పంట రుణాల పరిమితి పెంపు | Limit the growth of crop loans | Sakshi
Sakshi News home page

పంట రుణాల పరిమితి పెంపు

Published Thu, Oct 10 2013 3:26 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

Limit the growth of crop loans

= వరికి ఎకరాకు రూ.18 వేలు
 =    మిర్చికి రూ.50 వేలు, పత్తికి రూ.25 వేలు, అరటికి రూ.84 వేలు
 =    వచ్చే ఖరీఫ్ నుంచి అమలు
  =   జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ సమావేశంలో నిర్ణయం

 
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంట రుణాలను పెంచుతూ జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. బుధవారం హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయంలో చైర్మ న్ జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన టెక్నిక ల్ కమిటీ సమావేశంలో వ్యయం, ఉత్పత్తి, మార్కెట్ ధరలు, ఎరువుల ధరలు, కలుపు నివారణ ఖర్చులు, క్రిమి సంహారక మందుల ధరలు, యాంత్రీకరణ, ఇతర పెట్టుబడుల ఆధారంగా ఒక ఎకరాకు ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించారు.

దానిని వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి అమలు చేస్తారు. కమిటీ సభ్యులకు వారం రోజుల ముందుగా అంచనా నివేదిక అందజేయాలని, ములుగు, డోర్నకల్ నియోజకవర్గం నుంచి రైతు ప్రతినిధులను కమిటీలోకి తీసుకోవాలని, పంట రుణాల వివరాలను అన్ని బ్యాంక్ శాఖలు, పీఏసీఎస్ నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని తీర్మానించా రు.

సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కేఎన్‌వీఎస్.దత్త, నాబార్డు ఏజీఎం ఉదయ్ బాస్కర్, డీసీఓ బి.సంజీవరెడ్డి, వ్యవసాయ శాఖ సంయు క్త సాంచాలకుడు జి.రామారావు, ఉద్యాన శాఖ ఏడీ అక్బర్, రైతు శిక్షణ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఉమ్మారెడ్డి, శాస్త్రవేత్త వి.రాజేంద్రప్రసా ద్, డీసీసీబీ సీఈఓ సురేందర్, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

రుణాల వినియోగంపై అవగాహన కల్పించాలి : రాఘవరెడ్డి

రైతులకు పంట రుణాల వినియోగం, చెల్లింపులపై వ్యవసాయ అధికారులు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాలని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సూచించారు. మండలాల్లో పని చేసే వ్యవసాయ అధికారులు దీనిపై దృష్టి పెట్టేలా జాయింట్ డైరక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. సదస్సుల నిర్వహణకు తాము సహకరిస్తామని, అవసరమైతే పీఏసీఎస్‌ల ద్వారా నిర్వహించేందకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

వ్యవసాయ అధికారుల పనితీరు బాగోలేదు.. ఎరువుల అంచనాలు తయారు చేయమంటే శాతాల్లో చూపిస్తున్నారు.. నిర్ధిష్టం గా ఎంత అవసరమో చెప్పడం లేదన్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఒక మండలా న్ని, జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ఒక మం డలాన్ని సర్వే చేసి అంచనాలు తయారు చేయాలని సూచించినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రిజర్వుబ్యాంక్ నిర్ణయించిన రుణాల మీద 25 శాతం ఎక్కువ ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదన్నారు.
 
 రుణాలు పెంచితేనే ప్రైవేట్ అప్పు చేయరు
 రైతులకు సరిపడా రుణాలు లభించనపుడే ఇతరుల వద్ద అధిక వడ్డీలకు తీసుకొని అప్పుల పాలవుతున్నారు. రుణ పరిమితి పెంచి రైతుల అవసరం మేరకు రుణాలు ఇవ్వడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి.
 - ఉదయ్‌భాస్కర్, నాబార్డు ఏజీఎం
 
 పంటను బట్టి పరిమితి
 పంటను బట్టి రుణ పరిమితిని నిర్ణయిస్తాం. అన్ని కోణాల్లో అలోచించి రుణాలు పెంచుతాం. న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకున్నప్పుడే రైతులు తమకు ఎంత అవసరమో అంత రుణం పొంది లబ్ధిపొందుతారు.
 -కేఎన్‌వీఎస్.దత్తు, లీడ్ బ్యాంక్ మేనేజర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement