తెనాలి రూరల్ : ఏపీ డ్రైవర్ల సామాజిక భద్రత పేరిట అసంఘటిత రంగంలో పనిచేస్తున్న డ్రైవర్ల కోసం అమలు చేస్తున్న బీమా పథకం వెలవెలబోతోంది. బుధవారం నాటితో గడు వు ముగుస్తున్నా పథకంలో చేరేందుకు డ్రైవర్లు ముందుకు రావడం లేదు. లారీ, ట్రక్కు, టాక్సీ, ఆటో డ్రైవర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే అధికారుల ప్రచారలోపం పథకం లక్ష్యం నెరవేరడం లేదు.
ఇవీ ప్రయోజనాలు..
జిల్లాలో 54 వేల మంది డ్రైవర్లు ఉండగా, ఇప్పటి వరకు 16,500 డ్రైవర్లు మాత్రమే ఈ పథకం కోసం పేర్లు నమోదు చేయించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మరణిస్తే రూ. 5 లక్షలు, శాశ్వత వైకల్యం బారిన పడితే రూ. 75 వేలు, సగం వైకల్యం ఏర్పడితే రూ. 37,500 చొప్పున అందిస్తారు. డ్రైవర్ సహజంగా మ రణిస్తే అతని కుటుంబానికి రూ.30 వేలు ఆర్థిక సాయంగా అందిస్తారు. బీమా చేయించుకున్న డ్రైవర్ల పిల్లలకు 9,10 తరగతులు, ఇంటర్మీడియెట్, ఐటీఐలో ఏడాదికి రూ.1,200 చొప్పున ఉపకారం వేతనం అందిస్తారు.
గడువు పొడిగించినా..
ఈ పథకంపై అవగాహన కల్పించడ ం, పేర్లు నమోదు చేయించడంలో అధికారు లు తగిన శ్రద్ధ చూపకపోవడంతో డ్రైవర్ల నుంచి స్పందన కరువైంది. లెసైన్స్‌తో పాటు బ్యాడ్జి కలిగిన లారీ, ట్రక్కు, ఆటో, టాక్సీ డ్రైవర్లు ఈ పథకం లో చేరేందుకు అర్హులు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసు వారందరికీ ఇది వర్తిస్తుంది. ఈ ఏడాది మే 31 వరకు ఈ పథకానికి గడువు ఇవ్వగా, ప్రచార లోపంతో డ్రైవర్ల నుంచి ఆదరణ లభించలేదు. దీంతో ఆగస్టు నెలాఖరు వరకు గడువు పెంచారు. అయినా ఇప్పటి వరకు 30 శాతం మంది డ్రైవర్లు కూడా తమ పేర్లు నమోదు చేయించుకోలేదు. దీంతో తిరిగి సెప్టెంబర్ నెలాఖరు వరకు గడువు పొడిగించారు.
ఇవి కావాలి..
డ్రైవర్ పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటో, డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్, రేషన్‌కార్డు కాపీలు, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్(ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పనిసరి), నామినీకి సంబంధించిన ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్సు, పిల్లలు 9,10, ఇంటర్, ఐటీఐ చదువుతుంటే వారి వివరాలను కార్మికశాఖ కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తు ఉచితంగా లభిస్తుంది. యూజర్ చార్జీల కింద ఇంటర్నెట్, మీ సేవా కేంద్రాల్లో రూ. 25 చెల్లించాలి. కార్మికశాఖ, ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ కార్యాలయాల్లో లేదా మీ సేవా కేంద్రాల్లోగానీ నమోదు చేయించు కోవచ్చు.
ఫోన్ నంబర్లు సేకరించి సమాచారం ఇస్తున్నాం..
డ్రైవర్ల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి సమాచారం అందిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు గడువు పెంచడంతో పూర్తి స్థాయిలో డ్రైవర్లను భాగస్వాములను చేయాలన్న పట్టుదలతో ఉన్నాం. ఇటీవల తెనాలి డివిజన్‌లో ఐదు వేల మందిని పథకంలో చేర్పించాం.
- ఆర్. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్, కార్మిక శాఖ, తెనాలి
ఆఖరి రోజు !
Published Wed, Sep 30 2015 3:24 AM | Last Updated on Sat, Aug 18 2018 9:26 PM
Advertisement
Advertisement