
శ్రీవారి సేవలో జస్టిస్ రమణ
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ ఆదివారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, న్యూస్‌లైన్ : ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ ఆదివారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు తిరుమల చేరుకున్న వీరు సాయంత్రం ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని, వకుళామాతను దర్శించుకున్నారు. తర్వాత హుండీలో కానుకలు సమర్పించారు.
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తుల దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగటంతో రూ.300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం మూడు గంటలకు నిలిపివేశారు. కాలిబాట భక్తులకు ఐదు గంటల సమయం కేటాయించారు. కల్యాణకట్టల్లో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు రెండు గంటల సమయం పట్టింది. శ్రీవారి హుండీ ఆదాయం ఆదివారం లెక్కించగా రూ.2.10 కోట్లు లభించింది.