్ రాంచరణ్ తేజ ఈనెల 10న వివరిస్తారు. 12న సేవలు ప్రారంభించాలనుకుంటున్నాం. వచ్చే నెలలో మరో విమానం వస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఐదు విమానాలు అందుబాటులోకి వస్తాయి. పౌర విమానయాన రంగాన్ని దగ్గరగా చూసిన నేను.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరల్లో సేవలు అందిస్తాం. ముందుగా పుష్కరాలకు దక్షిణాదిలోని అన్ని నగరాల నుంచి రాజమండ్రికి విమాన సర్వీసులు అందిస్తాం’ అని చెప్పారు. -
అశోక్ ముందు పంచాయితీ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎదుట నేడు విజయనగరం టీడీపీ పంచాయితీ జరగనుంది. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటుండటంతో వ్యవహారం రచ్చకెక్కింది.ఇప్పటికే ఎమ్మెల్యే మీసాల గీత,మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మధ్య ఆధిపత్య పోరు కొనసాగడమే కాకుండా ఎవరికి వారు తమ చర్యల్ని అమలు చేస్తున్నారు. మున్సిపాల్టీలో ఏం జరిగినా తనకు తెలిసే జరగాలని మీసాల గీత పట్టుబడుతుండగా, తనకు నచ్చిన రీతిలో నడవాలని ప్రసాదుల రామకృష్ణ ప్రతిష్టకు పోతున్నారు. ఇటీవల కమిషనర్ చాంబర్లో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే తన పవరేంటో చూపించారు. ఆ సమయంలో ప్రసాదుల పెద్దగా మాట్లాడకపోయినా ఆ తర్వాత పలు విషయాలపై ్రపశ్నించిన 24వ వార్డు రొంగలి రామారావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ఒకానొక సందర్భంలో నీ అంతు చూస్తానంటూ రొంగలి రామారావును హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. మున్సిపాల్టీలో ఎమ్మెల్యే, చైర్మన్ మధ్యనే కాకుండా ఎమ్మెల్యే-కౌన్సిలర్ల మధ్య, చైర్మన్- కౌన్సిలర్ల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఆ మధ్య కొందరు కౌన్సిలర్లు ఆ ఇద్దర్నీ వ్యతిరేకిస్తూ ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డారు. ఇలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అలాగే, ఏఎంసీ చైర్మన్ పదవి విషయంలో కూడా విభేదాలు తలెత్తాయి. కొందరు సైలాడ త్రినాథరావుకు ఇవ్వాలని,మరికొందరు కర్రోతు నర్సింగరావుకు ఇవ్వాలని, ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరును ప్రతిపాదిస్తూ గ్రూపులు కట్టారు. ఇలా అంతర్గత విభేదాలతో రచ్చకెక్కుతుంటే ప్రజల్లో చులకన భావం పెరుగుతుందంటూ పట్టణ టీడీపీ కన్వీనర్ డాక్టర్ వీఎస్ ప్రసాద్ జోక్యం చేసుకుని విజయనగరంలో నేతల మధ్య సమన్వయం రావాలని, దీనికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అశోక్ గజపతిరాజును కోరినట్టు తెలిసింది. ఆ మేరకు ఆదివారం ఉదయం 10గంటలకు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసేందుకు అశోక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సమావేశానికి హాజరు కావాల్సిన నాయకులకు శనివారం రాత్రి సమాచారం అందించారు. ముఖ్యంగా మున్సిపాల్టీలో పరిపాలన కుంటు పడిందని, ఏ ఒక్క అభివృద్ధీ జరగలేదని, పాలనా వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోందని పలువురు విరుచుకుపడనున్నారు. అలాగే, వారి వారి భాగోతాలను బయట పెట్టుకోనున్నారు. మరి, ఈ పంచాయితీలో ఏం తేలనుందో చూడాలి.