సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్‌లు సమ్మె విరమించారు. ప్రభుత్వ చొరవతో జూడాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎమ్‌సీ) బిల్లును రద్దు చేయాలని కోరుతూ జూడాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో కొద్ది రోజులుగా జూడాలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులతో 13 జిల్లాలకు చెందిన జూనియర్ డాక్టర్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జూడాలు జరిపిన చర్చల సఫలం అయ్యాయి. జూడాలు తమ వద్ద ప్రస్తావించిన సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment