తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలు విధించడాన్ని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. కన్నబాబు తప్పుబట్టారు. జిల్లాలో ఎక్కడికక్కడ నియంత్రణలు విధించడం సరికాదని అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీలు నెరవేర్చమని అడిగితే పోలీసులతో నిర్బంధం విధిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో ముఖ్యమంత్రి ఏం చెప్పాలనుకుంటున్నారని నిలదీశారు.