వాస్తవాలు వెలుగు చూస్తాయనే విపక్ష నేత మైక్ కట్ | Leader of Opposition in the light of the facts custayane Mike cut | Sakshi
Sakshi News home page

వాస్తవాలు వెలుగు చూస్తాయనే విపక్ష నేత మైక్ కట్

Published Mon, Mar 23 2015 2:38 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Leader of Opposition in the light of the facts custayane Mike cut

  • కేంద్ర మాజీ మంత్రి కృపారాణి
  •  శ్రీకాకుళం: వాస్తవాలు వెలుగు చూస్తాయనే భయంతోనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడే సమయంలో సీఎం ఆదేశాలతోనే స్పీకర్ మైక్ కట్ చేశారని కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

    పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమలపై జగన్ మాట్లాడుతుంటే  స్పీకర్ మైక్ కట్ చేయడం ప్రతిపక్షం గొంతు నొక్కడమేనన్నారు. రుజువులతో సహా ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే అదికారపక్షం వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. స్పీకర్ కోడెల సభానాయకుని చేతిలో కీలుబొమ్మలా మారడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష నేత మైక్ క ట్ చేయడం ఎన్నడూ చూడలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement