కౌలు రైతుల కష్టాలకు అంతూపొంతూ ఉండటం లేదు. పంట రుణం మంజూరు సంగతి దేవుడెరుగు.. కనీసం రుణ అర్హత కార్డులే ఇంతవరకు వారికి అందలేదు. పది రోజులపాటు గ్రామ సభలు నిర్వహించి మరీ దరఖాస్తులు స్వీకరించిన రెవెన్యూ అధికారులు తర్వాత పట్టించుకోవటం మానేశారు. దీంతో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయూరైంది. ఖరీఫ్ పంటలెలా సాగు చేయూలో అర్థం కాక వారు ఆందోళన చెందుతున్నారు.
తెనాలి టౌన్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా జిల్లాలోని కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇంకా మంజూరు కాలేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయూరైంది. జిల్లాలో రెండున్నర లక్షల మంది కౌలు రైతులు ఉండగా గత ఏడాది రెవెన్యూ అధికారులు 30 వేల మందికి మాత్రమే కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ ఏడాది కార్డుల మంజూరు నిమిత్తం ఈ నెల 9 నుంచి 19వ తేదీ వరకు తెనాలి డివిజన్‌లోని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. వీటిలో డిప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారులు, వీఆర్వోలు పాల్గొని కౌలు రైతులను చైతన్య పరచి అర్జీలు తీసుకున్నారు. తర్వాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వడ్డీ వ్యాపారుల వలలో..
బ్యాంకు అధికారు లు రుణాలు ఇవ్వకపోవడంతో కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పు తీసుకుని విలవిల్లాడుతున్నారు.మరోవైపు.. పంట పెట్టుబడు లు, కూలీల ఖర్చులు, కౌలు ధరలు పెరగడంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన హెలెన్ తుఫాన్ దెబ్బకు కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారు. టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పథకం వర్తించకపోరుునా, ఈ ఏడాది బ్యాంకు రుణాలు మంజూరు కాకపోరుునా ఆత్మహత్యలే శరణ్యమనివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 2.50 లక్షల మంది కౌలుదారులు ఉంటే వారిలో కేవలం 30 వేల మందికి మాత్రమే కార్డులు ఇచ్చి గత ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కార్డులున్నవారిలో కనీసం 3 వేల మందికి కూడా బ్యాంకు రుణాలు అందలేదు. రుణ అర్హత కార్డు తీసుకుంటే కౌలుకు భూమి ఇచ్చేది లేదని యాజమానులు కచ్చితంగా చెబుతున్నారు.
వ్యవసాయ శాఖ ద్వారా ఎరువులు, పురుగు మందులకు అందించే రాయితీలు పొందటానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట దెబ్బతింటే నష్టపరిహారం అందుకోవటానికి, బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకోవడానికి కౌలు రైతులకురుణ అర్హత కార్డులు అవసరం.
కౌలు రైతులంటే చిన్నచూపు..
కౌలు రైతులను బ్యాంకు అధికారులు చిన్నచూపు చూస్తున్నారని కౌలు రైతుల సంఘం డివిజన్ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోడకు వేసిన సున్నం ఎలా తిరిగిరాదో, కౌలుదారులకు ఇచ్చిన రుణం గ తి కూడా అంతేనని ఒక బ్యాంకు మేనేజర్ తనతో అన్నారని వాపోయూరు.
కౌలు రైతుకు ‘కార్డు’ కష్టం!
Published Sat, Jul 26 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM
Advertisement
Advertisement