ముత్తుకూరు: నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం వచ్చే బడ్జెట్లో ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. రూ 9.20 కోట్ల అంచనాలతో చేపట్టే ముత్తుకూరు-పంటపాళెం రోడ్డు పున ర్నిర్మాణ పనులకు బుధవారం కాకాణి పంటపాళెంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అభివృద్ధి పనులు చేస్తే ఎమ్మెల్యేలకు ప్రజల్లో పేరు వస్తుందేమోనని సర్కారు నిధులు కేటాయించడం లేదన్నారు. ప్రయోగాల పేరుతో సర్కారు జిమ్మిక్కులు చేస్తోందన్నారు. ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించకపోవడం, అభివృద్ధి పర్యవేక్షణకు గ్రామకమిటీలు ఏర్పాటు చేయడాన్ని ప్రయోగాలు అనుకోవాలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించకుండా నిధుల కోటా ఇవ్వాలన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు.
ముత్తుకూరుకు నాలుగు లేన్ల రోడ్డు
నెల్లూరు నుంచి ముత్తుకూరు మీదుగా కృష్ణపట్నం పోర్టు రోడ్డు కలిసేలా నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుకు కృషిచేస్తామని కాకాణి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల మరమ్మతుకు అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేస్తే, ప్రభుత్వం నుంచి నిధుల సాధనకు కృషిచేస్తామని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈకి సూచించారు. ప్రజలు తనపై పెట్టుకొన్న విశ్వాసం వమ్ముచేసేది లేదన్నారు. పంటకాల్వల పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయని ప్రభుత్వంగా టీడీపీ సర్కారు గుర్తింపుపొందిందన్నారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయకుమార్, ఈఈ ఎల్ శివప్రసాద్‌రెడ్డి, డీఈఈ రామారావు, ఏఈ నెల్లూరు గోపీకృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ, పార్టీ కన్వీనర్ మెట్టా విష్ణువర్థనరెడ్డి, నాయకులు మారు సుధాకర్‌రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, ఇసనాక చంద్రశేఖర్‌రెడ్డి, అనంతరాజు వేణుగోపాల్, ఆలపాక శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యులు గండవరం సుగు ణ, మండల ఉపాధ్యక్షుడు సర్పంచ్‌లు రొయ్యల రంగనాథం, సుబ్రహ్మణ్యం, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ గండవరం సూరి, కందలూరు వెంకట్రామరెడ్డి, బందెల వెంకటరమణయ్య, రాగాల వెంకటేశ్వర్లు, పోలిరెడ్డి చిన్నపరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలి
Published Thu, Feb 5 2015 3:18 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement