కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించి, బాధిత రైతులను పరామర్శించేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలమూరు పర్యటనకు వస్తున్నారని జిల్లా అధికారులకు సమాచారం అందింది. అయితే శ్రీకాకుళం జిల్లా వెళ్లిన సీఎం స్థానిక వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా, అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని, ఈ కారణంగానే జిల్లా పర్యటనను రద్దుచేసుకున్నట్లు తెలిసింది.
ఇక ముందుగా మంగళవారమే జిల్లాలో సీఎం పర్యటన ఉంటుందని సీఎం కార్యాలయం నుంచి అధికారులకు సమాచారం రాగా, వారంతా సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆ తరువాత బుధవారం ఉంటుందని మరోసారి సమాచారం వచ్చింది. దీంతో అధికారులు నివేదికలతోపాటు, ఇతరత్రా ఏర్పాట్లను సిద్ధంచేసుకుని సీఎం రాకకోసం సిద్ధమయ్యారు. అంతలోనే పరిస్థితులు అనుకూలించని కారణంగా పర్యటన వాయిదాపడినట్లు సమాచారం. ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అందలేదన్నారు.
సీఎం పర్యటన రద్దు!
Published Wed, Oct 30 2013 3:17 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement