junior doctors strike
-
RG Kar Medical Hospital: బెంగాల్లో కొనసాగుతున్న వైద్యుల రాజీనామాలు
కోల్‌కతా: ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని, ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతోంది. వారికి సంఘీభావంగా గురువారం ప్రభు త్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి లోని 40 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో ఏడుగురు, ఉత్తర బెంగాల్లో ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వైద్యుల ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి డాక్టర్ గౌతమ్ దాస్ తెలిపారు. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. పరిష్కరించడంలో పురోగతి లేదని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే రాజీనామాల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్లకు మద్దతుగా గురువారం సీనియర్ డాక్టర్లు కూడా నిరసనలో పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన 54 మంది సీనియర్ డాక్టర్లు మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన సుమారు 35 మంది వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాగా, జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్ష గురువారం ఐదో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా నిరాహార దీక్షా స్థలాన్ని సందర్శించిన పోలీసు బృందం... జూనియర్ డాక్టర్ల ఆరోగ్యం క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీక్షను విరమించాలని కోరింది. -
మీరిక వెళ్లొచ్చు
కోల్‌కతా: రోజంతా హైడ్రామా తర్వాత బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ డాక్టర్లకు మధ్య శనివారం చర్చలు అసలు ప్రారంభమే కాలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్థన మేరకు ‘ప్రత్యక్ష ప్రసారం’ డిమాండ్‌ను పక్కనబెట్టి చర్చలకు సిద్ధపడ్డ జూనియర్ డాక్టర్లను ఆకస్మాత్తుగా సీఎం నివాసం దగ్గర నుంచి పంపేశారు. చాలా మొరటుగా మీరికి వెళ్లిపోవచ్చని చెప్పారని జూడాలు ఆరోపించారు. ‘చర్చలకు ఆహ్వానించడంతో సీఎం నివాసానికి వచ్చాం. ప్రత్యక్షప్రసారం లేదా వీడియో రికార్డింగు ఉండాలని డిమాండ్ చేశాం. సీఎం మమతా బెనర్జీ బయటకు వచ్చి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం మినిట్స్‌ను మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. మాలో మేము చర్చింకున్నాం. సీఎం విజ్ఞప్తి మేరకు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఇదే విషయాన్ని ఆరోగ్యమంత్రి చంద్రిమ భట్టాచార్యకు తెలుపగా.. ఇక చాలు మీరు వెళ్లిపోండని ఆమె చెప్పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, మీకోసం మూడు గంటలుగా వేచిచూస్తున్నామని తెలిపారు. అర్ధంతరంగా మమ్మల్ని పంపేశారు’ అని సీఎం నివాసం వద్ద జూనియర్ డాక్టర్లు మీడియాతో వాపోయారు. చర్చలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ‘ఈ ఉదంతం ప్రభుత్వం అసలు రంగును బయటపెట్టింది. చర్చలపై ఎవరికి చిత్తశుద్ధి లేదో తెలుపుతోంది’ అని ఒక జూనియర్ డాక్టర్ కన్నీరుపెట్టుకుంటూ అన్నారు. ‘ఈ రోజుకు ఇక ముగిసినట్లే. మూడు గంటలుగా మేం వేచిచూస్తున్నాం. మీరు సీఎం నివాసం లోపలికి రాలేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది (రాత్రి అయిందని)’ అని ఆరోగ్యమంత్రి చంద్రిమ అంటున్న వీడియోను జూడాలు మీడియాకు షేర్ చేశారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లు నెలరోజులకు పైగా విధులను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. సెపె్టంబరు 10న సాయంత్రానికల్లా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. జూడాల డిమాండ్ మేరకు స్వయంగా చర్చల్లో పాల్గొనడానికి మమత అంగీకరించారు. ప్రత్యక్షప్రసారంపై పీటముడి పడినా.. చివరకు శనివారం జూడాలు దానిపై వెనక్కితగ్గారు. అయినా సర్కారు వైఖరితో చర్చలు సాధ్యపడలేదు. ఎన్నిసార్లు నన్నిలా అవమానిస్తారు: మమత అంతకుముందు సీఎం నివాసం వద్దకు చేరుకొని జూనియర్ డాక్టర్లు చర్చల ప్రత్యక్షప్రసారం డిమాండ్‌తో బయటే నిలబడిపోయా రు. వర్షంలో తడుస్తూ అలాగే నిలబడ్డారు. దాంతో సీఎం మమత బయటకు వచి్చ.. ‘మీరందరూ లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. వైద్యురాలి హత్యాచారం కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రత్యక్షప్రసారం సాధ్యం కాదు. చర్చలను వీడియో రికార్డు చేసి.. సుప్రీంకోర్టు అనుమతితో మీకొక కాపీ అందజేస్తాం. ఈ రోజు సమావేశమవుదామని మీరే కోరారు. మీకోసం వేచిచూస్తున్నా. మీరెందుకు నన్నిలా అవమానిస్తున్నారు. దయచేసి నన్నిలా అవమానించొద్దు. ఇదివరకు కూడా మూడుసార్లు మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ మీరు రాలేదు’ అని మమత జూడాలతో అన్నారు. జూడాల శిబిరం వద్ద ప్రత్యక్షం శనివారం ఉదయం అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీఎం మమతా బెనర్జీ స్వయంగా జూనియర్ డాక్టర్ల వద్దకు వచ్చారు. ఐదురోజులుగా జూడాలు బైఠాయించిన స్వాస్థ్య భవన్ (ఆరోగ్యశాఖ కార్యాలయం) వద్దకు చేరుకున్నారు. జూడాల డిమాండ్లను పరిశీలిస్తానని, ఎవరైనా తప్పుచేశారని తేలితే వారిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మెడికోలు వర్షాలకు తడుస్తూ రోడ్డుపై ఆందోళనలు కొనసాగిస్తుంటే తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. తానిక్కడి రావడం సమస్య పరిష్కారం దిశగా చివరి ప్రయత్నమని తెలిపారు. సమ్మె చేస్తున్న జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుత ఆందోళనను అణిచివేయడానికి ఇది ఉత్తరప్రదేశ్ కాదు, బెంగాల్ అని సీఎం వ్యాఖ్యానించారు. -
ఏపీలో సమ్మె విరమించిన జూడాలు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వ చొరవతో జూడాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎమ్సీ) బిల్లును రద్దు చేయాలని కోరుతూ జూడాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో కొద్ది రోజులుగా జూడాలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులతో 13 జిల్లాలకు చెందిన జూనియర్ డాక్టర్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జూడాలు జరిపిన చర్చల సఫలం అయ్యాయి. జూడాలు తమ వద్ద ప్రస్తావించిన సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. -
మూడో రోజు కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
-
జూడాల సమ్మెతో స్తంభించిన వైద్యసేవలు
సాక్షి,హైదరాబాద్: ‘నల్లగొండ జిల్లా రామన్నపేటకు చెందిన మురళీ గతకొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం బుధవారం ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నాడు. తీరా న్యూరో ఓపీలో వైద్యులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక మహబూబ్‌నగర్‌కు చెందిన రాజ్యలక్ష్మి గర్భంతో ఉంది. సాధారణ వైద్య పరీక్షల కోసం ఉదయం ఏడు గంటలకే పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చేరుకుంది. ఓపీలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఎదురు చూడాల్సి వచ్చింది. సుదూర ప్రాంతం నుంచి ఆస్పత్రికి చేరుకున్న ఆమె ఉదయం నుంచి ఏమీ తిన కుండా క్యూలో నిలబడటం వల్ల, నీరసంతో సొమ్మసిల్లిపడిపోయింది. ఇక పటాన్‌చెరుకు చెందిన కవిత సుస్తీ చేసిన తన కుమా రుడిని చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఓపీ వైద్యులు పట్టించు కోకపోవడంతో ఆమె పక్కనే ఉన్న ప్రైవేటు ఆస్పత్రి వైద్యు డిని ఆశ్రయించాల్సి వచ్చింది’. ఇలా ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న ఆస్పత్రుల్లో జూడాల సమ్మెతో అవుట్‌పేషెంట్ సర్వీ సులు స్తంభించి పోయాయి. ఓపీ బహిష్కరించి...ఆందోళన ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ డాక్టర్ల సంఘం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ పెంపువల్ల తమకు ఉద్యోగాలు దక్కకపోగా, ఇప్పటికే రెసిడెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్న వైద్యులు పదోన్నతులు పొందే అవకాశాన్ని కోల్పో యే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఈ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 4 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రులతో పాటు పేట్లబురుజు, నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం, కోటి చెవిముక్కుగొంతు ఆస్పత్రి, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రుల్లోని జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఆందోళనలో భాగంగా ఓపీ సేవలను బహిష్కరించి, ఆయా ఆస్పత్రులు పరిపాలన భవనాల ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఓపీ, ఐపీ సేవలు స్తంభించిపోయాయి. సగానికిపైగా చికిత్సలు వాయిదా అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకున్నప్పటికీ...అత్యవసర చికిత్సల్లో సహాయపడే జూడాలు సమ్మెలో ఉండటంతో ఆయా చికిత్సలు వాయిదా వేయాల్సి వచ్చింది. గాంధీ జనరల్ ఆస్పత్రి సహా ఉస్మానియా ఆస్పత్రిలోనూ బుధవారం సగానికి పైగా చికిత్సలు వాయిదా పడ్డాయి. ఇన్పేషెంట్లుగా అడ్మిటై..బుధవారం ఆయా ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న రోగులకు చికిత్సలు వాయిదా వేసినట్లు చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ఉస్మానియాలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిటైన రోగులకూ ఇబ్బందులు తప్పలేదు. మంత్రి హామీతో సమ్మె విరమణ జూనియర్ వైద్యుల సమస్యను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ నెల 21 తర్వాత సీఎం కేసీఆర్‌తో చర్చలకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సమ్మెను విరమించి, విధుల్లో చేరాలని కోరడంతో మంత్రి హామీ మేరకు తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. -
ఆందోళనను విరమించనున్న జూడాలు!
కోల్‌కతా: గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళనకు అతి త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జూనియర్ డాక్టర్ల డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించిన మమతా బెనర్జీ ప్రభుత్వం.. సోమవారం వారితో బహిరంగ చర్చలకు అంగీకరించారు. మీడియా సమక్షంలో జరిగే ఈ చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మమత ఓకే అన్నారు. కోల్‌కతాలోని తాత్కాలిక సచివాలయం నబన్నాలో సీఎం మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆందోళన చేస్తున్న జూడాల డిమాండ్లను నెరవేర్చేందుకు సీఎం మమత అంగీకరించారు. జూడాల డిమాండ్ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు. దీంతో తమ నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని జూడాల ప్రతినిధులు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరడంతో వారు త్వరలోనే ఆందోళనలకు స్వస్తి చెప్పి.. తిరిగి విధుల్లో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక, ఈ చర్చలకు మీడియాను అనుమతించే విషయంలో దీదీ యూటర్న్ తీసుకున్నారు. కేవలం ఒక్క స్థానిక మీడియా చానెల్‌ను మాత్రమే ఈ చర్చల్లో పాల్గొనేందుకు అంగీకరిస్తామని ఆమె తేల్చిచెప్పారు. దీంతో ఉత్సాహంగా చర్చలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు. -
మెత్తబడ్డ ప్రభుత్వ వైద్యులు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో గత 6 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చల విషయంలో ఆదివారం కాస్త మెత్తబడ్డారు. చర్చలు ఎక్కడ నిర్వహించాలన్న విషయమై తుది నిర్ణయాన్ని మమతా బెనర్జీకే వదిలిపెట్టామని వైద్యులు తెలిపారు. అయితే ఈ చర్చావేదిక మీడియా సమక్షంలో బహిరంగంగా ఉండాలనీ, గదిలో ఉండకూడదని షరతు విధించారు. కోల్‌కతాలో ఆదివారం దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమైన వైద్యుల గవర్నింగ్ బాడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆందోళనను వీలైనంత త్వరగా ముగించాలని మేమెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చించేందుకు వీలుగా సీఎం మమత చర్చావేదికను ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ఆందోళన చేస్తున్న వైద్యులతో సోమవారం సమావేశమయ్యేందుకు సీఎం అంగీకరించారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయం పక్కనే ఉన్న ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఒక్కో ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ కార్యక్రమానికి ఆహ్వా నించామని పేర్కొన్నారు. ఈ చర్చకు మీడియాను ఆహ్వానించాలన్న డాక్టర్ల ప్రతిపాదనపై మమత సుముఖంగా లేరని స్పష్టం చేశారు. నేడు దేశవ్యాప్త సమ్మె.. బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా సోమవారం దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. ఈ ఆందోళన నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అన్నిరకాల వైద్యసేవలు(అత్యవసర సేవలు మినహా) నిలిచిపోతాయని తెలిపింది. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడిచేసే వ్యక్తులను శిక్షించేందుకు కేంద్రం సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసింది. శిక్షాస్మృతిని సవరించాలని కోరింది. గత సోమవారం ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఓ రోగి చనిపోవడంతో అతని బంధువులు ఇద్దరు డాక్టర్లను చితకబాదారు. ఈ దాడికి నిరసనగా బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగగా, దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సంఘీభావం తెలిపారు. మరోవైపు, ఆందోళన కారణంగా బెంగాల్లో అత్యవసర సేవలకూ ఇబ్బంది కలుగుతోంది. ఈ ఆందోళనల కారణంగా కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఏం ప్రభుత్వ ఆసుపత్రిలో శామ్యూల్ అనే వ్యక్తి గుండె ఆపరేషన్ ఆగిపోయింది. తామంతా చాలా దూరప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చామనీ, ఇప్పుడు చికిత్స తీసుకోకుండా స్వస్థలాలకు తిరిగి వెళ్లలేమని రోగులు, వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మీ డిమాండ్లన్నీ నెరవేర్చా.. వచ్చి పనిలో చేరండి!
కోల్‌కతా: గత ఐదు రోజులుగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనలతో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు, డాక్టర్ల డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తామని, వెంటనే ఆందోళన విరమించి.. విధుల్లో చేరాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. శనివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైద్యులకు వ్యతిరేకంగా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని ఆమె హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వైద్యులకు భద్రత, సహకారం అందిస్తామని, డాక్టర్లపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి జైల్లో వేస్తామని ప్రకటించారు. డాక్టర్ల ఆందోళన విషయంలో ఒకవైపు వాదాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారని, ఆందోళన చేస్తున్న వైద్యులు ప్రభుత్వ ప్రతినిధులతో అసభ్యంగా ప్రవర్తించారని, అయినా వైద్యుల పట్ల తమ ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించిందని తెలిపారు. డాక్టర్లను తాము టార్గెట్ చేయడం లేదని, వారిని కాపాడేందుకే తాము ప్రయత్నిస్తున్నామని ఆమె వెల్లడించారు. గతవారం కోల్‌కతా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 85 ఏళ్ల వ్యక్తి చనిపోవడంతో వారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసి.. దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందితోపాటు పలువురు జూనియర్ డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగా స్పందించకపోవడంతో వైద్యుల నిరసన తీవ్రతరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇంకా పెద్దది కాకుండా చూడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇప్పటికే మమతకు సూచించారు. అంతేకాకుండా విధుల్లో ఉన్న వైద్యులకు తగిన రక్షణ కల్పించాలంటూ ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. బెంగాల్లో వైద్యుల ఆందోళనపై నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మరోవైపు ఆందోళనకు దిగిన జూడాలను చర్చలకు మమత ప్రభుత్వం ఆహ్వానించగా జూడాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న జూడాల డిమాండ్లన్నింటికీ అంగీకరిస్తున్నట్టు మమత ప్రభుత్వం ప్రకటించింది. -
17న వైద్యుల దేశవ్యాప్త సమ్మె
న్యూఢిల్లీ/కోల్‌కతా: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మూడురోజుల పాటు జరిగే వైద్యుల దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలను శుక్రవారం ప్రారంభించింది. పశ్చిమబెంగాల్లోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ ఆందోళనలకు దిగిన వైద్యులకు సంఘీభావంగా ఈ ప్రదర్శనలు చేపట్టింది. అదేవిధంగా ఈ నెల 17న దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మెకు పిలుపునిచ్చింది. అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అవుట్ పేషంట్ విభాగాలతో పాటు అత్యవసరం కాని వైద్య సేవలన్నిటినీ 24 గంటల పాటు నిలిపివేయాలని సూచించింది. అయితే అత్యవసర, క్యాజువాలిటీ సేవలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యులపై దాడులను నిరోధించేందుకు కేంద్ర చట్టం తేవాలనే తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఐఎంఏ లేఖ రాసింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా వైద్యులంతా నల్లబ్యాడ్జీలు ధరించాలని, ధర్నాలు, శాంతియాత్రలు నిర్వహించాలని సూచించింది. కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాలలో డాక్టర్ పరిబాహ ముఖర్జీ తదితరులపై దాడిని ఖండిస్తున్నట్లు ఐఎంఏ సెక్రటరీ జనరల్ ఆర్వీ అశోకన్ చెప్పారు. నిందితులపై బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, రెసిడెంట్ డాక్టర్ల చట్టబద్ధమైన డిమాండ్లన్నిటినీ బేషరతుగా అంగీకరించాలని కోరారు. నాలుగో రోజుకు చేరిన సమ్మె ప్రభుత్వాసుపత్రుల్లో తమకు భద్రత కల్పించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు బెంగాల్ జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంఘీభావంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన 100 మందికి పైగా సీనియర్ డాక్టర్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. కాగా వైద్యుల సమ్మెకు ముఖ్యమంత్రి మమత మేనల్లుడు, వైద్య విద్యార్థి కూడా అయిన అబేష్ బెనర్జీ మద్దతుగా నిలవడం విశేషం. బెంగాలీ నేర్చుకోవాల్సిందే కాంచ్‌రాపార: పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్నవారు ఎవరైనా బెంగాలీలో మాట్లాడటం నేర్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా కాంచ్‌రాపార సభలో ఆమె మాట్లాడారు. ‘మనం బంగ్లా భాషను ముందుకు తీసుకురావాలి. ఢిల్లీ వెళ్లినప్పుడు హిందీ మాట్లాడతాం. నేను అలాగే చేస్తా. తమిళనాడు వెళ్లినప్పుడు నాకు తమిళ భాష తెలియదుగానీ కొన్ని పదాలు తెలుసు. అలాగే మీరు బెంగాల్వస్తే బెంగాలీలో మాట్లాడాల్సిందే’ అని అన్నారు. సమ్మె వెనుక బయటి వ్యక్తులు రాష్ట్రంలో వైద్యుల సమ్మె వెనుక కొందరు బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని మమత అన్నారు. తాను గురువారం ఎస్ఎస్కేఎం ఆస్పత్రిని సందర్శించినప్పుడు ప్రభుత్వానికి, తనకు వ్యతిరేకంగా నినదిస్తున్నవారిలో కొందరు బయటివ్యక్తులను తాను చూశానని చెప్పారు. కొందరిలా వాస్తవాలు నిర్ధారించుకోకుండా తాను మాట్లాడనని ఆస్పత్రిని సందర్శించిన సినీ నిర్మాత అపర్ణాసేన్ను ఉద్దేశించి మమత వ్యాఖ్యలు చేశారు. -
ఎస్వీ మెడికల్ కాలేజీలో జూడాల సమ్మె
తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జూడాల సమ్మెతో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని వారు చెబుతున్నారు. -
కొనసాగుతున్న జూడాల సమ్మె
సీఎంకు పోస్టుకార్డు ఉద్యమం విశాఖ మెడికల్:తో పాటు ఏడు అనుబం ధ ఆస్పత్రులను, ఓపీ, వార్డు వైద్య సేవలను వైద్య విద్యార్థులు బహిష్కరించి కేజీహెచ్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 107ను రద్దు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు సామూహికంగా పోస్టుకార్డులు పంపారు. 2012లో గాంధీ ఆసుపత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులకు మద్దతుగా సమస్యలు పరిష్కరించాలని మాట్లాడిన విషయాన్ని పోస్టుకార్డు ద్వారా వారు గుర్తు చేశారు. శనివారం కేజీహెచ్ ఆంధ్ర వైద్య కళాశాలలో అంతర్గతంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నంలోగా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే సోమవారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూడా నేతలను ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.కుమార్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనబాబు పిలిపించి రాష్ట్ర వైద్య విద్య(డీఎంఈ)నుంచి వచ్చిన వర్తమానాన్ని జూడాలకు తెలిపారు. ఉమ్మడి హైకోర్టు తీర్పు ఆంధ్ర వైద్య విద్యార్థులకు కూడా వర్తిస్తుందని, సోమవారం లోగా విధులకు హాజరు కాని జూనియర్ డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో జూనియర్ వైద్యుల సంఘం నేతలు డాక్టర్ నాగచైతన్య, డాక్టర్ షాన్వాజ్ మాట్లాడుతూ తెలంగాణ వైద్య విద్యార్థులకు హైకోర్టు తీర్పు ప్రతులను రాష్ట్ర కమిటీ నేతలు పరిశీలిస్తున్నారని, ఆ తీర్పు ఆంధ్ర వైద్య విద్యార్థులకు ఏ మేరకు వర్తిస్తుందో లేదో.. న్యాయ సలహా తీసుకొని భవిష్యత్ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. హైకోర్టు తీర్పులో స్పష్టత లేదని, దీనిపై రాష్ట్ర నేతలు న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. సాధారణ వైద్యసేవలకు అంతరాయం జూనియర్ డాక్టర్ల సమ్మెలో పెద్ద ఎత్తున పీజీలు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లు ఉన్నందున శుక్రవారం కూడా సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలిగింది. అత్యవసర వైద్య సేవలకు ఒకపక్క హాజరవుతున్న జూనియర్ డాక్టర్లు వార్డు వైద్య సేవలను బహిష్కరించారు. ఫలితంగా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పెద్ద ఎత్తున డిశ్చార్జ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త రోగులను తక్కువ సంఖ్యలో చేర్చుకుంటున్నారు. అత్యవసర కేసులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. వైద్య కళాశాల పరిధిలోని అన్ని అనుబంధ ఆసుపత్రుల్లో సర్వీస్ పీజీల సేవలతోనే నడిపిస్తున్నారు. మత్తు, ప్రసూతి పీజీలు పెద్ద ఎత్తున సమ్మెలో ఉన్నందున శస్త్ర చికిత్సలపై తీవ్ర ప్రభావం కనిపించింది. చాలా శస్త్ర చికిత్సలను వాయిదా వేశారు. రోజూ జరిగే శస్త్రచికిత్సల్లో సగం మేరకు మాత్రమే జరిగాయి. -
ఓపిక పట్టాల్సిందే
* ఓపీ విభాగాలలో వైద్య సేవలకు తిప్పలు * శస్త్ర చికిత్సలపై పాక్షిక ప్రభావం * జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రారంభం విశాఖ మెడికల్: ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధవారం జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద సమావేశమై ప్లకార్డులు ప్రదర్శించి మౌన నిరసన చేపట్టారు. పోస్టుగ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్ వైద్యులు, హౌస్ సర్జన్లు పెద్ద సంఖ్యలో తొలిరోజు ఓపీ, వార్డు వైద్య సేవలు బహిష్కరించారు. అత్యవసర వైద్య సేవలకు హాజరయ్యారు. కేజీహెచ్‌తో పాటు ప్రభుత్వ విక్టోరియా ప్రసూతి ఆసుపత్రి, ప్రాంతీయ కంటి, ఈఎన్టీ, ఛాతి, అంటువ్యాధులు, ఆర్సీడీ, ప్రభుత్వ మానసిక ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్, వార్డు వైద్య సేవలకు అంతరాయం కలిగింది. ఉదయం 8 గంటలకే కేజి హెచ్ ఓపికి చేరుకున్నా 10 గంటల వరకు తాళాలు తెరవకపోవడంతో రోగులు బారులు తీరారు. మెడిసిన్ ఓపీ విభాగానికి 11 గంటల వరకు వైద్యులు రాక రోగుల తాకిడి కనిపించింది. 11 గంటల తర్వాత వైద్యులు ఒంటి గంటలోపే రోగులను నిమిషాల్లో చూసి పరీక్షలు రాసి పంపారు. రోగులు మూకుమ్మడిగా ఎక్స్‌రే, క్లినికల్ ల్యాబ్‌కు పోటెత్తారు. వార్డుల్లో రోగులు సకాలంలో చికిత్స అందక అవస్థలు పడ్డారు. ఉదయం ఓపీలో రోగులను చూసిన సర్వీస్ పీజీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మధ్యాహ్నం వార్డులకు వచ్చారు. కార్డియాలజీ, కి డ్నీ, ప్రసూతి, కాలిన గాయాలు, పిల్లల శస్త్ర చికిత్స, న్యూరోసర్జరీ, ఉదరకోస వైద్య విభాగాలు వంటి కీలక వార్డుల్లో రోగులు సకాలంలో చికిత్సలందక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ విక్టోరియా(ఘోషా)ఆసుపత్రిలో గర్భిణులు యాంటీనేటర్ల తనిఖీలు ఆలస్యంగా జరిగాయి. నవజాత శిశు చికిత్స విభాగం(ఎస్ఎన్సీయూ)లో శిశువుల చికిత్సకు అంతరాయం ఏర్పడింది. ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో 28 మంది పీజీలు, ముగ్గురు సీనియర్ రెసిడెంట్లు, ఎనిమిది మంది హౌస్ సర్జన్లు సమ్మెలో పాల్గొనడంతో ఓపీ రోగులు అవస్థలు పడ్డారు. ఇక్కడ ఐదుగురు సర్వీస్ పీజీలు మాత్రమే విధులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేసిన రోగులను సమ్మె కారణంగా నిలిపేశారు. ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి ఓపీ రోగుల తాకిడి ఎక్కువైంది. ఈఎన్టీ, ఆర్సీడీ, మానసిక ఆసుపత్రుల్లో కూడా రోగులు ఇబ్బందులు పడ్డారు. సమ్మె ప్రభావం అనుబంధ ఆసుపత్రుల్లోని తొలి రోజు శస్త్రచికిత్సలపై పాక్షిక ప్రభావం చూపింది. జూనియర్ డాక్టర్ల సంఘం అద్యక్ష కార్యదర్శులు డాక్టర్ షాన్వాజ్, డాక్టర్ నాగచైతన్యలు మాట్లాడుతూ ప్రభుత్వం జూనియర్ వైద్యులచే వెట్టిచాకిరీ చేయించుకుంటుందని ఆరోపించారు. మెయిన్ గేటు వద్ద మౌన నిరసనలో ఆంధ్ర వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రసాద్, సమన్వయకర్త డాక్టర్ శోభన్, రాజేష్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
అనంతపురం: ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనలు ఉధృతం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అనంతపురంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే 107 నెంబర్ జీవోను ఉప సంహరించాలంటూ డిమాండ్ చేశారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అంతేకాక తమపై దుష్ప్రచారం చేస్తోందని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. ** -
చేతికి నల్లరిబ్బన్లతో జూడాల వినూత్న నిరసన
సీనియర్ రెసిడెంట్లూ సమ్మెలోకి విజయవాడ : గ్రామీణ సర్వీసు పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 107ను రద్దు చేయాలని, ఆ సర్వీసును కంపల్ సరీగా కాకుండా వలంటరీ సర్వీసుగా మార్పుచేయాలని డిమాండ్ చేస్తూ జూడాలు చేస్తున్న సమ్మె మూడో రోజూ కొనసాగింది. సోమవారం జూడాలు సిద్ధార్థ వైద్య కళాశాల నుంచి రెండు చేతులకు సంకెళ్లలా నల్లరిబ్బన్లు కట్టుకుని వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. జీవో రద్దులో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకునే వరకూ సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఉత్తర్వులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికే ఉందని, కోర్టు తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకుందామని చెప్పడం సమంజసం కాదన్నారు. స్పందించకుంటే అత్యవసర సేవలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల పాటు పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులు, హౌస్సర్జన్లు మాత్రమే విధులు బహిష్కరించగా, సోమవారం నుంచి కంపల్ సరీ సర్వీసు చేస్తున్న సీనియర్ రెసిడెంట్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో వార్డుల్లో రోగులకు సేవలందించడం కష్టతరంగా మారింది నేడు స్వచ్ఛ భారత్ జూడాల సమ్మెలో భాగంగా మంగళవారం ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ తనూజ్ తెలిపారు. -
జూడాలతో డీఎంఈ చర్చలు విఫలం
కొనసాగుతున్న సమ్మె సాక్షి, విజయవాడ బ్యూరో: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ఏపీ వైద్య విద్య డెరైక్టర్ (అకడమిక్) డాక్టర్ వెంకటేశ్ సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒక ఏడాది గ్రామీణ సర్వీసు తప్పనిసరి నిబంధనను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జూడాలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకటేశ్ సిద్ధార్థ వైద్య కళాశాల ఆడిటోరియంలో జూడాలతో సమావేశమయ్యారు. చర్చలు ముగిసిన తర్వాత డీఎంఈ విలేకరులతో మాట్లాడారు. సమ్మె వ్యవహారం హైకోర్టులో ఉందని, తీర్పు వచ్చేవరకూ వేచి చూడాలని జూడాలను కోరినట్లు చెప్పారు. జూడాలు కోరుతున్నట్లుగా వాలంటరీ సర్వీసుకు అవకాశం కల్పిస్తే ఒంగోలు, శ్రీకాకుళం వంటి కాలేజీలకు వెళ్లరని, తద్వారా అక్కడి ఆస్పత్రుల్లో ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు కార్తీక్, క్రాంతికుమార్ విలేకరులకు తెలిపారు. మరోవైపు విజయవాడ సిద్ధార్థ, కాకినాడ రంగరాయ, కర్నూలు, తిరుపతి వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో జూడాలు విధుల బహిష్కరణను కొనసాగించారు. విజయవాడ సిద్ధార్థ, తిరుపతి రుయా ఆస్పత్రుల వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. -
జూడాల సమ్మె చట్ట విరుద్ధం
తీర్పు వెలువరించిన హైకోర్టు * సమ్మెతో రోగులను ఇబ్బందిపెట్టడం తగదు * 48 గంటల్లోగా వారు విధుల్లో చేరాలి * లేకపోతే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టవచ్చు * జూడాల డిమాండ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు * ఇప్పటికైనా వాటిని పరిష్కరించాలని సూచన సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉన్న వైద్యులకు ఈ విధంగా సమ్మె చేసి.. రోగులను ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రం తగదని ఆక్షేపించింది. సమ్మె విరమించి 48 గంటల్లోగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. ఆ లోగా వారు విధుల్లో చేరకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. అయితే దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు నిబంధన మినహా మిగతా డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటిం చాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రవి కిరణ్‌స్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యా జ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై జూనియర్ వైద్యులు, పిటిషనర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తమ తరఫున వాదనలు వినిపించగా... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. జూనియర్ వైద్యుల సమ్మె చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ.. 48 గంటల్లోగా విధుల్లో చేరాలని వారిని ఆదేశించింది. విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఒకవేళ తామిచ్చిన గడువులోపు సమ్మె విరమించకపోతే చట్ట ప్రకారం తగిన చర్యలకు ఉపక్రమించవచ్చునని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇక ఏటా డిమాం డ్ల పరిష్కారం కోసం జూడాలు సమ్మె చేస్తున్నారని, వారి న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇకనైనా న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పును స్వాగతిస్తున్నాం.. జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించి, విధుల్లో చేరాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వైద్య విద్యా డెరైక్టర్ పుట్టా శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే ఈ తీర్పులో కోర్టు ప్రభుత్వానికి చేసిన సూచనలపై ఏం చేయనున్నారని విలేకరులు ప్రశ్నించగా... తీర్పు ప్రతి అందిన తర్వాత, ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కోర్టు తీర్పు మేరకైనా జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోసారి చర్చలు జరుపుదాం: జూడాలు ప్రభుత్వం తమను ఆహ్వానించి మరోసారి చర్చలు జరిపితే.. సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో జూడాల సం ఘం ప్రతినిధులు శ్రీనివాస్, స్వప్నిక, భవ్య, రాఘవేంద్ర, అనిల్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. జూడాల ఐదు డిమాండ్లలో నాలుగింటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. మరో డిమాండ్ అయిన ‘ఏడాది రూరల్ సర్వీసు’ అంశంపై హైకోర్టు బుధవారం నాటి తీర్పులో స్పష్టత ఇవ్వకపోవడంతో.. జూనియర్ డాక్టర్లు సందిగ్ధంలో పడ్డారు. -
'విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవు'
హైదరాబాద్: రాష్ట్రంలో నిరవధిక సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్ల (జూడాలు) పై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించింది. రేపటిలోగా విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవని జూడాలకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పి.శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 75 శాతం హాజరు లేకుంటే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉండదని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో పని చేసే జూడాలకు కాలపరిమితిని రెండేళ్లకు పెంచే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న జూడాలు గ్రామీణ ప్రాంతాలలో పని చేసే నిబంధన ఇతర రాష్ట్రాలలో కూడా ఉందని పి.శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
తప్పెవరిది? తిప్పలెవరికి?
2012 జూనియర్ డాక్టర్ల సమ్మె కాలం నాటి ద్వైపాక్షిక ఒప్పందంలోని అంశాలేవీ అమలుకు నోచుకోలేదు. నేటి జూడాల సమ్మె వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉండి నడుపుతున్నాయంటున్న నేటి ఉప ముఖ్యమంత్రి రాజయ్య నాడు జూడాల ఉద్యమానికి వెనుక నిలిచిన శక్తే! విపక్షంలో ఉన్నపుడు ఒక మాట, అధికారంలోకి రాగానే మరోమాట అనే ఈ వైఖరే సమస్యను జటిలం చేస్తోంది. ప్రభుత్వం గత ఒప్పందాన్ని అమలు చేయకపోతే ‘న్యాయధిక్కారం కింద కోర్టును ఎందుకు సంప్రదించలేదు?’ అనే హైకోర్టు ప్రశ్నకు జూడాల వద్ద సమాధానం లేదు. తీర్పును కోర్టు రిజర్వు చేయడంతో బంతి ఇప్పుడు ప్రభుత్వం కోర్టులోకొచ్చింది. ఇక ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సమకాలీనం అండమాన్ దీవుల్లో అటవీ అధికారిగా పనిచేస్తూ హైదరాబాద్‌లో కూతురిని చూసుకోవడానికి వచ్చిన లక్ష్మణ్‌కి గుండెనొప్పి వచ్చింది. వెంటనే 108 సర్వీసులో గాంధీ ఆస్పత్రికి తరలించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా అక్కడెవరూ చూసేవారు లేక, వైద్యం అందక మరణించాడు. గాంధీలో... ఉస్మానియాలో... వరంగల్ ఎంజీఎంలో... ఇంకా, జిల్లాల్లోని ఇతర ఆస్పత్రుల్లో.... ఎందరెందరో మృత్యువుతో పోరాడుతున్నారు, పరిస్థితి విషమిస్తే మృత్యువు ఒడిలోకి జారుతున్నారు.ఎందుకీ దుస్థితి దాపురించింది. సమ్మె విరమించేది లేదంటున్నారు తెలం గాణ జూనియర్ డాక్టర్లు. అన్నీ మేం చూసుకుంటాం, వెంటనే సమ్మె విరమించి పనుల్లో చేరండంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఇటు జూడాలు, అటు ప్రభుత్వం ఎవరి వైఖరిని వారు కొనసాగిస్తున్నారు. ఈ ప్రతిష్టంభన తొలిగేదెలా? దమన నీతి...ద్వంద్వ వైఖరి ‘ఎప్పుడూ ఏంటి ఈ ‘జూడా’ల సమ్మె! పనీ పాటా లేదా వీళ్లకు?’ అని చాలా మంది విసుక్కుంటుంటారు. కానీ, ఒక్కసారైనా లోతుగా అసలు సమస్య ఏంటి? మూలాలెక్కడున్నాయి? బాధ్యులెవరు? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకరు. ఈ దుస్థితికి రాజ్యాంగం పరిధిలో పనిచేసే అన్ని వ్యవస్థల బాధ్యతా ఉంది. ప్రభుత్వాన్నే తీసుకుంటే, జూనియర్ డాక్టర్లు లేవనెత్తుతున్న అంశాల్ని పరిష్కరించే చిత్తశుద్ధిని ప్రభుత్వం ఎప్పుడూ చూపలేదు. 2012 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నెరవేర్చాల్సిన అంశాలన్నీ అమలుకు నోచుకోకుండా అలాగే ఉన్నాయి. ప్రభుత్వానికి నేతృత్వం వహించే పార్టీలు మారుతున్నా ప్రభుత్వ వైఖరి మారటంలేదు. జూడాల వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉండి నడుపుతున్నాయంటున్న నేటి ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యమంత్రి డాక్టర్ రాజయ్య 2012లో ఇదే జూడాలు ఉద్యమించినపుడు వారికి అండగా వెనుక ఉన్న శక్తే! వారి డిమాండ్లు మారలేదు, కానీ, రాజయ్య స్థానం మారింది. జూడాలపై అత్యవసర సర్వీసుల చట్టం ప్రయోగిస్తామన్న నాటి సీఎంను ‘ఎస్మా’ రెడ్డి అన్న కె.చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ‘ఏమిటి జూడాల బెట్టు?’ అంటున్నారు. విపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి రాగానే మరోమాట మాట్లాడటం రాజకీయ నేతలకు రివాజయింది. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు జరిగినపుడు తెలంగాణ జర్నలిస్టుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ నిప్పులు చెరిగిన పెద్ద మనుషులు... గద్దెనెక్కాక అదే వేదికపై తాము జరిపించిన ‘మెట్రోపొలిస్’ సదస్సుకు జర్నలిస్టుల్ని రానీయలేదు. ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు, దీక్షలు చేయనీయట్లేదంటూ పెద్దఎత్తున సాగించిన ఆందోళనలతో 2009, డిసెంబర్ 9న పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించే వరకు తీసుకెళ్లిన తెరాస నాయకత్వం.. గద్దెనెక్కాక ఏంచేసింది? ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సమావే శాన్ని అడ్డుకుంది. ప్రజాస్వామ్య, పౌరసంఘాల నేతల్ని నిర్బంధించింది. కోట బయట ఒకగొంతు, కోట లోపల మరోగొంతు అనే ఈ వైఖరే ప్రస్తుత ప్రతిష్టం భనకు కారణం. సమస్య తీవ్రమైన ప్రతిసారీ జూడాలు డిమాండ్లు వెల్లడిస్తారు, నిరసన తెలుపుతారు, చివరకు సమ్మెకే దిగుతారు. ఏ దశలోనూ ప్రభుత్వం సయోధ్యకు యత్నించిన దాఖలాలుండవు. ‘‘సరే, మీరు సమ్మె చేయండి. మేం ప్రజాప్రయోజనవ్యాజ్యం వేయించి విరమింపజేస్తాం’’ అని కొందరు ప్రభుత్వ పెద్దలే తమను రెచ్చగొట్టారని జూడా వర్గాలంటున్నాయి. ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డ సందర్భాల్లో తలెత్తిన సంక్లిష్ట పరిస్థితుల నుంచి సంప్రదింపులు గట్టెక్కిం చాయి. అలాంటి సత్సంప్రదాయాలకు ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో తిలోద కాలిచ్చాయి. ప్రభుత్వం వైపు నుంచి ఉన్నతాధికారులో, మంత్రులో తక్షణం జూడాలతో సంప్రదింపులు జరిపి ప్రజల ఇబ్బందుల్ని తొలగించాలి. రుచిమరిగిన వ్యవహారం సమస్య ఉంటే మా దృష్టికి తెండి, మేం పరిష్కరిస్తాం, ముందు సమ్మె విరమిం చండని హైకోర్టు పేర్కొన్న తర్వాత కూడా సమ్మె విరమించకపోవడం జూడాల మొండితనాన్ని వెల్లడిస్తోంది. రాజ్యాంగం, చట్టం, కడకు సమధర్మ ప్రాతిపదికన చూసినా, ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే హక్కే లేదని సుప్రీం ధర్మాసనం (జస్టిస్ ఎం.బి.షా, జస్టిస్ ఎ.ఆర్ లక్ష్మణన్) ఒక కేసులో లోగడే స్పష్టం చేసింది. సమ్మె ప్రాథమిక హక్కు కాదు, అనివార్యమైన పరిస్థితుల్లో నిరసనను ప్రకటించే ఒక మార్గం మాత్రమేనని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వెల్లడించింది. ఉమ్మ డి బేరసారాల ద్వారా లబ్ధిపొందే ఉద్దేశంతో సమ్మె చేసినా, రాజ్యాంగ అధికర ణం 19(1)లోని భావప్రకటనా స్వేచ్ఛను ఉదారంగా అన్వయించినా ఇది ప్రాథ మిక హక్కు కాజాలదనీ స్పష్టం చేసింది. అంతమాత్రాన సమ్మెను, సమ్మె చేస్తా మనే హెచ్చరికను చట్టవ్యతిరేక ఒత్తిడిగా పరిగణించలేమని కూడా సుప్రీం చెప్పింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో సమ్మెకు తగిన నిర్వచనముందని, ‘‘సమ్మె చట్టబద్ధమైనా, కాకపోయినా... తమ సమస్యల పరిష్కారానికి అన్ని మార్గాలూ అన్వేషించి, కడకు సమ్మె చేస్తే అది చట్టబద్ధం కాకపోయినా న్యాయ సమ్మతమే’’ అని జస్టిస్ కృష్ణ అయ్యర్ అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలూ సమ్మె చేసే హక్కును గుర్తించాయని సుప్రీంకోర్టు లోగడ (1989 ఎస్సీ కేసెస్ 710) పేర్కొంది. విధిలేని పరిస్థితుల్లోనే తాము సమ్మెకు దిగామంటున్న జూడా ల వాదనను హైకోర్టు అంగీకరించడంలేదు. సమ్మె విరమించాలని కోర్టు చెప్పాక కూడా వారి వైఖరిలో మార్పులేకపోవడంతో ‘సమ్మె చేస్తున్నారా? రాజకీ యం చేస్తున్నారా?’ అనీ అది ప్రశ్నించింది. ఒక దశలో ‘ప్రభుత్వ బెదిరింపులకు లొం గేది లేదు, సమ్మె విరమించేది లేదు, ఏమున్నా ఇక ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుం టాం’ అన్న జూడాల ప్రకటన ఫక్తు రాజ కీయ వాసనతో కూడుకున్నదే! బాధ్యత ప్రభుత్వానిదే... జూనియర్ డాక్టర్లు చేస్తున్న వాదనలో కొంత పస ఉంది. 2012 జూడాల సమ్మెలో చివరకు ప్రభుత్వం దిగివచ్చి చర్చలు సాగించాక అంగీకారం కుదిరిం ది. హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం కోర్టుకు విన్నవించడంతో జూడాలు సమ్మె విరమించారు. ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు మెరుగుపరచాలని, స్టయిపెండ్ పెంచాలని, ప్రైవేటు వ్యక్తుల దాడుల నుంచి రక్షణకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని, లైబ్రరీలను అప్‌గ్రేడ్ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో నివాస వసతి కల్పించాలని, తమను సర్వీసులోకి తీసుకొని గ్రామీణ సేవలకు నియోగించడంగానీ, సదరు సేవలకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వటం గానీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క గ్రామీణ సేవల అంశం మిన హా వీటికి సూత్రప్రాయంగా ప్రభుత్వం అంగీకరించింది. అవేవీ ఇప్పటి వరకూ అమలు పరచలేదని జూడాలంటారు. ‘అలాంటప్పుడు, న్యాయధిక్కారం కింద కోర్టును ఎందుకు సంప్రదించలేదు? ఎవరు అడ్డుకున్నారు?’ అని హైకోర్టు ప్రశ్న. జూడాల వద్ద సమాధానం లేదు. ఇతర మార్గాలకన్నా సమ్మె చేయడమే వారికి అలవాటయిందనే విమర్శ కూడా ఉంది. తమిళనాడు ప్రభుత్వం సమ్మె చేస్తున్న ఉద్యోగుల్ని పెద్ద సంఖ్యలో తొలగించిన కేసులో ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదని సుప్రీం ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పు సరైన న్యాయ స్ఫూర్తిని ప్రతిఫలించలేదంటూ జస్టిస్ కృష్ణ అయ్యర్ ఒక వ్యాఖ్య చేశారు. ‘ఇటు వంటి తీర్పును కూడా ప్రజల్లో ఒక వర్గం ఆహ్వానిస్తోందంటే, చీటికీమాటికీ సమ్మె చేస్తూ ఆ హక్కును దుర్వినియోగపరుస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం’ అన్నారాయన. ఇతర డిమాండ్లతోపాటు అయిదింట మూడు ప్రధాన డిమాం డ్లను అంగీకరించామని, ఉత్తర్వులు కూడా ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోం ది. గత అనుభవాల దృష్ట్యా జూడాలు నమ్మట్లేదు. కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారి అనుమానం. కాబట్టి కార్యని ర్వాహక వ్యవస్థ కూడా సమస్యను జటిలం చేస్తున్నట్టు స్పష్టమౌతోంది. వైద్యశా ఖకు చెందిన ఒక ఉన్నతాధికారి తాజా పరిస్థితిపై విచిత్రమైన వ్యాఖ్య చేశారు. ‘జూడాల ఆందోళన వెనుక ఎవరున్నారో మాకు తెలుసు, తెలంగాణలోని తెరాస ప్రభుత్వాన్ని రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసే క్రమంలో ఇదొక పార్శ్వం’ అన్న అధికారి స్వరం ఫక్తు రాజకీయ వైఖరినే ధ్వనిస్తోంది. తప్పు ఎవరు చేస్తు న్నా, శిక్ష మాత్రం సామాన్యులు అనుభవిస్తున్నారు. వైద్యం అందక అలమటిస్తు న్నారు. తీర్పును కోర్టు రిజర్వు చేయడంతో బంతి ఇప్పుడు ప్రభుత్వ కోర్టులో కొచ్చింది. ఇక అమాయక ప్రజలను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు -
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
-
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద గురువారం తెల్లవారుజామున ఉద్రిక్తత నెలకొంది. జూడాలు దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు. దీంతో పోలీసుల ప్రయత్నాన్ని జూడాలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జూడాలు, పోలీసుల మధ్య తీవ్ర తొపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ 50 మంది జూడాలను పోలీసులు అదుపులోకి తీసుకుని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జూడాలు గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలని తెలంగాణ ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. -
'జూడాలు మానవత్వంతో వ్యవహరించాలి'
వరంగల్ : మానవత్వంతో వ్యవహరించాలని సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య శనివారం వరంగల్‌లో హితవు పలికారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని ఆయన జూడాలకు విజ్ఞప్తి చేశారు. రూరల్ సర్వీసు మినహా జూడాల అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని రాజయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. జూనియర్ డాక్టర్లు విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని కేసీఆర్ సర్కార్ జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అంతేకాకుండా అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తున్నామంటూ జూడాలు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సమ్మె ఉధృతం
అత్యవసర సేవలను బహిష్కరించిన జూడాలు స్తంభించిన వైద్యసేవలు వెనుదిరుగుతున్న రోగులు సాక్షి, సిటీబ్యూరో: జూనియర్ డాక్టర్ల సమ్మెతో నగరంలో అత్యవసర వైద్యసేవలు స్తంభించిపోయాయి. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకున్న క్షతగాత్రులు, హృద్రోగులు, గర్భిణులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. అత్యసర విభాగాల్లో నిపుణులు లేకపోవడంతో వచ్చిన రోగులకు ఇతర ఆస్పత్రులకు తిప్పిపంపుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్.లక్ష్మణ్ (48) ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత చాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు చికిత్స కోసం 108లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. తీరా అక్కడికి చేరుకున్న తర్వాత వైద్యం అందక ఆయన మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే రోగి మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. 107 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 15రోజులుగా సాధారణ విధులను బహిష్కరించిన జూడాలు తాజాగా అత్యవసర సేవలనూ నిలిపివేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి చికిత్స కోసం గురువారం ఉదయం ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకున్న రోగులకు కనీస వైద్యసేవలు అందక పోవడంతో వారు నిరాశతో వెనుతిరుగాల్సి వస్తోంది . ఓపీ సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతో రోగులు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినట్లు ప్రభుత్వం చెప్పుతున్నప్పటికీ ఆచరణలో అవి కన్పించడం లేదు. అత్యవసర విభాగాల్లో యునానీ, ఆయుర్వేద వైద్యులతో పాటు 108 సిబ్బందే రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు ఉస్మానియా వైద్య కళాశాలలో... జూడాల సమస్యలు పరిష్కారించపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఉస్మానియా వైద్యకళాశాల ఆవరణలో 18వ రోజు జూడాలు తమ ఆందోళన కొనసాగించారు. రక్తంతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలనే 107 జీవో ప్రతులను వారు హోమగుండంలో వేసి దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి పెద్ద పెట్టున ప్రభుత్వానికి, డిఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
జూనియర్ డాక్టర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ : సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని న్యాయస్థానం వైద్య విద్యార్థులను ఆదేశించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ జూనియర్ డాక్టర్లకు శుక్రవారం హైకోర్టు సూచించింది. డిమాండ్ల పరిష్కారంపై సర్కారు మొండి వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు గత నెల 29 నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద చేరినా 9లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని... ఆ వసూళ్లను తక్షణమే నిలిపివేసి జీఓ నెంబరు 93ను రద్దు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని... ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వాస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలనేది వీరి మరో డిమాండ్. వీటిని పరిష్కరించాలని కోరుతూ గతనెల 16న వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి, వైద్య విద్య మంత్రికి లేఖ ఇచ్చారు. అయితే వారు స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
జూనియర్ డాక్టర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ : సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని న్యాయస్థానం వైద్య విద్యార్థులను ఆదేశించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ జూనియర్ డాక్టర్లకు శుక్రవారం హైకోర్టు సూచించింది. డిమాండ్ల పరిష్కారంపై సర్కారు మొండి వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు గత నెల 29 నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద చేరినా 9లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని... ఆ వసూళ్లను తక్షణమే నిలిపివేసి జీఓ నెంబరు 93ను రద్దు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని... ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వాస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలనేది వీరి మరో డిమాండ్. వీటిని పరిష్కరించాలని కోరుతూ గతనెల 16న వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి, వైద్య విద్య మంత్రికి లేఖ ఇచ్చారు. అయితే వారు స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.