వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం విమర్శ
సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం ఆరోపించింది. సోమవారం రాజధాని రైతులు, పేదల సమస్యలపై సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు ఇచ్చిన వినతిపత్రంలో అనేక అంశాలను ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. సీఆర్‌డీఏ చట్టం పేదవాడి పొట్ట గొట్టేందుకే అన్నట్లు ఉందని, భూసమీకరణ పేరుతో రైతుల్ని దగా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి ప్రైవేటు భూములు తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా ప్రభుత్వం తుళ్లూరు ప్రాంత రైతులను వేధిస్తోందని, రాజధాని ప్రాంతంలో ఎమర్జీన్సీ తరహా పాలన చేస్తున్నారని ఆరోపించారు.
బాధ్యతగల ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి అక్కడి రైతులకు అండగా నిలబడిందని తెలిపారు. మూడు, నాలుగు పంటలు పండే ప్రాంతంలో రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేదని డిమాండ్ చేసింది. రైతులు, కూలీలు, భూమి లేని నిరుపేదలు, సాంప్రదాయ వృత్తులవారు, పల్లెల్లో నివసించే ప్రతి ఒక్కరి హక్కులు కాపాడేందుకు తాము పోరాడతామని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం సీఆర్‌డీఏ కార్యాలయానికి వస్తుందనే సమాచారంతో కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం వినతిపత్రం ఇవ్వడానికే వచ్చినా పోలీసులు అత్యుత్సాహంతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు.
పేదల కడుపుకొట్టేందుకే సీఆర్‌డీఏ చట్టం
Published Tue, Feb 24 2015 1:56 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement