justice lakshmana reddy
-
భూ తగాదాలకు ఫుల్ స్టాప్..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
-
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసు కుంటున్న చర్యల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. లోకాయుక్త నియామకానికి చర్యలు ప్రారం భించింది. రాష్ట్ర లోకాయుక్తగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించాలని నిర్ణయించింది. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులు బాటు ప్రభుత్వానికి ఉంది. లోకాయుక్త నియామకం విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిం చాల్సి ఉంటుంది. ఇటీవల లోకాయుక్త నియామక ఫైలును పరిశీలించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్.. లక్ష్మణ్‌రెడ్డి నియామకానికి ఆమోదముద్ర వేశారు. తర్వాత ప్రభుత్వం కూడా ఆయన నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఉత్తర్వులు వెలువ డనున్నాయి. లోకాయుక్త పరిధి.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్య దర్శులపై వచ్చే ఫిర్యాదులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్ విప్‌లతో పాటు.. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించే ఏ అధికారిపైనైనా కూడా ఫిర్యాదు చేయ వచ్చు. జెడ్పీ, మండల పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు సభ్యులు, మునిసిపాలిటీ చైర్పర్సన్, ఇతర సభ్యులు తదితరులపై వచ్చే ఫిర్యాదుల న్నింటిపై లోకాయుక్త విచారణ జరపవచ్చు. న్యాయమూర్తులు, జ్యుడీషియల్ సర్వీసు సభ్యులు.. లోకాయుక్త పరిధిలోకి రారు. రాష్ట్రంలోనే ఏదైనా కోర్టు అధికారి, ఉద్యోగి కూడా లోకాయుక్త పరిధిలోకి రారు. ఏపీ అకౌంటెంట్ జనరల్, ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఎన్నికల అధికారులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఏపీఏటీ చైర్మన్, ఇతర సభ్యులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉండదు. అవినీతి, అధికార దుర్వినియోగం తదితరాల విషయంలో ఏ వ్యక్తి అయినా లోకాయుక్తను ఆశ్రయించవచ్చు. ఫిర్యాదుదారు తన పూర్తి వివరాలతో ఫారమ్ 1, 2ను పూర్తిచేసి.. లోకాయుక్త రిజిస్ట్రార్ పేరిట రూ.150 ఫీజు చెల్లించాలి. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు తేలితే ఫిర్యాదుదారుని ప్రాసిక్యూషన్ చేయవచ్చు. గరిష్టంగా ఏడాది జైలు శిక్ష కూడా విధించవచ్చు. -
'ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిందే'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అమలు చేయాల్సిందే అని విశ్రాంత న్యాయమూర్తి, జన చైతన్య వేదిక కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.. కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీతో ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ (http://www.apspecialstatus.in)ను ఆయన ప్రారంభించారు. ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, అందుకు ఉద్యమించడమే మార్గమన్నారు. ఉద్యమం ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని దీనికి యువత ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పాత్రికేయుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ... పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని రాజకీయ ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా కేంద్రం భిక్ష కాదు.. ఏపీ ప్రజల హక్కు అని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. -
ముద్రగడపై ప్రయోగం వికటించిందా?
- రంగాను హతమార్చిన పని ఎవరిది? - సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సి మాటలా ఇవి.. - బాబు రాయలసీమ వాసినన్న విషయం మరిస్తే ఎలా.. - బాబు ఏపీ ముఖ్యమంత్రా లేక ఆంధ్రా వాసులకే సీఎం ఆ? - ముద్రగడపై ప్రయోగం వికటించిందా? -రాయలసీమ అభివృద్ధి సమితి ఫౌండర్ జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి ఆక్షేపణ సాక్షి, సిటీబ్యూరో: తూర్పు గోదావరి జిల్లా తుని సంఘటన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన ఎంపీ మురళీమోహన్ రాయలసీమ సంస్కృతిని కించపరుస్తూ మాట్లాడటం ఎంత మాత్రం సరైంది కాదని రాయలసీమ అభివృద్ధి సమితి ఫౌండర్ జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి ఆక్షేపించారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధి సమితి, గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (గ్రాట్) ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ తుని సంఘటనకు రాయసీమవారిని, ముఖ్యంగా పులివెందుల వాసులను బాధ్యులు చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో ఉండగానే, నిజానిజాలు బయటకు రాకముందే మాట్లాడాల్సిన అంత అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. మందస్తు కుట్రతో విచారణ అధికారుల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ పేరు, పులివెందుల పేర్లు తీసుకువచ్చారన్నారు. రాష్ట్రాని ప్రత్యేక హోదా ఇస్తే ఎక్కడ రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తారోనన్న భయం చంద్రబాబుకు పట్టుకుందని ఎద్దేవా చేశారు. వచ్చే పరిశ్రమలన్నీ అమరావతి దాని చుట్టూ ఏర్పాటు చేసుకోవాలన్నా కుట్రతో చంద్రబాబు ఆయన అనుచర గణం ఒక పథకం ప్రకారం రాయలసీమ అంటే అందరికి భయబ్రాంతులు కలిగేలా ప్రచారం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఇలా మాట్లాడుతూ ఉంటే రాయసీమ ప్రజా ప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం స్పందించక పోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రంలో ఉంటున్న ప్రజలలో ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా మురళీమోహన్, చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి సమితి వ్యవస్థాపకుడు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి ఎ. హనుమంతరెడ్డి మాట్లాడుతూ కాపుల నేత రంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుండగా బస్సులో వచ్చి హతమార్చిన సంస్కృతి ఎవరిదని ప్రశ్నించారు. అదే రంగా అన్న రాధాని మోసగించి చంపిన సంస్కృతి ఎవరిదని నిలదీశారు. అదే ఎత్తుగడ ముద్రగడ పద్మనాభం మీద ప్రయోగించగా అది వికటించిందా ? అని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే రాయలసీమ ప్రజల మీద నింద మోపుతున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. కారంచేడు వంటి హింసాత్మక ఘటనలు ఎవరి సంస్కృతి, అలాగే ఆస్తి కోసం చిన్నారి వైష్ణవిని చంపిన సంస్కృతి ఎవరిదని ప్రశ్నించారు. రాయలసీమలో ఎన్నో రైళ్లు తగులబెట్టారు? శ్రీలక్ష్మి వంటి ఎందరో అమాయక స్త్రీలను చంపిన సంస్కతి ఎవరిదో ప్రజలకు తెలియనది కాదన్నారు. 2014లో రేప్ కేసుల్లో కృష్ణా జిల్లాలో 144, పశ్చిమ గోదావరిలో 139, తూర్పు గోదావరి జిల్లాలో 77, గుంటూరు జిల్లాలో 87 నమోదు అయితే తరచు సీఎం బాబు ప్రస్తావించే పులివెందుల ఉన్న కడప జిల్లాలో 29, కర్నూల్లో 31, అనంతపురంలో 35, చిత్తూరులో 49 కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. క్రైమ్ రేట్ ఒక లక్ష జనాభాకు గుంటూరులో 620, కష్ణాలో 623, పులివెందుల ఉన్న కడపలో 182 నమోదు అయినట్లు చెప్పారు. దాని సంబంధించిన డేటాను మీడియా ముందు ఉంచుతున్నానని హనుమంతరెడ్డి చెప్పారు. ఏపీ పాలకులు ఇలాగే వ్యవహరిస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుకు యువత ముందుకు కదిలినా ఆశ్చర్యపోవాల్సి అవసరం ఉండదన్నారు. -
బాబూ..ప్రజల మధ్య చిచ్చుపట్టొద్దు
-
బాబూ.. ప్రజలమధ్య చిచ్చు పెట్టొద్దు
బాబుపై గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో చిక్కుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆ ఊబి నుంచి బయటపడేందుకు రెండు రాష్ట్రాల ప్రజలమధ్య చిచ్చుపెట్టే కుట్రలకు పాల్పడటం దారుణమని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(గ్రాట్) దుయ్యబట్టింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత వ్యవహారాలను ప్రజలతో ముడిపెట్టి పబ్బం గడుపుకోవాలని చూడటం సమంజసం కాదంది. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన పలువురు గ్రాట్ నేతలు నేరుగా పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు తీరును తప్పుపట్టారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి, గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వాధినేతలు, ప్రజాప్రతినిధులపై నేరారోపణలొస్తే అవి పూర్తిగా వారి వ్యక్తిగతమైనవేగానీ ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధించినవి కానేరవు. అలాంటి నేరారోపణలొస్తే వారిని ఎన్నుకున్న ప్రజలకు ఆపాదించడం, రెచ్చగొట్టడం క్షమార్హం కాద’’ని స్పష్టం చేశారు. ‘‘ఏడాదిగా గుర్తుకురా ని సెక్షన్-8 ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది? ఏ సంఘటన జరిగిందని ఇప్పు డు దానిగురించి మాట్లాడుతున్నారు? మీరు తప్పుడు పనులు చేసి ఊబిలో చిక్కుకుని తప్పించుకునేందుకు మమ్మల్ని(తెలుగు ప్రజలను) అందులోకి లాగుతున్నా రు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. ఈ విషయంలో ఇక్కడ(తెలంగాణలో) వేలుపెట్టే అధికారం ఆంధ్ర ప్రభుత్వానికి లేదు’’ అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఐజీ హనుమంతరెడ్డి అన్నారు. ‘‘బాబు తనకున్న మచ్చల్ని ప్రజ లపై రుద్దేయత్నం చేస్తున్నారు. అక్కడి(ఆంధ్ర) ప్రభుత్వం నేరగాళ్లను రక్షించే ప్రయత్నం చేయడం సిగ్గుచేట’’ని సీనియర్ న్యాయవాది జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలనుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి అండగా ఉండేందుకు గ్రాట్ ఏర్పాటు చేసినట్టు దాని జ నరల్ సెక్రటరీ రాధాకృష్ణ చెప్పారు. -
'ల్యాండ్ పూలింగ్ తో రైతులకు ప్రయోజనం లేదు'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల ప్రభుత్వానికి తప్ప రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేదని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అన్నారు. మంగళగిరి మండలం ఎర్రపాలెంలో బుధవారం రైతులు-రైతు కూలీలతో జనవిజ్ఞానవేదిక ముఖాముఖి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభానాధ్రీశ్వరరావు, జన చైతన్య వేదిక సభ్యులు పాల్లొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ...రైతుల భూములను తాకట్టు పెట్టే విదానాన్ని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. రాష్ట్రం ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉందని, 5 ఏళ్ల లో రాజధాని నిర్మాణం సాధ్యంకాదని చెప్పారు. -
'కొన్ని మీడియా సంస్థలు భయపెడుతున్నాయి'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ (ల్యాండ్ పూలింగ్) విధానం సరిగా లేదని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ల్యాండ్ పూలింగ్ విధానంపై తన వైఖరి మార్చుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి బృందం పర్యటిస్తుంది. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి... స్థానిక రైతులతో మాట్లాడారు. నూతన రాజధాని ఏర్పాటు... నిర్మాణంపై కొన్ని మీడియా సంస్థలు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. న్యాయ సహాయం అందిస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. -
'లాండ్ పూలింగ్ సరైంది కాదు'
విజయవాడ: రైతులు ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరని రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ... మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, దేశంలో న్యాయవ్యవస్థులు ఇంకే బతికే ఉన్నాయన్నారు. లాండ్ పూలింగ్ అనేది సరైనది పద్దతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో రైతుల నుంచి భూములు తీసుకోలేకపోయారని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సీఆర్డీఏ కూడా చట్టానికి అతీతమేం కాదని అన్నారు. -
'అధిష్టానం ఆదేశాలతో సీఎం పని చేస్తున్నారు'
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోనే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పని చేస్తున్నారని జస్టిస్ లక్ష్మణరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనకు ఆయన సహకరిస్తూ అధిష్టానం ఆదేశాలను యథావిధిగా పాటిస్తున్నారన్నారు. అసెంబ్లీలో విభజనపై చర్చల్లో పాల్గొనడమంటే.. విభజనకు మద్దతిచ్చినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. రాష్ట్ర విభజన పేరుతో కేంద్రం ప్రభుత్వం మైండ్‌గేమ్ ఆడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. విభజన జరిగిపోయిందన్న వాదనను తిప్పికొట్టాలని ఆయన సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.