కల్తీ కిక్కు | kick | Sakshi
Sakshi News home page

కల్తీ కిక్కు

Published Thu, Apr 23 2015 3:41 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM

kick

సాక్షి, కర్నూలు: జిల్లాలో కొందరు మద్యం వ్యాపారులు అక్రమార్జనకు తెరతీశారు. కొన్నేళ్లుగా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకే పరిమితమైన ఈ బాగోతం జిల్లాలోనూ ఊపందుకుంది. మద్యం సీసా బిరాడాను తొలగించి అందులోని మద్యాన్ని సగం తీసి నీళ్లు కలుపుతున్నారు. మరికొందరు నాసి రకం మద్యం కలిపి మందుబాబుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో కల్తీమద్యం తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించినప్పటికీ చర్యలకు వెనుకంజ వేస్తోంది. ఇక జిల్లా విషయానికొస్తే ఎమ్మిగనూరు,
 మిగతా 2వ పేజీలో ఠ
 
 కల్తీ కిక్కు
 ఆదోని, నంద్యాల, కర్నూలు, డోన్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా దందా జోరందుకుంది. జిల్లాలోని రెండు ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో 194 మద్యం దుకాణాలు, 36 బార్లు ఉన్నాయి. 2001 సంవత్సరంలో జిల్లాలో మద్యం అమ్మకాలు రూ.75 కోట్లు కాగా.. 2015కు వచ్చే సరికి అమ్మకాలు రూ.840 కోట్లకు చేరుకున్నాయి. ప్రతినెలా జిల్లాలో రూ.70 కోట్ల నుంచి రూ. 75 కోట్ల మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు వక్రమార్గం ఎంచుకున్నారు. సీసాల మూతలను నిపుణులతో చాకచక్యంగా తీయించి కల్తీ చేస్తున్నారు. ఫలితంగా ఒక సీసాకు రెండు సీసాల ధర లభిస్తోంది. ఇలా కల్తీ మద్యం అమ్మకాతో జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.
 
 ఏం చేస్తున్నారు?
 సీసాల సీల్ తొలగింపు.. కల్తీ మద్యం తయారీ చీకటి వేళ జరిగిపోతోంది. ఇందుకోసం ప్రత్యేక నిపుణులను నియమించుకుంటున్నారు. అయితే ఈవేవీ ఎక్సైజ్ శాఖ దృష్టికి రాకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 14 ఎక్సైజ్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. కల్తీ మద్యం తయారీ వ్యవహారం వెలుగుచూస్తే.. సాంకేతికంగా పరిశీలించాల్సి ఉంది. అయితే అలాంటివేవీ అధికారులు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
 
 మద్యం అమ్మకాలు పెంచాలని ఆదేశాలు ఉండడం, ఇతరత్రా బహిరంగ విషయాలు ఉండడంతో సదరు అధికారులు కొందరు సందర్భోచితంగా స్పందించడం లేదని తెలుస్తోంది. కేసుల నమోదు కూడా నామమాత్రంగా ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. జిల్లాలో ఎమ్మిగనూరు, డోన్, నంద్యాల ప్రాంతాలు కల్తీకి కేంద్రంగా మారినట్లు సమాచారం. అమ్మకాలను పెంచుకోవాలని చూస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ  కల్తీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతున్నా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది.
 
 రోజుకు రూ.500 కూలి
 సీసాల సీల్ ఎవరికీ అనుమానం రాకుండా తొలగించి.. కల్తీ మద్యం తయారు చేయడానికి ఎమ్మిగనూరుకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ నుంచి నిపుణులను ప్రత్యేకంగా రప్పించినట్లు సమాచారం. ఇందుకోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి మద్యం దుకాణాల నుంచి కేసులు అందజేసి.. వాటితో తాగి పడేసిన ఖాళీ సీసాల ద్వారా కల్తీ మద్యం తయారీ చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు డోన్, నంద్యాల పరిసరాల్లోనూ సాగుతోంది. విషయం ఉన్నతాధికారులకు తెలిసినా.. చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement