విజయవాడ: రైతులు ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరని రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణ్రెడ్డి మాట్లాడుతూ... మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, దేశంలో న్యాయవ్యవస్థులు ఇంకే బతికే ఉన్నాయన్నారు. లాండ్ పూలింగ్ అనేది సరైనది పద్దతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
దీని వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో రైతుల నుంచి భూములు తీసుకోలేకపోయారని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సీఆర్డీఏ కూడా చట్టానికి అతీతమేం కాదని అన్నారు.