సమ్మె విరమించుకున్న జూడాలు | Junior Doctors called of strike in Hyderabad after the high court order | Sakshi
Sakshi News home page

సమ్మె విరమించుకున్న జూడాలు

Published Sun, Aug 18 2013 6:55 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Junior Doctors called of strike in Hyderabad after the high court order

హైదరాబాద్: గత 20 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు తమ నిరసనను విరమించుకున్నారు. జూడాలు తమ ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో జూడాలు వెనక్కి తగ్గారు.  జూడాలు సోమవారం నుంచి విధులకు హాజరవుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఫణి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

 

సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. వెంటనే సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని న్యాయస్థానం వైద్య విద్యార్థులను ఆదేశించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ జూనియర్ డాక్టర్లకు శుక్రవారం హైకోర్టు సూచించింది.  డిమాండ్ల పరిష్కారంపై సర్కారు మొండి వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ వైద్యులు గత నెల 29 నుంచి సమ్మెకు దిగారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద చేరినా 9లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని... ఆ వసూళ్లను తక్షణమే నిలిపివేసి జీఓ నెంబరు 93ను రద్దు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు.

 ప్రభుత్వాస్పత్రుల్లో శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని... ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వాస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలనేది వీరి మరో డిమాండ్‌. వీటిని పరిష్కరించాలని కోరుతూ గతనెల 16న వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి, వైద్య విద్య మంత్రికి లేఖ ఇచ్చారు. అయితే  వారు స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement