మంత్రిగారిపై పార్టీ ఎమ్మెల్యే ఫైర్ | kala venkata rao takes on k acham naidu | Sakshi
Sakshi News home page

మంత్రిగారిపై పార్టీ ఎమ్మెల్యే ఫైర్

Published Fri, Jan 9 2015 9:04 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

మంత్రిగారిపై పార్టీ ఎమ్మెల్యే ఫైర్ - Sakshi

మంత్రిగారిపై పార్టీ ఎమ్మెల్యే ఫైర్

శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య ఏర్పడిన వైరం తారస్థాయికి చేరింది.

శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య ఏర్పడిన వైరం తారస్థాయికి చేరింది.  దాంతో ఆ పంచాయతీ కాస్తా పార్టీ అధ్యక్షుడి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. జిల్లాకు చెందిన మంత్రి కె.అచ్చెన్నాయుడు వైఖరీపై అదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు పార్టీ అధ్యక్షడుకి ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తనను ఆహ్వానించకుండా మంత్రి పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాను మాట్లాడతానని కళా వెంకటరావుకు బాబు హమీ ఇచ్చారని సమాచారం.

గత ఏడాది ఆసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళంలో జిల్లా నుంచి సీనియర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా... పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏరికోరి మరీ తన కేబినెట్లో కె. అచ్చెన్నాయుడికి చోటు కల్పించారు. జిల్లాకు చెందిన సీనియర్లను పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి మంత్రి పదవి ఇవ్వడంపై సదరు నేతలంతా ఆగ్రహంతో ఉన్నారు. అప్పుడే బాబు వద్ద వీరంతా తమ ఆవేదనను వెళ్లకక్కారు. దాంతో వారందరిని బాబు సముదాయించారు. 

అచ్చెన్నాయుడి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తాను హామీ ఇస్తానని పచ్చ తమ్ముళ్లు బాబు హమీ ఇచ్చారు. దాంతో వీరంతా మిన్నకుండి పోయారు. అయితే జిల్లాలో పార్టీకి చెందిన ఏ కార్యక్రమమైనా బాబాయి, అబ్బాయి కనుసన్నల్లో జరుగుతుండంతో పచ్చ తమ్ముళ్లు లోలోపల ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement