విభజన ఆగితేనే సీఎం కొత్త పార్టీ!: ఏరాసు | kiran kumar reddy party T-Bill not passes : yerasu prathap reddy | Sakshi
Sakshi News home page

విభజన ఆగితేనే సీఎం కొత్త పార్టీ!: ఏరాసు

Published Mon, Jan 13 2014 1:38 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

విభజన ఆగితేనే సీఎం కొత్త పార్టీ!: ఏరాసు - Sakshi

విభజన ఆగితేనే సీఎం కొత్త పార్టీ!: ఏరాసు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోతే సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడతారేమోగానీ.. విభజన జరిగితే పార్టీ పెట్టడానికే అవకాశం ఉండదని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కొత్త పార్టీ పెడతారని, జెండా ఖరారైందని మీడియాలో మాత్రమే ప్రచారం జరుగుతోందన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఈ నెల 24, 25ల్లో అందరం కూర్చొని భవిష్యత్ కార్యచరణ ఖరారు చేసుకుందామని సీఎం తమతో చెప్పారన్నారు. సీమాంధ్ర నేతలు శుంఠలు అంటూ జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇలాంటివి మాట్లాడం అంత పెద్దాయనకు సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement