
కోర్టు ఉత్తర్వులను గౌరవించడం నేర్చుకోండి
ప్రభుత్వ అధికారులకు హైకోర్టు హితవు
హైదరాబాద్: న్యాయస్థానాల పట్ల, అవి ఇచ్చే ఉత్తర్వుల పట్ల అధికారులు గౌరవం చూప డం నేర్చుకోవాలని హైకోర్టు హితవు పలికింది. కోర్టు ఉత్తర్వులకన్నా అధికారులు విదేశీ పర్యటనలకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోందంటూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాస నం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన(రాజకీయ) శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీపై ధర్మాసనం ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. బుధవారం తివారీ అప్పీళ్లన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ విచారణకు తివా రీ కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టులు రా జ్యాంగబద్ధంగా ఏర్పాటయ్యాయన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని హితవు పలికింది.
కోర్టు ఉత్తర్వుల అమలు చేయకుంటే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అధికారులు వివరించాలని తివారీ తరఫున హాజరైన ఆంధ్రప్రదేశ్ అ డ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్‌కు ధర్మాసనం సూచించింది. విదేశీ పర్యటనలకన్నా కోర్టు ఉత్తర్వులు, ఆదేశాలు ముఖ్యమన్న విషయంపై అధికారులను చైతన్యపరచాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని, సిం గిల్ జడ్జి ముందు హాజరై క్షమాపణ కోరాలని, అలా చేయని పక్షంలో వారెంట్ అమల్లోకి వస్తుం దని తివారీకి ధర్మాసనం తేల్చి చెప్పింది.