కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి, నివేదికలు తక్షణమే పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తుపాన్ల నష్టంపై శని వారం రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో కలిసి ఆయన అన్ని జి ల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీ ఎం మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల రైతు లు, గృహ యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
వారిని ప్రభు త్వ పరంగా ఆదుకునేందుకుతప్పుల్లేని నివేదికలు సిద్ధం చేసి, ఈ నెల 7వ తేదీలో గా పంపించాలని ఆదేశించారు. ఈ నివేదికలను కలెక్టర్లు ఒకటికి రెండుసార్లు తని ఖీ చేశాకే, పంపించాలని సూచించారు. ముఖ్యంగా పంట నష్ట పరిహారానికి సం బంధించి నిజమైన రైతులకే పరిహారాన్ని అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నష్టపోయిన రైతులకు సంబంధించిన జాబితాను ముందుగానే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయ నో టీస్ బోర్డుపై ఉంచి, అభ్యంతరాల అనంతరమే పరిహారాన్ని పంపిణీ చేయాలన్నా రు.
అనర్హులకు పరిహారం ఇస్తే అందుకు సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిం చారు. తుపాన్ల కారణంగా అధికారులం తా ప్రజలకు అందుబాటులో ఉండి, అం దించిన సేవలు ప్రశంసనీయమని సీఎం అభినందించారు. ఇదే తరహాలో ఎలాం టి విపత్తులు వచ్చినా ఎదుర్కొనేం దుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
రెండు రోజుల్లో నివేదిక పంపిస్తాం
గత నెలలో జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఎక్కువగా పంటలకే నష్టం వాటిల్లిందని, ఇందుకు సంబంధించి నష్ట లెక్కింపు పూర్తయిందని, రెండో రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని కలెక్టర్ గిరిజాశంకర్ సీఎంకు తెలిపారు. వర్షాల్లో పశువులు కోల్పోయిన రైతులకు సంబంధించి నిబంధనలను సడలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇతర నిర్మాణాలకు సంబంధించి జిల్లాకు రూ. 250 కోట్లు అవసరం ఉందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... ఆదివారం లోగాప్రభుత్వానికి పూర్తి నివేదికను పంపించాల ని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో రాంకిషన్, ఇన్‌చార్జి జెడ్పీ సీఈఓ రవీం దర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృపాకర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ రఫీక్ అహ్మద్, ఉద్యానవన సహాయ సంచాలకులు సోమిరెడ్డి, సువర్ణ పాల్గొన్నారు.
నష్ట నివేదికలు తక్షణమే పంపించండి
Published Sun, Dec 1 2013 4:30 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement