కత్తి పద్మారావుకు త్రిపురనేని పురస్కారం | Katti Padma Rao got tripuraneni ramaswamy award | Sakshi
Sakshi News home page

కత్తి పద్మారావుకు త్రిపురనేని పురస్కారం

Published Sat, Sep 10 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

కత్తి పద్మారావుకు త్రిపురనేని పురస్కారం

కత్తి పద్మారావుకు త్రిపురనేని పురస్కారం

గుంటూరు ఈస్ట్: ప్రముఖ సామాజిక తత్వవేత్త డాక్టర్ కత్తి పద్మారావుకు శుక్రవారం గుంటూరులోని ఓ కల్యాణమండపంలో జరిగిన సభలో త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారం ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని త్రిపురనేని రామస్వామిచౌదరి పురస్కార కమిటీ ఆధ్వర్యంలో బహూకరించారు. కత్తి పద్మారావు రచించిన తెలుగు సాహిత్య చరిత్ర పుస్తకావిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ కులమతాలకతీతంగా తెలుగు ప్రజలంతా ఒక్కటే అని నిరూపించే ప్రయత్నమే తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథమన్నారు. తెలుగు భాషోద్యమ అధ్యక్షుడు సామల రమేష్‌బాబు, పురస్కార కమిటీ చైర్మన్ కన్నా మాస్టారు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి, సాహితీ విమర్శకుడు డాక్టర్ పాపినేని శివశంకర్, పలు సామాజిక సంస్థల ప్రతినిధులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement