'ల్యాండ్ పూలింగ్ తో రైతులకు ప్రయోజనం లేదు' | land pooling is not correct way says retd justice lakshmana reddy | Sakshi
Sakshi News home page

'ల్యాండ్ పూలింగ్ తో రైతులకు ప్రయోజనం లేదు'

Published Wed, Jan 21 2015 3:45 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

'ల్యాండ్ పూలింగ్ తో రైతులకు ప్రయోజనం లేదు' - Sakshi

'ల్యాండ్ పూలింగ్ తో రైతులకు ప్రయోజనం లేదు'

గుంటూరు:  ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల ప్రభుత్వానికి తప్ప రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేదని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అన్నారు. మంగళగిరి మండలం ఎర్రపాలెంలో బుధవారం రైతులు-రైతు కూలీలతో జనవిజ్ఞానవేదిక ముఖాముఖి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభానాధ్రీశ్వరరావు, జన చైతన్య వేదిక సభ్యులు పాల్లొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ...రైతుల భూములను తాకట్టు పెట్టే విదానాన్ని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. రాష్ట్రం ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉందని, 5 ఏళ్ల లో రాజధాని నిర్మాణం సాధ్యంకాదని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement