నోరు మూసుకుని కూర్చోవాలా? | kanna babu slams to impose police restrictions in east godavari | Sakshi
Sakshi News home page

నోరు మూసుకుని కూర్చోవాలా?

Published Wed, Jan 25 2017 1:34 PM | Last Updated on Tue, Aug 21 2018 8:00 PM

నోరు మూసుకుని కూర్చోవాలా? - Sakshi

నోరు మూసుకుని కూర్చోవాలా?

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలు విధించడాన్ని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. కన్నబాబు తప్పుబట్టారు. జిల్లాలో ఎక్కడికక్కడ నియంత్రణలు విధించడం సరికాదని అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీలు నెరవేర్చమని అడిగితే పోలీసులతో నిర్బంధం విధిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో ముఖ్యమంత్రి ఏం చెప్పాలనుకుంటున్నారని నిలదీశారు.

పాలకులు ఏం చేసినా అందరూ నోరు మూసుకుని కూర్చోవాలా అని గట్టిగా అడిగారు. శాంతి భద్రతల పేరిట ప్రతి ఒక్కరిని అనుమానించడం దారుణమని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, దాన్ని కాలరాయాలనుకోవడం మంచిది కాదని హితవు పలికారు. కాపు సత్యాగ్రహ యాత్ర, ప్రత్యేక హోదా పోరు నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement