k kanna babu
-
తుఫానుగా బలపడనున్న వాయుగుండం
సాక్షి, విజయవాడ: నైరుతి, దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం 24 గంటల్లో తుఫాన్‌గా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. దాని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయిని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45-65 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. రైతాంగం వ్యవసాయ పనుల యందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కె. కన్నబాబు తెలిపారు. చదవండి: పచ్చి అబద్ధాలే ‘పచ్చ’ రాతలు! -
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు!
సాక్షి, విజయవాడ: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఆ తదుపరి 24గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలుల వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కోస్తాకు వాయు గుండం.. శుక్రవారం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, కోస్తా ఆంధ్రాకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం త్వరితగతిన తన దిశను మార్చుకుంటూ వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ దశలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. అయితే కోస్తా ఆంధ్రాలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. -
ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు!
సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు వర్షాలు పడనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నాలుగు రోజులు తీరం ప్రాంతం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాగల నాలుగు రోజుల వాతావరణ వివరాలు: ఆగష్టు 13 వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన. ఆగష్టు 14వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగష్టు 15వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన. ఆగష్టు 16వ తేది: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. -
టీడీపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా?
సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రయోజనాల కోసం రుణ ఉపశమనం పేరుతో తెలుగుదేశం పార్టీ రైతులను నిలువునా మోసం చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.కన్నబాబు విమర్శించారు. ఐదేళ్లు రైతులను మోసం చేసిన టీడీపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే హక్కుఉందా?అని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ చేస్తానని మభ్యపెట్టి వారిని నిలువునా ముంచేయలేదా అని నిలదీశారు. రైతు రుణాలు సుమారు రూ.87 వేల కోట్లకు పైగా ఉంటే.. దానిని రూ.24 వేల కోట్లకు తగ్గించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందేనని అన్నారు. అయితే గడిచిన ఐదేళ్లలో రైతులకు ఇచ్చింది రూ.15,279.42 కోట్లు మాత్రమేనని అన్నారు. మొత్తం రుణమాఫీని ఎందుకు చేయలేకపోయారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్వాకం వల్ల వడ్డీలే కట్టుకోలేక రైతులు నానా అగచాట్లు పడ్డారని అన్నారు. సున్నావడ్డీ పథకానికీ మంగళంపాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4, 5 విడతల కింద చెల్లించాల్సిన డబ్బును చంద్రబాబు ఎగ్గొట్టారని ఆరోపించారు. 4, 5 విడతల కింద చెల్లించాల్సిన సొమ్ము సుమారు రూ.7,958 కోట్లు అయితే... 2018 మార్చిలో అని, తర్వాత జులై అని, అక్టోబరు అని, డిసెంబరు అని... చివరకు ఎన్నికల నోటిషికేషన్ ఒకరోజు ముందు జీవో ఇవ్వడం సిగ్గనిపించలేదా చంద్రబాబుగారూ.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదని, ఇదేనా రైతుల పట్ల చంద్రబాబుకు వున్న చిత్తశుద్ది అని ప్రశ్నించారు. ఆ మభ్యపెట్టే జీఓతోనే ఇప్పుడు మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయిదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రైతు రుణ ఉపశమనాన్ని పూర్తిగా అమలు చేయలేక వైఫల్యం చెందారని ఆరోపించారు. చంద్రబాబు మాదిరిగా కాకుండా రైతులకు ఆర్థిక చేయూతను చిత్తశుద్దితో అందించాలని, రైతులను మభ్యపెట్టే విధానాలకు స్వస్తి పలకాలని ఆనాడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిగారు తన పాదయాత్ర సందర్బంగా అప్పటి పాలకులకు హితవు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద రైతులకు నిజమైన మేలు చేసి చూపుతామంటూ ఆయన ప్రకటించారని అన్నారు. దీనిలో భాగంగా నవరత్నాల్లో రైతు భరోసాకు స్థానం కల్పించారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా రైతులను పదేపదే మోసగించే విధానాలకు స్వస్తి చెప్పేందుకు రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు ప్రారంభించారని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సర్కార్ రెండు విడతల రైతు రుణ ఉపశమనం కోసం జారీ చేసిన జీఓ 38ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. రైతులకు ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు అక్టోబర్ పదిహేనో తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తోందని ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద మొత్తం 64.06 లక్షల మంది రైతులకు మేలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిలో 15.36 లక్షల మంది కౌలు రైతులు వున్నారని తెలిపారు. వీరికి ఏడాదికి 12,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లించబోతోందని తెలిపారు. అలాగే 48.70 లక్షల మంది సొంతభూమి కలిగిన రైతులకు కూడా 12,500 రూపాయలు రైతు భరోసా ద్వారా లబ్ది చేకూరుతుందని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణ ఉపశమనం పేరుతో నాలుగు, అయిదో విడతల్లో దాదాపుగా 7958 కోట్ల రూపాయల మేరకు రైతులకు చెల్లించాల్సి వుందని తెలిపారు. ఈ మొత్తం కన్నా అధికంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రైతు భరోసాను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని అన్నారు. దీనివల్ల రుణమాఫీ కింద చెల్లించాల్సిన మొత్తం కన్నా అదనంగా రైతులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇందుకోసం గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ 38ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి కె.కన్నబాబు వివరణ ఇచ్చారు. అంటే అయిదో విడతలో రుణమాఫీ ద్వారా కేవలం 36.68 లక్షల మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుండగా, రైతు భరోసా కింద దానికి రెట్టింపు సంఖ్యలో.. 64.06 లక్షల మందికి ఆర్థిక ప్రయోజనం అందుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు పంటల బీమా పథకానికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.2163.30 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని అన్నారు. అలాగే రైతులకు వడ్డీలేని రుణాల కింద దాదాపు 3360 కోట్ల రూపాయలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే దురదృష్టవశాత్తు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద అందిస్తోందని తెలిపారు. -
నోరు మూసుకుని కూర్చోవాలా?
-
నోరు మూసుకుని కూర్చోవాలా?
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలు విధించడాన్ని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. కన్నబాబు తప్పుబట్టారు. జిల్లాలో ఎక్కడికక్కడ నియంత్రణలు విధించడం సరికాదని అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీలు నెరవేర్చమని అడిగితే పోలీసులతో నిర్బంధం విధిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో ముఖ్యమంత్రి ఏం చెప్పాలనుకుంటున్నారని నిలదీశారు. పాలకులు ఏం చేసినా అందరూ నోరు మూసుకుని కూర్చోవాలా అని గట్టిగా అడిగారు. శాంతి భద్రతల పేరిట ప్రతి ఒక్కరిని అనుమానించడం దారుణమని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, దాన్ని కాలరాయాలనుకోవడం మంచిది కాదని హితవు పలికారు. కాపు సత్యాగ్రహ యాత్ర, ప్రత్యేక హోదా పోరు నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
రైతులను బెదిరించ వద్దు : కె.కన్నబాబు
కాకినాడ : రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుసాల కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పుణ్యమా అని రైతులకు పరపతి పోయిందన్నారు. ఆదివారం కాకినాడలో కె. కన్నబాబు విలేకర్లతో మాట్లాడుతూ... కోనసీమలో క్రాఫ్ హాలిడే ప్రకటించిన రైతులను బెదిరించ వద్దని ప్రభుత్వానికి సూచించారు. హోంమంత్రి చినరాజప్ప పోలీసులను సదరు ప్రాంతానికి పంపి రైతులను బెదిరిస్తున్నారని విమర్శించారు. పంట విరామం చేయాలని తాము కోరుకోవడం లేదని.. ఆ దుస్థితి రాకూడదన్నారు. రైతుల ఆందోళన చేస్తే తమ పార్టీ మద్దతిస్తుందని కన్నబాబు స్పష్టం చేశారు. -
వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై 8నుంచి ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ రావులపాలెం: రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఆయన మీడియాను నియంత్రిస్తారు, న్యాయ వ్యవస్థను లెక్కచేయరని ఆరోపించారు. జిల్లా అధ్యక్ష పదవి చేపట్టాక శనివారం తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన కన్నబాబుకు రావులపాలెంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన కొత్తపేట నియోజకవర్గ నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నబాబు కు నాయకులను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరి చయం చేశారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ తునిలో మత్స్యకారులపై ఒక సామాజిక వర్గం దాడులు చేసి 72 మందిని గాయపరిచినప్పటికీ, దానిలో మంత్రి సోదరుడి పాత్ర ఉన్నట్టు బాధితులు చెబుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేరన్నారు. ముద్రగడ దీక్ష చేసినా, రైతులుధర్నాలు చేసినా, ఏసమస్య వచ్చినా వెనుక జగన్మోహన్రెడ్డి ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలతో ఎవరు ఇబ్బందులు పడినా వారికి అండగా ఉంటానని జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొనివారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చేందుకు ఈనెల 8వ తేదీ నుంచి గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం ఆయన కొత్తపేట నియోజకవర్గంలో తలెత్తిన ప్రొటోకాల్ వివాదంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా బాధ్యతలు, హక్కులు ఒకే విధంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్సీలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే అన్ని చోట్లా అదే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. శిలాఫలకాలపై టీడీపీ కార్యకర్త అనే పదవి రాసుకునే స్థాయికి వ్యవస్థను ప్రభుత్వం దిగజార్చిందన్నారు. ఎమ్మెల్యేకే సభాధ్యక్షునిగా మొదటి ప్రాధాన్యత ఉంటుందనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, వాటిని మార్చాలనుకుంటే జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలే పార్టీకి బలం: ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రలోభాలకు లొంగి కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీని వెన్నంటి ఉన్నారని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా చూస్తు ఊరుకోబోమని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్ రాజు, ప్రచార కార్యదర్శి మునుసూరి వెంకటేశ్వరరావు, సేవాదళ్ జాయింట్ సెక్రటరీ చల్లా ప్రభాకరరావు, జిల్లా సేవాదళ్ విభాగం కన్వీనర్ మార్గన గంగాధరరావు, ఇండస్ట్రియల్ విభాగం కన్వీనర్ మంతెన రవిరాజు పాల్గొన్నారు.