గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ (ల్యాండ్ పూలింగ్) విధానం సరిగా లేదని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్రెడ్డి అభిప్రాయపడ్డారు. ల్యాండ్ పూలింగ్ విధానంపై తన వైఖరి మార్చుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో జస్టిస్ లక్ష్మణ్రెడ్డి బృందం పర్యటిస్తుంది.
ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్రెడ్డి... స్థానిక రైతులతో మాట్లాడారు. నూతన రాజధాని ఏర్పాటు... నిర్మాణంపై కొన్ని మీడియా సంస్థలు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. న్యాయ సహాయం అందిస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.