నెల్లూరులో మహిళ హత్య | lady murdered in nellore distic | Sakshi
Sakshi News home page

నెల్లూరులో మహిళ హత్య

Published Tue, Apr 7 2015 9:07 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

lady murdered in nellore distic

నెల్లూరు: తన మాట వినడం లేదనే కోపంతో ప్రియురాలిని హత్య చేశాడో వ్యక్తి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా వెనుగోపాల నగర్‌లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కాలనీకి చెందిన నాగలక్ష్మి(25), పెంచలయ్య(35) గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. సోమవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

దీంతో కోపోద్రిక్తుడైన పెంచలయ్య ఆమెను హత్య చేశాడు. ఈ విషయాన్ని బంధువులకు చెప్పి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement