కడప, కర్నూలుకు రైట్...రైట్
విశాఖపట్నం: కడప, కర్నూలుకు ఆర్టీసీ రెండు కొత్త బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ గురువారం జెండా ఊపి ఈ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటివరకు విశాఖ నుంచి నేరుగా కడప, కర్నూలుకు బస్సు సర్వీసులు లేకపోవడంతో వీటిని ప్రవేశపెట్టామన్నారు.
రోజూ విశాఖ నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి రాజమండ్రి, నందికొట్కూరు మీదుగా మర్నాడు ఉదయం 7.45 గంటలకు కర్నూలు చేరుకుంటుందన్నారు. అదే రోజు సాయంత్రం తిరిగి 4 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం7.30 గంటలకు విశాఖ చేరుతుందన్నారు.
రోజూ విశాఖలో 3.30 గంటలకు బయల్దేరి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, కంబం, పోరుమామిళ్ళ మీదుగా మర్నాడు ఉద యం 7గంటలకు కడప చేరుకుంటుందని, తిరిగి అదేరోజు సాయంత్రం 4.30కు బయల్దేరి మర్నాడు ఉదయం 7.30 గంటలకు విశాఖ చేరుతుందని వివరించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వై.జగదీష్‌బాబు, డెప్యూటీ సీటీఎం (అర్బన్) ఎ.వీరయ్యచౌదరి, డెప్యూటీ సీటీఎం (రూరల్) పి.జీవన్‌ప్రసాద్ పాల్గొన్నారు.