కేసీఆర్ ఒక నియంత: జైరాం రమేశ్
కేసీఆర్ ఒక నియంత: జైరాం రమేశ్
Published Tue, Apr 22 2014 2:17 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ఖమ్మం: తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఒక నియంత కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్రమంత్రి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.
అబద్ధాలతో కేసీఆర్ రాజకీయం చేస్తారని జైరాం మండిపడ్డారు. కేసీఆర్ తప్పుడు హామీలతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ .. అధికార దాహంతో హామీని తుంగలో తొక్కారన్నారు.
విభజన బిల్లులో ముంపు గ్రామాలు విలీనం చేయాలని మాత్రమే ఉందని జైరాం తెలిపారు. మండలాల విలీనానికి సంబంధించి ఎన్నికల కారణంగా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయలేదని జైరాం ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని జైరాం అన్నారు.
Advertisement