భార్యను చంపిన వ్యక్తికి జీవితఖైదు
Published Fri, Sep 13 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
కామారెడ్డి, న్యూస్‌లైన్: అదనపు కట్నం తేవాలని, అనుమానంతో భార్యను వేధింపులకు గురిచేసి చివరకు గొంతునులిమి హతమార్చిన భర్తకు జీవితఖైదు విధిస్తూ కామారెడ్డి తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి టి.వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.రాజ్‌గోపాల్‌గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసముండే కమ్మరి ఉమాకాంత్ భార్య స్వర్ణలత అలియాస్ హారిక 2010, నవంబర్ 9న హత్య కు గురైంది. ఆమెను భర్తే హత్య చేసినట్టు వి చారణలో నిర్ధారణ కావడంతో నిందితుడికి జీవితఖైదుతో పాటు సాక్ష్యాధారాలను తారుమారు చేసినందుకు మరో మూడేళ్ల జైలుశిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు.
కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మం డలం వీరన్నపల్లికి చెందిన సత్తయ్య కూతురు స్వర్ణలత అలియాస్ హారికను కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌కు చెందిన కమ్మరి ఉమాకాంత్‌కు ఇచ్చి 2009, జూలై 31న వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా రూ.2.50 లక్షల కట్నం, 10 తులాల బంగారం, 10 తు లాల వెండి, రూ.20 వేల విలువైన సామగ్రిని ఇ చ్చారు. భార్య, భర్తలిద్దరూ కామారెడ్డిలో అద్దె ఇంట్లో నివాసం పెట్టారు. పెళ్లి తరువాత కొం తకాలం బాగానే కాపురం చేసిన ఉమాకాంత్, మూడు నెలల తరువాత అదనపు కట్నంగా రూ.50 వేలు తీసుకురమ్మంటూ భార్యను వేధిం పులకు గురిచేశాడు. హారిక తల్లిదండ్రులు అ ల్లుడిని సముదాయించినా అతనిలో మార్పు రాలేదు.
2010లో దీపావళి పండుగకు ఒకరో జు ముందు ఉమాకాంత్ హారికతో కట్నం గురించి గొడవపడ్డాడు. కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని అదే రోజు హారిక తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పింది. తల్లిగారింటికి వెళ్లిన సందర్భాల్లో హారిక ఫోన్ బిజీగా ఉండడానికి కారణం ఆమెకు అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు చేస్తూ ఉమాకాంత్ పలుమార్లు వే ధింపులకు గురిచేశాడు. 2010, నవంబర్ 9న ఉదయం 10 గంటల ప్రాంతంలో హారికతో గొడవపడి పథకం ప్రకారం హారికను బెడ్‌పైకి తోసి మెత్తను ముక్కుపై, నోటిపై గట్టిగా అది మిపట్టి చంపేశాడు. ఇంట్లో దొంగలుపడి తన భార్యను హత్యచేసి, నగలు దోచుకెళ్లారని ఉ మాకాంత్ చిత్రీకరించాడు.
హారిక మెడపై ఉ న్న బంగారు పుస్తెలతాడు, చెవికమ్మలను తీసి తన స్టీల్ షాపులో పెట్టి సాక్ష్యాలను తారుమా రు చేశాడు. తమ కూతురును అల్లుడే చంపాడని హారిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అప్పటి ఎస్సై శంకరయ్య కేసు నమోదు చేయగా, అప్పటి డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి విచారణ జరిపి ఆమె భర్త ఉమాకాంత్ హత్యచేశాడని, సాక్ష్యాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేశారు. దుకాణంలో దాచిఉంచిన బంగారం నగలను స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో కామారెడ్డి 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి టి.వెంకటేశ్వర్‌రెడ్డి ప్రధాన సాక్షులు 18 మందిని విచారించి వారు చెప్పిన సాక్ష్యాల ఆధారంగా నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక ప్రాసిక్యూటర్ టి.రాజగోపాల్‌గౌడ్ వాదించారు.
Advertisement
Advertisement