ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులు కోరిన సమాచారాన్ని సభలో అందించటంలో వివిధ శాఖలు విఫలం కావటం పట్ల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు అవసరమైన సమాచారాన్ని అధికారులు సమకూర్చకపోతే దాని ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు.
ఈ నెల ఐదో తేదీ నుంచి ఏపీ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణితో కలసి కోడెల వివిధ శాఖల అధిపతులు, పోలీసు అధికారులు, శాసనసభ సచివాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. 5న మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభ, మండలిలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. 10న బడ్జెట్ ప్రవేశ పెడతారన్నారు. 19న బాబా రాందేవ్ ఎమ్మెల్యేలకు యోగాలో శిక్షణ ఇస్తారని వివరించారు.
సమాచారంలో జాప్యం సరికాదు
Published Fri, Mar 4 2016 3:03 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement