
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతుల కుమార్తె తనూజ, త్రిలోక్ వివాహం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కుమార్తె, అల్లుడు సహా జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుమలేశుడిని దర్శించుకున్నారు.
జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో కొత్త దంపతులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేయగా, జేఈవో పట్టువస్త్రాలతో సత్కరించారు.





