సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున ఆయన శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
సాక్షి, తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున ఆయన శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నైవేద్య విరామ సమయం అనంతరం ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత అర్చన సేవలో పాల్గొన్నారు. సేవ ముగిసిన తర్వాత గర్భాలయ మూల మూర్తిని, వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు.