కందికుంటపై ఘన విజయం
కదిరి, న్యూస్‌లైన్ : కదిరి నియోజకవర్గంలో ఫ్యాను గాలికి సైకిల్ కొట్టుకుపోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సైకిల్‌కు ఓటమి లేదు. మొట్టమొదటి సారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్తార్ చాంద్‌బాషా తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి అయిన కందికుంట వెంకట ప్రసాద్‌పై 968 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కదిరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఎస్‌కే యూనివర్సిటీలో జరిగింది. మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక రౌండ్‌లో టీడీపీకి, మరో రౌండ్‌లో వైఎస్సార్‌సీపీకి ఇలా మెజార్టీ తారుమారవుతూ వచ్చింది. 8వ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థికి 2828 ఓట్లు రాగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 5 వేల ఓట్లు దక్కడంతో ఒక్కసారిగా ఆ రౌండులో 2171 ఓట్ల ఆధిక్యత వచ్చింది. అప్పటి నుంచి కొన్ని రౌండ్లలో టీడీపీ అభ్యర్థికి స్వల్ప మెజార్టీ లభిస్తూ వచ్చినప్పటికీ చాంద్ బాషా గెలుపును మాత్రం అడ్డుకోలేకపోయారు. చాంద్‌బాషాకు మొత్తం 81,639 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి కందికుంటకు 80,671 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరాం నాయక్ 1268 ఓట్లతో మూడో స్థానంతో తృప్తి పడాల్సి వచ్చింది.
చాంద్‌బాషా విజయం వెనుక...
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కదిరికి వచ్చినప్పుడు బహిరంగ సభలో ‘కదిరిలో నన్ను ఓడించే మగాడు ఇంకా పుట్టలేదు’ అన్న టీడీపీ అభ్యర్థి కందికుంట మాటలు జనంలో మరింత కసి పెంచాయి. ఆయనను ఓడించాలని ఆనాడే కంకణం కట్టుకున్నారు. కందికుంట రెండోసారి గెలిస్తే ఆయన అనుచరులు పట్టణంలో వసూళ్ల పర్వం మొదలెడతారన్న భయం కూడా జనంలో ఉండేది. అదికూడా ఆయన ఓటమికి ఒక కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీని ముస్లింలు తిరస్కరించారు. దీనికితోడు 20 ఏళ్ల తర్వాత ముస్లిం మైనార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వైఎస్సార్‌సీపీ ద్వారా రావడంతో చాంద్‌బాషా గెలుపునకు దోహదపడింది.
చాంద్‌బాషాకు పట్టాభిషేకం
Published Sat, May 17 2014 1:53 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement