laxminarayana
-
తెలుగు స్త్రీలకు వెలుగునిచ్చిన విద్యాలయం
20వ శతాబ్దం ప్రారంభం నాటికి అవిద్య, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం వంటి అనేక సమస్యలతో భారత స్త్రీలు కొట్టుమిట్టాడుతుండేవారు. ఇంటి నాలుగు గోడల మధ్య బందీలై, బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి వారిది. దీనికి తోడు ఆనాటికి ప్రబలి ఉన్న మూఢ విశ్వాసాలు వారికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేవి. ఈ స్థితిలో స్త్రీలను ఉద్ధరించడానికి కందుకూరి వీరేశలింగం వంటివారు నడుం బిగించారు. ఆ కోవకు చెందినవారే ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ దంపతులు కూడా. వారు స్త్రీవిద్య కోసం గుంటూరులో ‘శారదా నికేతనం’ స్థాపించారు. దానికి నూరు వసంతాలు నిండాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఉన్నవ దంపతులు గుంటూరు కేంద్రంగా జాతీయోద్యమం, స్త్రీ జనోద్ధరణ, సంస్కరణోద్యమాలకు తమ జీవితాలను అంకితం చేసి చరితార్థులయ్యారు. స్త్రీలకై ఒక విద్యాలయం నడపాలని భావించిన వారి ఆశయ ఫలితంగా... గుంటూరు గాంధీపేటలో సనాతన ధర్మమండలి హాలులో 1922 నవంబరు 22న, దేశో ద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రారంభకులుగా ‘శారదా నికేతనము’ స్థాపితమైంది. స్త్రీలలో జాతీయ భావాన్ని రేకెత్తించే పద్ధతులను అనుసరించి విద్య నేర్పటానికి ఏర్పాటైన ‘శారదా నికేతనము’లో సంస్కృతము, తెలుగు, హిందీ, సంగీ తము, చిత్ర లేఖనము, నూలు వడకుట, నేత, కుట్టు పని మొద లగు వృత్తి విద్యలు ప్రవేశపెట్టారు. విద్యార్థినులకు వసతి గృహం కూడా ఏర్పాటు అయింది. 1922లో గుంటూరు అరండల్‌పేటలో ప్రారంభించిన శారదా నికేతనము... తరువాతి సంవత్సరంలో మునగాల జమీందారు నాయని వెంకట రంగారావు, బ్రాడీపేట 2వ లైనులో కొండా వెంక టప్పయ్య నివాసానికి (దేశభక్త భవనము) చేరువలో విరాళంగా ఇచ్చిన రెండు ఎకరాల స్థలం స్థలంలోకి మార్చబడింది. ఇప్పటికీ అదే స్థలంలో ఈ నికేతనం కొనసాగుతోంది. శారదా నికేతనంలో ఆంధ్రదేశం నలుమూలల నుండేకాక, దక్షిణాఫ్రికా, రంగూన్, ఖరగ్‌పూర్, హైదరాబాదు వంటి పలు నగరాల నుండి తెలుగు విద్యార్థినులు ఇక్కడికి వచ్చి గురుకుల వాసం చేస్తూ విద్యాభ్యాసం చేసేవారు. ఈ విద్యాలయం రెండు స్థాయుల్లో కోర్సులను నిర్వహించేది. మొత్తం ఎనిమిదేళ్ల కాల వ్యవధి. మొదటి 5 ఏళ్లూ సాహితీ ప్రకరణమనీ, మిగిలిన 3 ఏళ్లూ విదుషీ ప్రకరణమనీ విభజిం చారు. బాగా చదవటం, రాయటం వచ్చి ప్రైమరీ తరగతి వరకు చదివిన బాలికలను 5 ఏళ్ల సాహితీ ప్రకరణ కోర్సులో చేర్చుకునేవారు. 5 సంవత్సరాలు పూర్తి అయేసరికి బాలికలకు సంస్కృతాంధ్రాలలో కొంత కావ్యజ్ఞానం అలవడి, సంగీత – చిత్రలేఖనాలలో ఒకదానిలో మంచి జ్ఞానం సంపాదించేవారు. అలాగే చేతిపనులలో ఒకటి నేర్చుకుని, భూగోళము, వైద్యము, చరిత్రలో మంచి పరిచయం పొందేవారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులయిన వారు ‘సాహితీ’ బిరుదమును పొందేవారు. తరువాతి 3 ఏళ్లు సంస్కృతాంధ్ర భాషలలో ఒకటీ, ఆంగ్ల, హిందీ భాషలలో ఒకటీ అభిమాన భాషలుగా చదివి పరీక్షలో ఉత్తీర్ణులయినవారు ‘విదుషీ’ పట్టభద్రులు అయ్యేవారు. గవర్న మెంటు వారి పరీక్షలతో గానీ, పర్యవేక్షణతోగానీ సంబంధం లేకుండా విద్యాలయం వారే తరగతులన్నిటికీ వార్షిక పరీక్షలు జరిపి, పట్టాలను ఇచ్చేవారు. బాలికలకు విద్యా బోధనతో పాటూ... అనాథలకు, బాల వితంతువులకు, వితంతువులకు, భర్త వదిలి పెట్టినవారికి ఉచి తంగా భోజన వసతి, వస్త్ర సదు పాయాలు కల్పించి; అభాగ్య స్త్రీల పాలిట ఆశ్రిత కల్పవక్షంగా శారదా నికేతనం పేరు ప్రఖ్యాతులు పొందింది. 1927 ఏప్రిల్ 17వ తేదీన గాంధీమహాత్ముడు ఈ సంస్థని దర్శించి, ఇటువంటి సంస్థ ఆంధ్రదేశంలోనే కాదు, యావద్భారత దేశంలోనే లేదని ప్రశంసించారు. పూరిపాకలలోను, చెట్ల నీడలోను ప్రారంభంలో తరగతులు నిర్వహించినా... కాలక్రమంలో స్త్రీ విద్యాభిమానులయిన వదా న్యుల సహకారంతో సొంత భవనాలను, భూమి తదితర స్థిరాస్తులను సంపాదించుకోగలిగింది. ఆంధ్రదేశంలోని మున్సి పాలిటీలు, తాలూకా బోర్డులు, జిల్లా బోర్డులు తగిన విధంగా ఈ విద్యాలయానికి ఆర్థిక సహకారం అందించేవి. 1937లో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారిచే ఈ సంస్థలోని సంస్కృతాంధ్రశాఖ– ‘ప్రాచ్య భాషాకళాశాల’గా గుర్తింపునొందింది. తరువాత కాలంలో ఇందలి పారిశ్రామిక శాఖను ప్రత్యేక పాఠశాలగా గవర్నమెంటు గుర్తించింది. ఒక స్వతంత్ర సంస్థగా రిజిష్టరైన ‘శ్రీశారదా నికేతన్’ ప్రయివేటు యాజమాన్యంలో ప్రధా నంగా ఉన్నవ దంపతులచే నిర్వహింపబడింది. 1955లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయశాఖ అధీనంలోకి తీసు కునేవరకూ ఈ సంస్థకు ముఖ్యదాత అయిన మునగాల జమిం దారు రాజా నాయని వెంకట రంగారావు బహద్దరు అధ్యక్షులుగా కొనసాగారు. ప్రస్తుతం ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నియ మించిన కార్య నిర్వహణాధికారి ఆధ్వర్యంలో శారదా నికేతనం విద్యాసంస్థల నిర్వహణ సాగుతోంది. దరిశి అన్నపూర్ణమ్మ (గదర్ విప్లవ వీరుడు దరిశి చెంచయ్య భార్య), సంగెం లక్ష్మీబాయమ్మ (నిజామాబాద్ బాన్సువాడ నియోజకవర్గం నుండి గెలుపొంది, విద్యాశాఖ ఉప మంత్రిగా బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేసిన ప్రథమ తెలంగాణ మహిళ), బొందలపాటి శకుంతలాదేవి (త్రిపురనేని గోపీచంద్ భార్య), భారతీదేవి (ఆచార్య ఎన్.జి.రంగా భార్య) వంటి పేరెన్నికగన్న స్త్రీ మూర్తులు శ్రీశారదా నికేతనం పూర్వ విద్యార్థినులే. ఇంతటి చరిత్ర గలిగిన శారదానికేతనం 2022 నవంబరు 22 తేదీన వందేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శారదానికేతనంలో– ప్రాథమిక పాఠశాల (బాల బాలికలకు), ఉన్నత పాఠశాల (బాలికలకు), ఓరియంటల్ డిగ్రీ కళాశాల(బాలికలకు) నిర్వహిస్తున్నారు. ఈ మూడింటా సుమారు 500 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. తెలుగు ఆడపడుచులకు విద్యా, విజ్ఞానాలను అందించి వారి కాళ్లపై వారు నిలబడ గలమనే ధైర్యాన్ని నింపిన శారదా నికేతన్... ఒక చారిత్రక పాత్ర పోషించిందనడంలో అతిశయోక్తి లేదు. దాని స్ఫూర్తిని అందు కోవలసిన బాధ్యత మన తరానిదే! ఎమ్.వి.శాస్త్రి వ్యాసకర్త సింగరేణి కాలరీస్ హెచ్ఆర్ మేనేజర్ (రిటైర్డ్) మొబైల్: 94413 42999 -
భరోసా ఇచ్చినా.. తొలగని భయం!
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రెండు రోజులుగా పరిస్థితి మెరుగు పడింది. ఆదివారం జరిగిన అల్లరి మూకల దాడుల తర్వాత వదంతుల వ్యాప్తి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. పోలీసులు భరోసా ఇచ్చినా.. వదంతులతో భయాందోళనకు గురవుతున్నారు. అల్లర్ల ఘటనకు కారకులైన 55 మందిని అరెస్టు చేసినట్లు సీఐ వేణుగోపాల్‌రావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ స్థానికంగా ఆ సందడి కనిపించడంలేదు. మరో రెండు రోజుల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించనున్నామని, ఎన్నికలయ్యే వరకూ భైంసాలో అదనపు బలగాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. 240 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, 150 మంది స్పెషల్ పోలీసులు, ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లు ప్రత్యేక బలగాలతో కలిపి 900 మంది బందోబస్తులో ఉన్నారు. ప్రతిరోజు భైంసాలో కవాతు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, వరంగల్ ఐజీలు నాగిరెడ్డి, ప్రమోద్‌కుమార్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని భరోసా ఇస్తున్నారు. కర్ఫ్యూ, 144 సెక్షన్ ఎత్తివేసినప్పటికీ దుకాణాలు మాత్రం తెరుచుకోవడంలేదు. చాలా మంది తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ఈనెల 22న జరిగే పోలింగ్‌పై ఈ ప్రభావం పడనుందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే గృహ నిర్బంధం సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను పోలీసులు గురువారం రాత్రి నిజామాబాద్‌లో హౌజ్ అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘటనపై సమీక్షించేందుకు వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. -
విశాఖ బరిలో మాజీ జేడీ
సాక్షి, హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు సంబంధించిన మరో జాబితాను జనసేన పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి ఇటీవలే పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్టు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. తొలుత భీమిలి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చినా.. అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విశాఖ లోక్ సభ స్థానం నుంచి లక్ష్మీనారాయణను పోటీ చేయించాలని నిర్ణయించింది. (భీమవరం, గాజువాకలో పవన్ పోటీ) లక్ష్మీనారాయణకు అవకాశం కల్పించిన జనసేన.. ఆయన తోడల్లుడు మాజీ వైస్ చాన్స్‌లర్ రాజగోపాల్‌కు మాత్రం షాక్ ఇచ్చింది. అనంతపురం శాసన సభ నుంచి రాజగోపాల్‌ను పోటి చేస్తారని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఇంటా బయట ఒత్తిళ్లతో వెనక్కి తగ్గిన పవన్ కళ్యాణ్ ఆయనకు అవకాశం కల్పించలేదు. దీంతో రాజగోపాల్ స్థానంలో వరుణ్‌కు అవకాశం కల్పించారు. దీనిపై అలక చెందిన రాజగోపాల్‌కు పార్టీలో ఓ ఉన్నత పదవి ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించారు. ఇక విశాఖ ఎంపీ స్థానంతో పాటు పలు అసెంబ్లీ స్థానాలకు కూడా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. శాసనసభ అభ్యర్థులు విశాఖ పట్నం నార్త్: పసుపులేటి ఉషా కిరణ్ విశాఖ సౌత్: గంపల గిరిధర్ విశాఖ ఈస్ట్: కోన తాతా రావు భీమిలి: పంచకర్ల సందీప్ అమలాపురం: శెట్టిబత్తుల రాజబాబు పెద్దాపురం: తుమ్మల రామ స్వామి పోలవరం: చిర్రి బాల రాజు అనంతపురం: టి.సి. వరుణ్ -
కేంద్రం సహకారంతోనే 24 గంటల విద్యుత్
ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు ధర్మపురి అరవింద్ చేపట్టిన పాదయాత్రను రెండోరోజు మండల కేంద్రంలో లక్ష్మీనారాయణ ప్రారంభించి మాట్లాడారు. రైతులకు, పరిశ్రమలకు, వాణిజ్యా సంస్థల కోసం 765 కేవీ విద్యుత్ లైన్‌ను జార్ఖండ్ నుంచి డిచ్పల్లి వరకు తేవడం జరిగిందని తెలిపారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం కేంద్రం రాయితీలు ఇస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.4కు యూనిట్ కరెంట్ ఒప్పందం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 చొప్పున ఆగ్రిమెంట్ చేసుకున్నారని అన్నారు. ఇప్పటికే 24 గంటల విద్యుత్‌ను 19 రాష్ట్రాలకు ఇస్తున్నాయని చెప్పారు. 10 కోట్ల ఎల్ఈడీ బల్బులను కూడా కేంద్రం రాష్ట్రాలకు సరఫరా చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర పరిధిలో మూసివేసి ఉన్న కర్మాగారాలను తెరిపించడం జరిగిందని తెలిపారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పిన కేసీఆర్ రైతులను దగా చేశారని ఆరోపించారు. మూసివేసిన చక్కెర కర్మాగారాలను తెరిచే వరకు ఉద్యమాలు, పోరాటాలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2.72 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.825 కోట్లు విడుదల చేస్తే కేవలం రూ.770 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి 4442 ఇళ్లు మాత్రమే నిర్మించారని వివరించారు. పాదయాత్రను ప్రారంభించే ముందు చెరుకు రైతులు, ఉత్పత్తిదారు ల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆశీర్వాదాన్ని ధర్మపురి అరవింద్ తీసుకున్నారు. వర్షకొండ గ్రామంలో మహిళలు, రైతులు బీజేపీ నాయకులు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి పాదయాత్ర చేరుకుంది. స్థానిక నాయకులు ఆరవింద్, యెండల లక్ష్మీనారాయణకు వీడ్కొలు పలికారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు బాజోజి భాస్కర్, నాయకులు రాజారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బత్తుల శ్రీనివాస్, చిన్నారెడ్డి, చంద్రాగౌడ్, పెద్దబోయిన రమేశ్ పాల్గొన్నారు. -
నాణ్యతలేని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వెనక్కి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర పోలీసుల కోసం కొనుగోలుచేసిన 4,600 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో 1,430 తిరిగి కంపెనీకి పంపించారు. అందుకు ప్రధాన కారణం ఈ జాకెట్లకు అత్యాధునిక ఏ.కే .–47 రైఫిల్ బుల్లెట్లను తట్టుకునే సామర్థ్యం లేకపోవడంతో వాటిని పోలీసులు తిరిగి కంపెనీకి పంపించినట్లు అదనపు డీజీ వి.వి.లక్ష్మీనారాయణ వెల్లడించారు. 2008 నవంబరు 26వ తేదీన ముంబైలో ఉగ్రవాదులు దాడులుచేసి అనేక మంది అమాయకులను పొట్టన బెట్టుకున్నారు. ఇందులో కొందరు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు కూడా హతమయ్యారు. దీంతో పోలీసుల రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనుగోలు చేయాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిధులు కేటాయించి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొనుగోలుకు మంజూరు చేశారు. దీంతో కాన్పూర్‌లోని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీ కంపెనీకి రూ.17 కోట్లు చెల్లించి 4,600 జాకెట్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ కేంద్ర భద్రత దళానికి జాకెట్లు సరఫరా చేస్తుంది. కస్టం డ్యూటీ, ఇతర పన్నులు చెల్లించి మొత్తం 4,600 జాకెట్లను పోలీసు శాఖకు అందజేశారు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తరువాత మహారాష్ట్ర పోలీసు శాఖకు ఆధునిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందుబాటులోకి రానున్నాయి. కానీ వాటిని పోలీసులకు అందజేసే ముందు చంఢీగడ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. అందులో 3,170 జాకెట్లు ఏకే–47 బుల్లెట్లను అడ్డుకోవడంలో సఫలీకృతమయ్యాయి. మిగతా 1,430 జాకెట్లు ఆ బుల్లెట్లను అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో అందులో నాణ్యత లోపం ఉందని స్పష్టం కావడంతో వాటిని తిరిగి కాన్పూర్‌కు పంపించారు. వాటికి బదులుగా నాణ్యమైన జాకెట్లు అందజేయాలని ఆ కంపెనికి సూచించినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. కాగా కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను గడ్చిరోలి, ఇతర నక్సలైట్ల ప్రాబల్యమున్న ప్రాంతంలో విధులు నిర్వహించే పోలీసులకు, ముంబై పోలీసు శాఖలో క్విక్ రెస్పాన్స్ టీం, ఫోర్స్ వన్ కమాండోలకు అందజేయనున్నారు. -
సీబీఐ మాజీ జేడీ ఇంట్లో చోరీ.. అదుపులో ఫకీరా తండా మహిళ
సాక్షి, మహబూబాబాద్ రూరల్: జూబ్లీహిల్స్‌లోని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో విచారణ కొనసాగించారు. డోర్నకల్ మండలం చిలుకోడు శివారు ఫకీరా తండాకు చెందిన ఆటో డ్రైవర్ బానోతు రమేష్ భార్య సుశీల అలియాస్ సుజాత కొంతకాలం క్రితం భర్తతో గొడవపెట్టుకొని హైదరాబాద్ వెళ్లింది. అక్కడ బంధువుల ఇంట్లో ఉన్న ఆమె.. జూబ్లీహిల్స్‌లోని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో పనికి కుదిరింది. వారం క్రితం ఆమె ఎవరికీ చెప్పకుండా పని మానేసింది. ఆమె కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతోపాటు ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల కోసం గాలింపు చేపట్టారు. ఆమె ఫకీరా తండాలో ఉన్నట్లు గుర్తించిన బంజరాహిల్స్ ఎస్సై నర్సింహారావు మహబూబాబాద్ డీఎస్పీకి సమాచారమిచ్చి ఓ మహిళా కానిస్టేబుల్, ఓ పురుష కానిస్టేబుల్‌తో శనివారం రాత్రి అక్కడికి వెళ్లారు. చిలుకోడు సర్పంచ్ గుగులోతు కిషన్‌సాధు సహకారంతో సుజాతను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా మహబూబాబాద్‌లోని ఓ జ్యూవెలరీ షాపులో రూ.10వేలకు బంగారు నగలను అమ్మినట్లు తెలిపింది. దాంతో వారు ఆమెతో కలిసి అర్ధరాత్రి సమయంలో మహబూబాబాద్ వచ్చారు. ఆమె చెప్పిన షాపు వద్దకు పోలీసులు వెళ్లగానే స్థానికులు గుమికూడి షాపు నిర్వాహకుడు దొంగ బంగారం కొనే వాడు కాదని స్పష్టం చేశారు. దీంతో సుజాత చెప్పిన మేరకు అడిగేందుకు మాత్రమే వచ్చామని పోలీసులు వారికి చెప్పారు. ప్రజలు గుమిగూడడంతో అటుగా వెళ్తున్న మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్ ఆగి విషయం తెలుసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులు సుజాతను హైదరాబాద్ తీసుకెళ్లి విచారిస్తున్నారు. -
‘పది’ ప్రణాళిక పక్కాగా అమలు చేయండి
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి ఫలితాల్లో గతేడాదికంటే ఉత్తీర్ణత శాతం తగ్గితే అందరికీ అవమానం.. పక్కాగా ప్రణాళిక అమలు చేయాలని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పగడాల లక్ష్మీనారాయణ సూచించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) వార్షిక ప్రణాళిక తయారీకి హెచ్ఎంలతో మంగళవారం స్థానిక కొత్తూరు బాలుర ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం పెనుకొండ, గుత్తి డివిజన్లు, మధ్యాహ్నం అనంతపురం, ధర్మవరం డివిజన్ల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఏడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు 40 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈనెల 27 నుంచి మార్చి 16 వరకు ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునే వాతావరణం కల్పించాలన్నారు. సీ,డీ గ్రేడు విద్యార్థులపై ప్రతి ఉపాధ్యాయుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఐదుగురు విద్యార్థులను గ్రూపుగా చేసి అందులో అన్ని గ్రేడుల విద్యార్థులుండేలా చూడాలన్నారు. దత్తత తీసుకున్న విద్యార్థులపై టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 3.30 గంటల వరకు పాఠశాల కాలనిర్ణయ పట్టిక మేరకు తరగతులు యథావిధిగా నిర్వహించాలన్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పాఠశాలస్థాయిలో ప్రశ్నపత్రం తయారుచేసి రోజువారి పరీక్షను 25 మార్కులకు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆర్‌ఎంఎస్‌ఏ ఏడీ శ్రీరాములు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్, డిప్యూటీ డీఈఓలు నాగభూషణం, చాంద్‌బాషా, హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు పాల్గొన్నారు. -
‘రైస్‌మిల్లర్స్’ జిల్లా ఉపాధ్యక్షునిగా లక్ష్మీనారాయణ
ఉప్పలగుప్తం : జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా భీమనపల్లికి చెందిన దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన కార్యవర్గ ఎన్నికలో వీరభద్ర రైస్‌మిల్ అధినేత లక్ష్మీనారాయణను మరోసారి ఈ పదవి వరించింది. లక్ష్మీనారాయణ స్థానిక జెడ్పీటీసీ సభ్యునిగా కూడా ఉన్నారు. -
నాయీబ్రాహ్మణులను ఎస్సీల్లో చేర్చాలి
నాయీ బ్రాహ్మణులను ఎస్సీ జాబితాలో చేరుస్తామంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధరణికోట లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. రెండేళ్లుగా నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ పాలకవర్గాన్ని నియమించడం లేదని చెప్పారు. తక్షణమే పాలకవర్గాన్ని నియమించి రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే దేవస్థానాల్లో క్షౌరవృత్తి చేసే వారిని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు ఎన్.శివశంకరరావు, ప్రధాన కార్యదర్శి ఎ.బాబ్జి, అమర్‌బాబు, పి.వెంకటేశ్వర్లు, యువజన నాయకుడు అట్లూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
గులాబీ జెండా?
గోదావరిఖని, న్యూస్‌లైన్: రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తొమ్మిది మంది స్వతంత్ర సభ్యులు, ఇద్దరు బీజేపీ కార్పొరేటర్ల సహకారంతో టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేయర్ ఎన్నికలో కీలకంగా మారిన మెజారిటీ ఇండిపెండెంట్ సభ్యులను టీఆర్ఎస్ చాకచక్యంతా తనవైపు తిప్పుకుంది. చివరకు వారందరిని టీఆర్ఎస్లో చేర్చుకుని 12వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్‌గా ఎన్నికైన కొంకటి లక్ష్మీనారాయణను మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తు తం 14 మంది టీఆర్ఎస్, ఇద్దరు బీజేపీ, తొమ్మి ది మంది స్వతంత్ర కార్పొరేటర్లతో టీఆర్ఎస్ క్యాంపు యానాంలో కొనసాగుతోంది. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హాజరై క్యాంపులో ఉన్న కార్పొరేటర్లతో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ యన ఫోన్లో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. స్వతంత్ర కార్పొరేటర్లను ముందుగా టీఆర్ఎస్లో చేర్పించి, ఆ తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మద్దతుతో కొంకటి లక్ష్మీనారాయణను మేయర్ గా ఎన్నుకోవాలని నిర్ణయించామని తెలి పా రు. రామగుండం కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లకు టీఆర్ఎస్ 14, బీజేపీ రెండు స్థానాలను గెల్చుకోగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. కాంగ్రె స్ పార్టీ తరఫున 19 మంది విజయం సాధిం చారు. స్వతంత్రంగా గెలిచిన వారిలో నుంచి తొమ్మిది మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ క్యాంపులో చేరిపోయారు. వారందరు 12వ డివిజన్ నుంచి గెలుపొందిన కొంకటి లక్ష్మీనారాయణను మేయర్‌గా చేయాలని ఈ సమావేశంలో పట్టుబట్టారు. ఇందుకు టీఆర్ఎస్తో పాటు బీజేపీ సభ్యులు అంగీకరించారు. శిబి రంలో మొత్తం 25 మంది కార్పొరేటర్లు ఉండ గా, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మె ల్యే ఓట్లతో టీఆర్ఎస్ సంఖ్యాబలం 27కు చేరనుంది. దీంతో రామగుండం మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకోవడం ఖాయమైంది. ఇక డెప్యూటీ మేయర్ పదవిని టీఆర్ఎస్కు వదిలివేయగా... అభ్యర్థి ఎంపికను తమ సభ్యుల నిర్ణయానికే వదిలేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయంలో సాగుతున్న తర్జనభర్జనలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లతో పాటు తొమ్మిదిమంది స్వతంత్ర కార్పొరేటర్ల ఖర్చులను మేయర్ అభ్యర్థి లక్ష్మీనారాయణ భరించుకోవాలని, డెప్యూటీ మేయర్ పదవిని ఆశించేవారు మిగతా 13 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్ల ఖర్చును మోయాలని నిర్ణయించారు. 4న క్యాంపునకు కాంగ్రెస్ కార్పొరేటర్లు : రామగుండం మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీ నుంచి తమ కార్పొరేటర్లతో క్యాంపు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ జి.వివేక్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జూన్ ఒకటవ తేదీన గోదావరిఖనిలో జరిగే సమావేశానికి హాజరై క్యాంపు విషయం నిర్ణయం తీసుకునే అవకాశముంది. 19 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లకు తోడు ఆరుగురు స్వతంత్ర కార్పొరేటర్లు మద్దతు తెలుపుతూ ఇప్పటికే ప్రత్యేక శిబిరానికి తరలివెళ్లారు. వీరి సంఖ్య కూడా 25కు చేరగా, టీఆర్ఎస్ క్యాంపులోంచి ఎవరైనా రాకపోతారా.. అనే ఆశతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. -
ధన్వంతిపై వేటు
ఆరేళ్లపాటు బహిష్కరించిన కాంగ్రెస్ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి దుగ్యాల ఫిర్యాదు పొన్నాల అనుమతితో చర్యలు వరంగల్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసినందుకు డీసీసీ ఉపాధ్యక్షురాలు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతిపై ఆ పార్టీ ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాం గ్రెస్ అభ్యర్థిగా దుగ్యాల శ్రీనివాసరావు పోటీ చేయగా... రెబల్‌గా ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనారాయణ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను ఇదివరకే పార్టీ నుంచి బ హిష్కరించారు. ఈ క్రమంలో ధన్వంతిపై దుగ్యాల తెలంగాణపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు కోదండరెడ్డి, సభ్యులు బండాప్రకాష్, ఫరూఖ్ తదితరులు చర్చించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల అనుమతితో ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. తొలి నుంచి ధన్వంతి, లక్ష్మీనారాయణ దంపతులు పొన్నాలకు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. పొన్నాల సహకారంతోనే జెడ్పీ చైర్పర్సన్ పదవి ధన్వంతిని వరించినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతుం టారుు. ఇటీవల వారి మధ్య కొంత విభేదాలు పొడచూపినట్లు ప్రచారం సాగింది. తాజాగా డాక్టర్ లక్ష్మీనారాయణ మొన్నటి ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన స్వతంత్రుడిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో భర్తకు మద్దతుగా ధన్వంతి ప్రచారం చేశారు. ఎన్నికల ఏజెంట్‌గా పనిచేశారు. లక్ష్మీనారాయణ పోటీ వల్ల తాను ఓటమిపాలయ్యాయని దుగ్యాల రాతపూర్వక ఫిర్యాదు చేయడంతో ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. దుగ్యాలకు లక్ష్మీనారాయణ దెబ్బ పాలకుర్తి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన లక్ష్మీనారాయణకు 3,129 ఓట్లు లభించాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దు గ్యాల శ్రీనివాసరావుకు 53,486 ఓట్లు... విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు 57,799 ఓట్లు లభించాయి. కేవలం 4,313 ఓట్ల మెజార్టీతో ఎర్రబెల్లి గెలుపొందారు. లక్ష్మీనారాయణ స్వతంత్రుడిగా బరిలో లేకుంటే తానే విజయం సాధించే అవకాశాలున్నాయని దుగ్యాల భావించారు. తన ఓటమికి కారణమైన లక్ష్మీనారాయణను బహిష్కరించినప్పటికీ... ఆయనకు సహకరించిన ధన్వంతిపై చర్య తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో నూతనంగా ఏర్పాటైన టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా జిల్లా నుంచి ధన్వంతి పేరును ప్రతిపాదించారు. ఈ లోపే ధన్వంతి భర్త లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు నిర్ణయించుకోవడంతో క్రమశిక్షణ కమిటీలో చోటు కల్పించకుండా వెనుకంజ వేసినట్లు సమాచారం. -
'బీజేపీ, ఆప్ నుంచి ఆహ్వానాలు వచ్చాయి'
హైదరాబాద్: రాజకీయాల్లోకి రావాలని తనకు ఆహ్వానం అందిందని సీబీఐ పూర్వ జేడీ, థానే నగర జాయింట్ పోలీసు కమిషనర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ల నుంచి ఆహ్వానాలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మంచి పరిపాలన దక్షత కలిగిన నాయకులను ఎన్నుకోవడం వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీబీఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డెరైక్టర్‌గా విధులు నిర్వహించి రిలీవ్ అయిన లక్ష్మీనారాయణ మహారాష్ట్రలోని థానే నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. -
మైనార్టీలకు చోటేదీ?!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మైనార్టీలకు టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఝలక్ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై హిందూపురం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి షాక్ ఇచ్చారు. ‘బేరం’ కుదరడంతో అంబికా లక్ష్మినారాయణను సైకిలెక్కించుకున్నారు. హిందూపురం టీడీపీ టికెట్ తనకే దక్కుతుందని అంబికా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరవుతోన్న చంద్రబాబు.. నరేంద్రమోడీ చరిష్మాతోనైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అర్రులు చాస్తుండటంపై మైనార్టీలు మండిపడుతున్నారు. ఇది టీడీపీ శ్రేణులను కలవరపరుస్తోంది. చంద్రబాబు టీడీపీకి సారథ్యం వహిస్తున్నప్పటి నుంచీ మైనార్టీలు ఆ పార్టీకి దూరమవుతూ వస్తున్నారు. ఎన్టీఆర్‌కు 1995 ఆగస్టులో వెన్నుపోటు పొడవడం ద్వారా అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు.. 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో టీడీపీని ఘోర పరాజయం నుంచి కాపాడలేకపోయారు. 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. తన సారథ్యంలో టీడీపీకి విజయం దక్కడం కల్లని భావించిన చంద్రబాబు.. 1999 ఎన్నికల్లో వాజ్‌పేయి మేనియాను అడ్డుపెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావించారు. ఆ క్రమంలోనే తాను మతోన్మాద పార్టీగా అభివర్ణించిన బీజేపీతో 1999 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా వాజ్‌పేయిపై వ్యక్తమైన సానుభూతి వల్ల చంద్రబాబు రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చారు. 2004 ఎన్నికల్లోనూ బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మతోన్మాద బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశామన్నారు. పార్టీకి మైనార్టీలు దూరం కావడం ఓటమికి కారణమైందని, భవిష్యత్‌లో ఆ పార్టీతో జట్టుకట్టేదే లేదని స్పష్టీకరించారు. 2009 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడం కోసం చంద్రబాబు ఆడని నాటకం లేదు. చేయని వాగ్దానమూ లేదు. వామపక్షాలు, టీఆర్ఎస్తో కలిసి మహాకూటమిని ఏర్పాటుచేసినా.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనం ముందు నిలవలేకపోయారు. మహాకూటమి పేకమేడలా కూలిపోయింది. పదేళ్లుగా అధికారానికి దూరమైన చంద్రబాబుకు 2014 ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. దేశవ్యాప్తంగా నరేంద్రమోడీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఇదే తరుణంలో రాష్ట్రంలో టీడీపీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటోందని పలు సర్వేలు వెల్లడిస్తోండటం చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 1999 ఎన్నికల్లో వాజ్‌పేయి మేనియా తరహాలోనే.. 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ హవాను ఉపయోగించుకుని దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బాబు ఎత్తులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే బీజేపీతో పొత్తుపెట్టుకోవడానికి తహతహలాడుతున్నారు. టీడీపీతో పొత్తును బీజేపీ రాష్ట్రనేతలు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాత్రం ప్రయత్నాలను మానడం లేదు. ఒకవైపు బీజేపీతో పొత్తుకు అర్రులు చాస్తూనే.. మరో వైపు కుబేరులను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. 2009 ఎన్నికల్లో హిందూపురం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి, మూడో స్థానంలో నిలిచిన అంబికా లక్ష్మినారాయణ ఆర్థికంగా శక్తిమంతుడు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి విజయం సాధించాలన్న ఎత్తులు వేస్తోన్న చంద్రబాబు.. అంబికాను పార్టీలోకి ఆహ్వానించారు. హిందూపురం టీడీపీ టికెట్ కోసం వారి మధ్య భారీ స్థాయిలో ‘బేర’సారాలు సాగినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘బేరం’ కుదరడంతో ఆదివారం అంబికా సైకిలెక్కారు. చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం మేరకు తనకే టికెట్ దక్కుతుందని ధీమాగా చెబుతున్నారు. అంబికాను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి చంద్రబాబు షాక్ ఇచ్చారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే బలంగా వ్యక్తమవుతోంది. అంబికాకు పార్టీ తీర్థం ఇవ్వడంపై అబ్దుల్ఘనీ సైతం మండిపడుతున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే రెబల్‌గా బరిలోకి దిగుతానని తన సన్నిహితుల వద్ద స్పష్టీకరిస్తున్నారు. -
పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారు
ఉషారాణి విషయమై టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని ‘సాక్షి’ సంప్రదించగా ‘తెలుగుదేశం పార్టీ ప్రజాభిమానం చూరగొంటున్న పార్టీ. అందువల్ల అమా పార్టీలోకి ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు. పార్టీలో ఉన్న వారందర్నీ మేము ప్రోత్సహిస్తాము. త్వరలో హిందూపురానికి చెందిన అంబికా లక్ష్మినారాయణ కూడా పార్టీలోకి వస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరుకు చెందిన ఉషాదేవి పార్టీలోకి వచ్చారు. ఆమె రాయదుర్గంలో పర్యటిస్తున్నారు. ఈ విషయమై మెట్టు గోవిందరెడ్డి, దీపక్‌రెడ్డిలు సీఎం రమేష్‌ను కలిసిన మాట వాస్తవే. అయితే రాయదుర్గంలో ఉషాదేవిని నేను తెరమీదకు తీసుకువచ్చి.. ప్రోత్సహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు సుద్ద అబద్ధం. అందులో నేను డబ్బులు తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్న వారు మూర్ఖులు. నాకు అంత అవసరం లేదు. ఎందుకంటే జిల్లాలో బీకే పార్థసారథి అంటే ఒక మార్కు ఉంది. దాన్ని నేను మీరను. డబ్బులు తీసుకునేవారు వేరే ఉన్నారు. నేను డబ్బులు తీసుకుని ఉషాదేవిని ప్రోత్సహిస్తున్నానని చెబుతున్న వారు నా ఎదురుగా వచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేయమనండి.. ఎవరు ఏం మాట్లాడినా, ఎన్నికల నాటికి కులాలు, వర్గాలు అన్నీ చూసుకునే మా పార్టీ అధినేత టికెట్ కేటాయిస్తార’ని చెప్పారు. -
నష్ట నివేదికలు తక్షణమే పంపించండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి, నివేదికలు తక్షణమే పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తుపాన్ల నష్టంపై శని వారం రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో కలిసి ఆయన అన్ని జి ల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీ ఎం మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల రైతు లు, గృహ యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. వారిని ప్రభు త్వ పరంగా ఆదుకునేందుకుతప్పుల్లేని నివేదికలు సిద్ధం చేసి, ఈ నెల 7వ తేదీలో గా పంపించాలని ఆదేశించారు. ఈ నివేదికలను కలెక్టర్లు ఒకటికి రెండుసార్లు తని ఖీ చేశాకే, పంపించాలని సూచించారు. ముఖ్యంగా పంట నష్ట పరిహారానికి సం బంధించి నిజమైన రైతులకే పరిహారాన్ని అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నష్టపోయిన రైతులకు సంబంధించిన జాబితాను ముందుగానే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయ నో టీస్ బోర్డుపై ఉంచి, అభ్యంతరాల అనంతరమే పరిహారాన్ని పంపిణీ చేయాలన్నా రు. అనర్హులకు పరిహారం ఇస్తే అందుకు సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిం చారు. తుపాన్ల కారణంగా అధికారులం తా ప్రజలకు అందుబాటులో ఉండి, అం దించిన సేవలు ప్రశంసనీయమని సీఎం అభినందించారు. ఇదే తరహాలో ఎలాం టి విపత్తులు వచ్చినా ఎదుర్కొనేం దుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రెండు రోజుల్లో నివేదిక పంపిస్తాం గత నెలలో జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఎక్కువగా పంటలకే నష్టం వాటిల్లిందని, ఇందుకు సంబంధించి నష్ట లెక్కింపు పూర్తయిందని, రెండో రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని కలెక్టర్ గిరిజాశంకర్ సీఎంకు తెలిపారు. వర్షాల్లో పశువులు కోల్పోయిన రైతులకు సంబంధించి నిబంధనలను సడలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇతర నిర్మాణాలకు సంబంధించి జిల్లాకు రూ. 250 కోట్లు అవసరం ఉందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... ఆదివారం లోగాప్రభుత్వానికి పూర్తి నివేదికను పంపించాల ని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో రాంకిషన్, ఇన్చార్జి జెడ్పీ సీఈఓ రవీం దర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృపాకర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ రఫీక్ అహ్మద్, ఉద్యానవన సహాయ సంచాలకులు సోమిరెడ్డి, సువర్ణ పాల్గొన్నారు.