హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోనే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పని చేస్తున్నారని జస్టిస్ లక్ష్మణరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనకు ఆయన సహకరిస్తూ అధిష్టానం ఆదేశాలను యథావిధిగా పాటిస్తున్నారన్నారు. అసెంబ్లీలో విభజనపై చర్చల్లో పాల్గొనడమంటే.. విభజనకు మద్దతిచ్చినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు.
రాష్ట్ర విభజన పేరుతో కేంద్రం ప్రభుత్వం మైండ్గేమ్ ఆడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. విభజన జరిగిపోయిందన్న వాదనను తిప్పికొట్టాలని ఆయన సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.