'బీజేపీ, ఆప్ నుంచి ఆహ్వానాలు వచ్చాయి' | bjp, aam aadmi party invited me, says lakshminarayana | Sakshi
Sakshi News home page

'బీజేపీ, ఆప్ నుంచి ఆహ్వానాలు వచ్చాయి'

Published Sun, Mar 23 2014 4:46 PM | Last Updated on Sat, Aug 11 2018 6:59 PM

'బీజేపీ, ఆప్ నుంచి ఆహ్వానాలు వచ్చాయి' - Sakshi

'బీజేపీ, ఆప్ నుంచి ఆహ్వానాలు వచ్చాయి'

హైదరాబాద్: రాజకీయాల్లోకి రావాలని తనకు ఆహ్వానం అందిందని సీబీఐ పూర్వ జేడీ, థానే నగర జాయింట్ పోలీసు కమిషనర్‌ లక్ష్మీనారాయణ వెల్లడించారు. బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్) ల నుంచి ఆహ్వానాలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మంచి పరిపాలన దక్షత కలిగిన నాయకులను ఎన్నుకోవడం వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీబీఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డెరైక్టర్‌గా విధులు నిర్వహించి రిలీవ్ అయిన లక్ష్మీనారాయణ మహారాష్ట్రలోని థానే నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement