నాళేశ్వర్(నవీపేట), న్యూస్‌లైన్: నాళేశ్వర్‌లో శుక్రవారం నాళేశ్వర్ ఎత్తిపోతల పథకం పాలకవర్గం ఎన్నికలు ప్రశాంతం గా జరిగాయి. పథకం పరిధిలో 280 ఓట్లు ఉం డగా 276 పోలయ్యాయి. ఇందులో 18 ఓట్లు చెల్లలేదు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సా యంత్రం ఆరున్నర గంటల వరకు కౌంటింగ్ సాగింది. 11 డెరైక్టర్ స్థానాలకోసం 38 మంది పోటీ పడ్డారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ సుధాకర్ ఆధ్వర్యంలో బందోబ స్తు ఏర్పాటు చేశారు.
డెరైక్టర్లు వీరే
విజేతలను ఎన్నికల అధికారులు మనోజ్‌కుమా ర్, గంగాధర్ గౌడ్ ప్రకటించారు. పుప్పాల భో జన్న, పాందు మల్లయ్య, ద్యాగ అంజయ్య, ఆర్మూర్ గంగాధర్, ద్యాగ మల్లయ్య, మైస కొం డయ్య, తూం గుండన్న, కోలకొండ శ్రీనివాస్, ఆర్మూర్ భోజన్న, తూం లక్ష్మణ్, మగ్గరి నర్స య్య డెరైక్టర్లుగా ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు.
చైర్మన్‌గా పాందు మల్లయ్య?
ఎత్తిపోతల పథకం చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పాందు మల్లయ్య, మైస కొండ య్య, పుప్పాల భోజన్న పోటీ పడ్డారు. ముగ్గు రు ప్యానల్స్ ఏర్పాటు చేసుకొని బరిలో నిలిచా రు. అయితే మల్లయ్య వర్గంనుంచి ఐదుగురు గెలుపొందడంతో ఆయనే చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. శనివారం ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ప్రశాంతంగా ‘ఎత్తిపోతల’ ఎన్నికలు
Published Sat, Jan 4 2014 6:22 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement